Jio vs Airtel vs Vi: పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలలో Jio, Airtelలను వెనక్కి నెట్టిన Vi....

|

ఇండియాలోని టెలికామ్ సంస్థలు తమ వినియోగదారుల కోసం ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ వంటి రెండు రకాల ప్లాన్‌లను వివిధ రకాల ధరల వద్ద అనేక ప్రయోజనాలతో అందిస్తున్నాయి. ఇందులో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో వినియోగదారులు పొందే పలు ప్రయోజనాల కారణాల వల్ల బాగా ప్రాచుర్యం పొందాయి.

రిలయన్స్ జియో 'పోస్ట్‌పెయిడ్ ప్లస్' ప్లాన్‌ వివరాలు

రిలయన్స్ జియో 'పోస్ట్‌పెయిడ్ ప్లస్' ప్లాన్‌ వివరాలు

సెప్టెంబర్ చివరలో రిలయన్స్ జియో తన 'పోస్ట్‌పెయిడ్ ప్లస్' ప్లాన్‌లను రూ.199 - రూ.1499 ధరల లోపు ప్రవేశపెట్టింది. జియో తన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో వినియోగదారులకు గరిష్ట ప్రయోజనాన్ని అందిస్తున్నప్పటికీ పోస్ట్‌పెయిడ్ ఆఫర్‌లలో Vi (వోడాఫోన్ ఐడియా) పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో పోలిస్తే ఇది కొద్దిగా వెనుకబడి ఉంది. భారతి ఎయిర్‌టెల్ కూడా తన వినియోగదారులకు అనేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. అయితే అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ఏది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్నదో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: Amazon sale: ఈ స్మార్ట్‌ఫోన్‌ల మీద ఎప్పుడు లేని డిస్కౌంట్‌ ఆఫర్లు!! మిస్ అవ్వకండి...Also Read: Amazon sale: ఈ స్మార్ట్‌ఫోన్‌ల మీద ఎప్పుడు లేని డిస్కౌంట్‌ ఆఫర్లు!! మిస్ అవ్వకండి...

Vi (వోడాఫోన్ ఐడియా) రూ.1,099 REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్

Vi (వోడాఫోన్ ఐడియా) రూ.1,099 REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారులకు రూ.1099 ధర వద్ద REDX అనే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. వ్యక్తిగత వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అనేక ప్రయోజనాలతో వస్తుంది. ఇది భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్ తో పాటుగా అపరిమిత డేటా వంటి ప్రాథమిక ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే యుఎస్ మరియు కెనడాకు ISD కాలింగ్ కోసం వినియోగదారులు REDX ప్లాన్‌తో నిమిషానికి 50 పైసలు మరియు UK కి నిమిషానికి 3 రూపాయలు చెల్లించి ఫోన్ కాల్స్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. REDX ప్లాన్ వినియోగదారులు ఆపరేటర్ అందించే అన్ని రకాల ప్రీమియం కస్టమర్ సేవలకు ఉచిత యాక్సిస్ కూడా అదనంగా లభిస్తుంది.

Vi (వోడాఫోన్ ఐడియా) REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్ OTT ప్రయోజనాలు

Vi (వోడాఫోన్ ఐడియా) REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్ OTT ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క REDX అనే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ అందించే ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ఒక సంవత్సరానికి రూ.5988ల విలువైన నెట్‌ఫ్లిక్స్, సంవత్సరానికి రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం మరియు Vi మూవీస్ & టీవీ యాప్ తో అన్ లిమిటెడ్ వినోదం వంటి ప్రయోజనాలను ఉచితంగా అందిస్తుంది. రెడ్‌ఎక్స్ ప్లాన్‌తో ప్రయాణ ఛార్జిల మీద డిస్కౌంట్ లబిస్తుంది. ఇందులో భాగంగా వినియోగదారులకు సంవత్సరానికి రూ.2999 విలువైన 7 రోజుల ఐరోమ్ ప్యాక్ లభిస్తుంది. ఇది దేశీయ మరియు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్‌కు సంవత్సరానికి 4 సార్లు లభిస్తుంది.

