Home
News

Jio vs Airtel vs Vi: ఆగష్టు 2021లో బెస్ట్ ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఇవే....

ఇండియాలోని టెలికాం కంపెనీలు అన్ని కూడా ప్రస్తుతం డేటా, వాయిస్ కాలింగ్ మరియు స్టీమింగ్ ప్రయోజనాలతో కూడిన విస్తృతమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేశాయి. ఇటీవల ప్రఖ్యాత టెల్కో తన పోస్ట్‌పెయిడ్ ఆఫర్‌లలో భాగంగా ప్రముఖ రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తొలగించడంతో పాటుగా కొన్ని సవరణలు కూడా చేసింది.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌

అయితే ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల విషయానికి వస్తే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా(Vi) సంస్థలు ఒకదానికొకటి పోటీపడి దాదాపు ధర వద్ద మరియు ఒకే ఒరకమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే ఆగస్టు 2021 లో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా(Vi) యొక్క ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఏవి మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నాయి వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతీ ఎయిర్‌టెల్ రూ .399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ రూ .399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ టెల్కో తన ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల జాబితాలో కొన్ని మార్పులు చేసినప్పటికీ ఎంట్రీ-లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ను మార్చకుండా ఇప్పటికీ అలాగే ఉంచింది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ హై-స్పీడ్ డేటా మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించబడింది. రూ.399 ధర వద్ద లభించే ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఎయిర్‌టెల్ డేటా రోల్‌ఓవర్ సదుపాయంతో 40GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. ఇది కాకుండా వినియోగదారులు రోజుకు 100 SMS లతో పాటు అపరిమిత లోకల్ మరియు ISD వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. స్టాండర్డ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద లభిస్తూ ఇది ఎయిర్‌టెల్ ఎక్స్‌టీమ్ కాకుండా ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లను అందించదు. అయితే వినియోగదారులు రూ.100 అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉంటే వారు రూ.499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇది ప్రత్యేకమైన స్టీమింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.

రిలయన్స్ జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల జాబితాలో రిలయన్స్ జియో యొక్క ప్లాన్ భారతీ ఎయిర్‌టెల్‌ ప్లాన్ కంటే మెరుగైన ప్రయోజనాలతో వస్తుంది. రిలయన్స్ జియో తన స్టాండర్డ్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అదనంగా OTT స్ట్రీమింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రూ.399 ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యూజర్లకు 75GB ఇంటర్నెట్ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క ఉత్తమ ఫీచర్ 200GB డేటా రోల్‌ఓవర్ సదుపాయం కలిగి ఉండడం. ఈ టెల్కో సిమ్ హోమ్ డెలివరీ మరియు ప్రీమియం కాల్ సెంటర్ సేవలను కూడా అందిస్తుంది. OTT ప్రయోజనాల విషయానికి వస్తే జియో వినియోగదారులు Netflix, అమెజాన్ ప్రైమ్ వీడియో, Disney+Hotstar VIP కి సబ్‌స్క్రిప్షన్‌లకు ఉచిత యాక్సిస్ ను పొందుతారు. అదనంగా వినియోగదారులు JioCinema, JioTV మరియు మరిన్ని వంటి వివిధ Jio యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లను పొందుతారు.

వొడాఫోన్ ఐడియా రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వొడాఫోన్ ఐడియా రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వొడాఫోన్ ఐడియా(Vi) ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలు దాదాపు భారతీ ఎయిర్‌టెల్‌ని పోలి ఉంటాయి. రూ.399 ధర వద్ద లభించే ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద వినియోగదారులు కేవలం ఒకే ఒక్క కనెక్షన్‌ను పొందుతారు. ఈ ప్లాన్ 40GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. దానితో పాటు వినియోగదారులు 200GB డేటా రోల్‌ఓవర్ సదుపాయాన్ని కూడా పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో OTT స్ట్రీమింగ్ ప్రయోజనాలు అందుబాటులో లేవు. అయితే వినియోగదారులు ప్రీమియం మూవీలు, ఒరిజినల్స్, లైవ్ టీవీ, న్యూస్ మరియు మరిన్నింటికి యాక్సెస్ అందించే Vi మూవీస్ మరియు టీవీకి యాక్సెస్ పొందుతారు. ఎయిర్‌టెల్ మాదిరిగానే వోడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు రూ.499 ప్లాన్‌ను ఎంచుకుంటే వారు రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ వీడియోకి ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio vs Airtel vs Vi: Best Entry-Level Postpaid Plans in August 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X