Home
News

ప్రైవేట్ టెల్కోల 2.5GB రోజువారీ డేటా ప్లాన్‌లో ఏది బెస్ట్ ఆప్షన్!!!

ప్రైవేట్ టెలికాం సంస్థలు వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో తమ యూజర్లకు విభాగాలలోను వివిధ రకాల ప్లాన్లను అందిస్తున్నారు. అధికంగా మరియు తక్కువగా కాకుండా మధ్యస్థంగా డేటాను వినియోగించే యూజర్లను దృష్టిలో ఉంచుకొని టెలికాం సంస్థలు అన్నీ 2.5GB రోజువారీ డేటా ప్రయోజనంతో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే వోడాఫోన్ ఐడియా మరియు భారతీ ఎయిర్‌టెల్ సంస్థలు తమ 2.5GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లను 28 రోజుల తక్కువ చెల్లుబాటుతో అందిస్తున్నాయి. అయితే రిలయన్స్ జియో అదే ప్లాన్‌ను 365 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. కాబట్టి మీరు స్వల్పకాలిక చెల్లుబాటుతో ఈ విధమైన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే వోడాఫోన్ ఐడియా లేదా ఎయిర్‌టెల్‌కు వెళ్లడం మంచిది. అయితే మీరు దీర్ఘకాలిక చెల్లుబాటు కోసం వెతుకుతున్నట్లయితే జియోకు వెళ్ళడానికి ఉత్తమం. అయితే ఈ ప్లాన్‌ల యొక్క వ్యక్తిగత ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో 2.5GB రోజువారీ డేటా ప్లాన్‌

రిలయన్స్ జియో 2.5GB రోజువారీ డేటా ప్లాన్‌

రిలయన్స్ జియో టెల్కో ఇటీవల తన వినియోగదారుల కోసం కొత్తగా 2.5GB రోజువారీ డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.2999 ధర వద్ద లభించే ఈ ప్లాన్ వినియోగదారులకు 2.5GB రోజువారీ డేటాతో వేగవంతమైన ఇంటర్నెట్‌ని అందిస్తుంది. ఇది సరసమైన-వినియోగ-విధానం (FUP) డేటా వినియోగం తర్వాత 64 Kbpsకి తగ్గుతుంది. దీనితో పాటు వినియోగదారులు రోజుకు 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ మొత్తం వాలిడిటీ కాలానికి 912.5GB డేటాను అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు JioTV, JioSecurity, JioCloud మరియు JioCinema వంటి అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు.

 

 

భారతి ఎయిర్‌టెల్ 2.5GB రోజువారీ డేటా ప్లాన్‌

భారతి ఎయిర్‌టెల్ 2.5GB రోజువారీ డేటా ప్లాన్‌

భారతి ఎయిర్‌టెల్ టెల్కో తన వినియోగదారులకు రూ.449 ధర వద్ద 2.5GB రోజువారీ డేటా ప్లాన్ ను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ కేవలం 28 రోజుల చాలా తక్కువ చెల్లుబాటుతో మాత్రమే లభిస్తుంది. FUP డేటా వినియోగం తర్వాత ఈ ప్లాన్ డేటా వేగంను 64 Kbpsకి తగ్గించబడుతుంది. వినియోగదారులు అదనంగా ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలకు ఉచిత యాక్సెస్ ను పొందుతారు. ఇందులో ఉచిత ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఫాస్ట్‌ట్యాగ్ క్యాష్‌బ్యాక్, షా అకాడమీ, వింక్ మ్యూజిక్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఉచిత ట్రయల్ వంటివి మరిన్ని ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్యాక్‌తో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజు కూడా ఉంటుంది.

వోడాఫోన్ ఐడియా 2.5GB రోజువారీ డేటా ప్లాన్‌

వోడాఫోన్ ఐడియా 2.5GB రోజువారీ డేటా ప్లాన్‌

చివరగా వోడాఫోన్ ఐడియా టెల్కో యొక్క 2.5GB రోజువారీ డేటా ప్లాన్ విషయానికి వస్తే ఇది రూ.409 ధర వద్ద అందుబాటులో ఉంది. ఈ జాబితాలో ఇదే చౌకైనది. కానీ ఈ ప్లాన్ కూడా 28 రోజుల చాలా తక్కువ వ్యాలిడిటీతో వస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజు ప్రయోజనాలను కూడా పొందుతారు. కానీ వినియోగదారులకు Vi Movies & TV యొక్క అదనపు Vi Hero అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు అలాగే ఉచిత ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలు ఉన్నాయి. Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలలో బింగే అల్ నైట్, వారాంతపు డేటా రోల్ ఓవర్ మరియు Data Delights వంటి అదనపు ఆఫర్‌లు ఉన్నాయి.

తీర్పు

తీర్పు

వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో ప్రైవేట్ టెల్కోల ప్రయోజనాలను పోల్చి చూస్తే కనుక మీరు స్వల్పకాలిక 2.5GB రోజువారీ డేటా ప్లాన్ కోసం వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్ ఉత్తమ మార్గం. దీర్ఘకాలం గురించి ఆలోచిస్తే మీకు రిలయన్స్ జియో తప్ప మరే ఇతర ఎంపిక లేదు. కానీ ప్రయోజనాల పరంగా కూడా ఇది అతి చెడ్డ ఒప్పందం కూడా కాదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio vs Airtel vs Vi 2.5GB Daily Data Plans: Which One is Best?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X