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ తన వినియోగదారులకు రూ.1599 ధర వద్ద పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలలో అపరిమిత డేటా మరియు అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటుగా అమెజాన్ ప్రైమ్ యొక్క ఉచిత చందా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్ వంటి ఎయిర్‌టెల్ థాంక్స్ యొక్క రివార్డులు అదనంగా ఉన్నాయి. Vi యొక్క REDX ప్లాన్ మాదిరిగా కాకుండా ఎయిర్‌టెల్ యొక్క ఈ అగ్రశ్రేణి ప్లాన్ 1 రెగ్యులర్ సిమ్ కార్డ్ మరియు సిమ్ కార్డ్‌లో 1 ఫ్రీ ఫ్యామిలీ-యాడ్‌ను అందిస్తుంది. వినియోగదారులు 200 నిమిషాల ISD కాల్స్ మరియు IR ప్యాక్‌లపై 10% తగ్గింపును కూడా పొందుతారు.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో టెలికాం సంస్థ రూ.1499 ధర వద్ద అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే 300GB ఉచిత డేటా ప్రయోజనంతో వస్తుంది. ఆ తరువాత వినియోగదారులు వినియోగించే ప్రతి GB డేటాకు రూ.10 చెల్లించవలసి ఉంటుంది. ఆపరేటర్ 500GB వరకు డేటా రోల్‌ఓవర్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. వినియోగదారులు వ్యక్తిగత కనెక్షన్ కోసం ప్లాన్‌ను ఉపయోగించవచ్చు. లేదా దాని ప్లాన్‌లకు ఇద్దరు కుటుంబ సభ్యులను అదనంగా కూడా చేర్చవచ్చని జియో తెలిపింది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో అపరిమిత కాలింగ్ మరియు SMS ప్రయోజనాలు పొందుతారు. OTT ప్రయోజనాల విషయానికి వస్తే వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి ఉచిత చందాతో పాటు అన్ని జియో యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను పొందుతారు. రూ.1499 జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లో 5GB హై-స్పీడ్ డేటా మరియు 500 నిమిషాల ఇన్కమింగ్ మరియు యుఎస్‌ఎలో తిరుగుతున్న వినియోగదారులకు అవుట్‌గోయింగ్ కూడా అందిస్తుంది. ఇంకా రూ .1449 జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యుఎఇలో తిరుగుతున్న వినియోగదారులకు 1 జిబి హై-స్పీడ్ డేటాను 300 నిమిషాల ఇన్‌కమింగ్ మరియు అవుట్గోయింగ్ కాల్‌లను అందిస్తుంది.

Vi vs Airtel vs Jio పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

Vi vs Airtel vs Jio పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

పైన తెలిపిన అన్ని సంస్థల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను పోల్చిచూస్తే కనుక Vi చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌గా ఉంది. ఇది చౌకగా ఉండడమే కాకుండా దానితో పాటు మరెన్నో ప్రయోజనాలను కూడా అందిస్తోంది. Vi ప్లాన్‌తో పోలిస్తే Jio మరియు Airtel రెండూ చాలా ఖరీదైనవిగా ఉండడమే కాకుండా వాటిలో చేర్చబడిన OTT ప్రయోజనాలు కూడా అంత ఆకర్షణీయంగా లేవు. Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయాణికుల అవసరాలపై కూడా దృష్టి పెడుతుంది. అయితే జియో కొంచెం వెనుకబడి ఉండగా ఎయిర్‌టెల్ ఈ ప్రత్యేక అంశంలో పూర్తిగా వెనుకబడి ఉంది.

Best Mobiles in India

English summary
Jio vs Airtel vs Vi Postpaid Plans: Vi RedX Plan Offers More Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X