Home
News

Jio vs Airtel vs Vi:56 రోజుల వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌లో బెస్ట్ ఇదే

ఇండియాలో టెలికామ్ రంగంలోకి జియో ప్రవేశించినప్పటి నుండి జియో మరియు ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. ఈ కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్లను ఒకే ధర పరిధిలో లేదా ఒకే ధర వద్ద అందిస్తూ విభిన్న ప్రయోజనాలతో పోటీ పడుతున్నాయి. వోడాఫోన్ ఐడియా ఇప్పుడు VI గా రూపాంతం చెందిన్నప్పటి నుంచి జియో మరియు ఎయిర్‌టెల్ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లకు మునుపటి కంటే గట్టి పోటీని అందిస్తున్నది. ఎంతలా అంటే ఈ టెల్కోలు అన్నీ ఒకే ధర పరిధిలో తమ యొక్క ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ మరియు VI రెండూ తమ యొక్క రెండు నెలల వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను రూ.599 ధర వద్ద అందిస్తున్నాయి. అలాగే జియో సంస్థ రూ.598 ధర వద్ద అందిస్తున్నది. వాటన్నింటిలో ఏది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్నదో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

జియో రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

రిలయన్స్ జియో యొక్క రూ.598 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది మొత్తం చెల్లుబాటు కాలంలో 112GB డేటాను అందిస్తుంది. అంటే వినియోగదారుడు ప్రతిరోజూ 2GB FUP డేటాను పొందుతాడు. కొన్ని ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల వలె బోనస్ డేటా ప్లాన్‌లో చేర్చలేదు. ఈ డేటాతో పాటు వినియోగదారులకు జియో-జియో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు జియో నుండి నాన్-జియో కాలింగ్ కోసం 2000 FUP నిమిషాలు లభిస్తాయి. అలాగే Jio యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ చందాతో పాటు రోజుకు 100 SMS ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్‌తో ఈ ప్రయోజనాలతో పాటు ఒక సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ VIP OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనంను కూడా అదనంగా పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

ఎయిర్‌టెల్ రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

ఎయిర్‌టెల్ సంస్థ 56 రోజుల చెల్లుబాటుతో అందిస్తున్న రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 2GB డైలీ డేటాను అందిస్తుంది. అలాగే భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా వినియోగదారులకు అపరిమిత కాలింగ్‌ను మరియు రోజుకు 100SMSల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఎయిర్‌టెల్‌తో ఎవరికైనా కాల్ చేయడానికి ఎటువంటి FUP పరిమితి లేదు. ఈ ప్లాన్‌లో అనేక OTT ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది ఒక సంవత్సరం డిస్నీ + హాట్స్టార్ VIP సబ్స్క్రిప్షన్ యొక్క ఉచిత చందా. దానితో పాటు  ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, హెలోటూన్స్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ 1 సంవత్సరానికి, ఫాస్టాగ్‌లో రూ.150 క్యాష్ బ్యాక్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Vi (వోడాఫోన్ ఐడియా) రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

Vi (వోడాఫోన్ ఐడియా) రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

Vi (వోడాఫోన్ ఐడియా) అదే 56 రోజుల చెల్లుబాటుతో అందిస్తున్న రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్‌ వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో పాటుగా 28 రోజుల చెల్లుబాటుతో ప్యాక్‌లో బోనస్ గా 5GB డేటాను కూడా అందిస్తుంది. MPL‌లో గేమ్స్ ఆడటానికి కస్టమర్‌కు రూ.125 భరోసా బోనస్ నగదు కూడా అదనంగా లభిస్తుంది. దీనితో పాటు జోమాటో నుండి ఫుడ్ ఆర్డర్‌లపై రోజువారీ రూ.75 డిస్కౌంట్ కూడా ఉంది. Vi యొక్క  రూ.599 ప్లాన్ లో ఎటువంటి OTT ప్రయోజనం లేదు.

Best Mobiles in India

English summary
Jio vs Airtel vs Vi: 56 Days Validity Prepaid Plans Which One is Better
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X