Home
News

Jio Vs Airtel Vs Vi: Disney+ Hotstar VIP చందాను ఉచితంగా అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) మరియు రిలయన్స్ జియోతో సహా అన్ని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తమ వినియోగదారులకు అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కొన్ని డిస్నీ + హాట్‌స్టార్ ప్రయోజనంతో అందిస్తున్నారు. అయితే ఈ ఆపరేటర్లు ఎవరూ కూడా డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం ప్రయోజనాన్ని అందించరు కానీ డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ ప్రయోజనంను మాత్రమే అందిస్తారు. డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్స్క్రిప్షన్ ధర సంవత్సరానికి 399 రూపాయలు కాగా డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం ధర సంవత్సరానికి 1,499 రూపాయలు. డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సభ్యత్వంతో వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లోని అన్ని ప్రీమియం ఇంగ్లీష్ మరియు హిందీ కంటెంట్‌లను యాక్సెస్ చేయలేరు.

డిస్నీ + హాట్‌స్టార్ VIP

జియో మరియు ఎయిర్‌టెల్ టెల్కోలు గత సంవత్సరం నుండి డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రయోజనంతో తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే Vi కూడా ఇటీవల ఈ కోవలో చేరారు. Vi టెల్కో డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాన్ని మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందించడం ప్రారంభించారు. ఏ ఆపరేటర్ ఉత్తమ సమర్పణలతో ఈ ప్రయోజనాలను అందిస్తున్నారో వంటి వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రయోజనంతో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ మూడింటిలో చౌకైనది రూ.401 ప్లాన్. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, 3GB డైలీ డేటా + 16GB బోనస్ డేటా మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

రెండవ ప్లాన్ 601 రూపాయల ధర వద్ద లభిస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్, 3GB డైలీ డేటా + 32GB బోనస్ డేటా మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

చివరగా మూడవ ప్లాన్ 801 రూపాయల ధర వద్ద లభిస్తుంది. ఇది కూడా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, 3GB డైలీ డేటా + 48GB బోనస్ డేటా, మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను 84 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. ఈ అన్ని ప్లాన్‌లు Vi యొక్క ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' మరియు ‘బింగే ఆల్ నైట్' ఆఫర్‌తో కూడా వస్తాయని గమనించండి. ఇవే కాకుండా వినియోగదారులు Vi మూవీస్ & టీవీ VIPకి ఉచిత యాక్సిస్ ను అందిస్తారు.

జియో - డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రీపెయిడ్ ప్లాన్‌లు

జియో - డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రయోజనంతో మొత్తంగా నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు వరుసగా రూ.401, రూ.598, రూ.777, రూ.2,599 ధరలను కలిగి ఉన్నాయి. ఈ అన్ని ప్లాన్‌లు వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తున్నాయి. కానీ డేటా ప్రయోజనాలు మరియు చెల్లుబాటు వ్యవధి భిన్నంగా ఉంటాయి.

రూ.401 ప్లాన్ వినియోగదారులకు డైలీ 3GB డేటా + 6GB బోనస్ డేటాను 28 రోజుల వాలిడిటీకి అందిస్తుంది. అలాగే రూ.777 ప్లాన్ వినియోగదారులకు 84 రోజుల వాలిడిటీ కాలానికి 1.5GB రోజువారి డేటా + 5GB బోనస్ డేటాను అందిస్తుంది. అలాగే రూ.598 మరియు రూ.2,599 ప్లాన్లు రెండూ వరుసగా 56 మరియు 365 రోజుల చెల్లుబాటు కాలంతో 2GB రోజువారీ డేటాను వినియోగదారులకు అందిస్తున్నాయి. అయితే రూ.2,599 ప్లాన్ వినియోగదారులకు 10GB బోనస్ డేటాను కూడా అదనంగా అందిస్తుంది. ఈ అన్ని ప్లాన్‌లు జియో యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను కలిగి ఉంటాయి.

భారతి ఎయిర్‌టెల్ - డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ - డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ టెల్కో డిస్నీ + హాట్‌స్టార్ విఐపి ప్రయోజనాన్ని మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందిస్తుంది. అలాగే దీని సంబంధిత OTT ప్రయోజనంతో వచ్చే డేటా-ఓన్లీ వోచర్ కూడా ఉంది. కాని మేము దానిని ఇక్కడ ప్రస్తావించడం లేదు. డిస్నీ + హాట్‌స్టార్ విఐపి ప్రయోజనాన్ని ఎయిర్‌టెల్ రూ .448, రూ .599, రూ .2,698 ధరల వద్ద లభించే మూడు ప్లాన్‌లతో అందిస్తుంది.


ఈ ప్లాన్‌లు నిజంగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు మరియు ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలతో వస్తాయి. రూ.448 వోచర్ వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను 28 రోజులు వాలిడిటీకి అందిస్తుంది. రూ.599 మరియు రూ.2,698 వోచర్లు వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను వరుసగా 56 రోజులు మరియు 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లు వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క 1 నెల ట్రయల్‌ను కూడా ఉచితంగా అందిస్తాయని గమనించండి.

Disney+ Hotstar VIP తీర్పు

Disney+ Hotstar VIP తీర్పు

84 రోజుల చెల్లుబాటుతో పాటుగా డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్స్క్రిప్షన్ తో లభించే ప్లాన్‌ల మధ్య పోటీ విషయానికి వస్తే ఎయిర్‌టెల్ మరియు జియో యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లు Vi ప్లాన్‌లతో పోలిస్తే మెరుగ్గా లేవు. కారణం Vi అదనపు డేటా మరియు ఇతర ప్రత్యేకమైన ఆఫర్‌లైన ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' వంటివి అందిస్తాయి. అయితే పోటీ ఏడాది చెల్లుబాటుతో ఉన్న ప్లాన్ ల మధ్య ఉంటే జియో మరియు ఎయిర్‌టెల్ ముందువరుసలో ఉంటాయి. దేశంలోని మొదటి రెండు ఆపరేటర్ల మధ్య జియో యొక్క దీర్ఘకాలిక డిస్నీ + హాట్‌స్టార్ విఐపి ప్లాన్ ఎయిర్‌టెల్ కంటే కొంచెం ముందుంది. ఎందుకంటే ఇది తక్కువ ధరకు ఎక్కువ డేటాను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Jio Vs Airtel Vs Vi: Disney+ Hotstar VIP Free Subscription Prepaid Plans Compared
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X