Home
News

జియో, ఎయిర్‌టెల్, Vi, BSNL ల ఉపయోగకరమైన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

ఇండియాలోని రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా మరియు BSNL టెల్కోలు తమ యొక్క వినియోగదారులకు అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు మెజారిటీ జనాభాకు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ టెల్కోలు తమ సబ్‌స్క్రైబర్‌ల కోసం అద్భుతమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా మొత్తం కుటుంబం కోసం ఒకే బిల్లు పేమెంట్ కోసం చూస్తున్న వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలు ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. కస్టమర్‌లు సరసమైన ధరలో లభించే ప్లాన్‌లను ఎంచుకోవడంతో పాటుగా OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్ తో హై-ఎండ్ ప్యాక్‌లను కూడా అందిస్తున్నాయి. భారతదేశంలోని టెల్కోలు అందించే అత్యంత శ్రేష్టమైన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో టాప్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో టాప్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

వ్యక్తిగత మరియు ఫ్యామిలీ సభ్యుల కోసం జియో అనేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. టెల్కో నుండి అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ రూ.999 ధర వద్ద్ద లభిస్తుంది. ఈ రూ.999 ప్లాన్‌తో జియో మూడు అదనపు SIM కార్డ్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ మొత్తంగా 200GB డేటాను అందిస్తుంది మరియు 500GB డేటా రోల్‌ఓవర్‌ను అనుమతిస్తుంది. 200GB డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులు ప్రతి 1GB డేటాకి రూ.10 ఛార్జ్ చేస్తారు. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అదనంగా నెట్‌ఫ్లిక్స్, ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా బహుళ OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. జియో ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల విషయానికి వస్తే MyJio యాప్‌ని ఉపయోగించి వారి స్వంత అభీష్టానుసారం కొత్త/ఇప్పటికే ఉన్న పోస్ట్‌పెయిడ్ Jio కస్టమర్‌లను వారి కుటుంబ ప్లాన్‌లో సభ్యులుగా చేర్చుకోవడానికి ప్రధాన సబ్‌స్క్రైబర్ ఉచిత సంకల్పాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ప్రాథమిక చందాదారు నిర్ణయించిన విధంగా కుటుంబ సభ్యుడు కేటాయింపుల నుండి అర్హతలను పొందుతారు.

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ రెండు ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. అధిక ధర వద్ద హై-ఎండ్ ప్లాన్ ఫ్యామిలీ ఇన్ఫినిటీ ప్లాన్ రూ.1599 ధర వద్ద లభిస్తుంది. రూ.1,599 ధర ట్యాగ్‌లో లభించే ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ 200GB తో పాటు రోల్‌ఓవర్‌తో 500GB నెలవారీ డేటాను అందిస్తుంది. ఇది అపరిమిత కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 200 ISD నిమిషాలు మరియు IR ప్యాక్‌లపై 10% తగ్గింపును కూడా అందిస్తుంది. వినియోగదారులు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న తర్వాత 1 సాధారణ సిమ్‌తో పాటు కుటుంబ సభ్యుల కోసం 1 ఉచిత యాడ్-ఆన్ సాధారణ వాయిస్ కనెక్షన్‌ని అందుకుంటారు. అంతేకాకుండా వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాటినమ్ రివార్డ్‌లకు యాక్సెస్‌ను పొందుతారు. ఇందులో అదనపు ఖర్చు లేకుండా 1 సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అలాగే అదనపు ఖర్చు లేకుండా 1 సంవత్సరం చెల్లుబాటు కాలానికి డిస్నీ+ హాట్‌స్టార్ VIP మెంబర్‌షిప్ ఉంటుంది. ఇతర ప్రయోజనాలలో Airtel Xstream యాప్ ప్రీమియం, Wynk ప్రీమియం వంటివి మరిన్ని ఉన్నాయి.

వోడాఫోన్ ఐడియా(Vi) RedX ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) RedX ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో వ్యక్తిగత వినియోగదారులు మరియు కుటుంబ సభ్యుల కోసం విడిగా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. కుటుంబ వినియోగదారుల కోసం Vi ఉన్నతమైన ప్లాన్ ను రూ.2,299 ధర వద్ద రెడ్‌ఎక్స్ ప్లాన్ పేరుతో అందిస్తుంది. Vi యొక్క రెడ్‌ఎక్స్ ప్లాన్‌లు బహుళ OTT సబ్‌స్క్రిప్షన్‌లు మరియు మరిన్నింటితో బండిల్ చేయబడి వస్తాయి. ఈ ప్లాన్ 5 మంది కుటుంబ సభ్యులకు కనెక్టివిటీని అందిస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు అపరిమిత డేటాను అలాగే ప్లాన్ యొక్క ప్రాధమిక మరియు ద్వితీయ కనెక్షన్‌లకు నెలకు 3000 SMSల ప్రయోజనాలను అందిస్తుంది. RedX ప్లాన్ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నంతవరకు వినియోగదారులు TV మరియు మొబైల్‌లో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా నెట్‌ఫ్లిక్స్‌కు సంవత్సరకాల సభ్యత్వానికి యాక్సిస్ ను పొందవచ్చు. ఈ ప్లాన్ రూ.1,499 విలువైన అమెజాన్ ప్రైమ్ యొక్క ఒక సంవత్సరం సభ్యత్వాన్ని అలాగే రూ. 499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. దీనికి అదనంగా రెడ్‌ఎక్స్ ప్లాన్‌లు అంతర్జాతీయ & దేశీయ విమానాశ్రయ లాంజ్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తాయి.

BSNL ప్రీమియం ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్

BSNL ప్రీమియం ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL రూ. 999 ధర ట్యాగ్‌తో లభించే అత్యంత ఖరీదైన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తో మూడు కుటుంబ కనెక్షన్‌లను అందిస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాల్‌లను - HPLMN మరియు MTNL నెట్‌వర్క్‌లో ముంబై మరియు ఢిల్లీతో సహా నేషనల్ రోమింగ్‌తో పాటు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందీసింది. ప్రాథమిక వినియోగదారులు 225GB వరకు డేటా రోల్‌ఓవర్‌తో 75GB ఉచిత డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 3 ఫ్యామిలీ కనెక్షన్‌లను అపరిమిత వాయిస్ సౌకర్యం, 75GB డేటా మరియు ప్రతి కుటుంబ కనెక్షన్‌కి విడివిడిగా 100SMS/రోజు అందిస్తుంది.

ఈ ప్లాన్ యాక్టివేషన్ కోసం వినియోగదారులు రూ. 100 వన్ టైం రుసుమును చెల్లించాలి. అంతేకాకుండా పైన పేర్కొన్న ధరలో GST ఛార్జీలు చేర్చబడవు. అదనంగా వినియోగదారులు లోకల్ + STD కోసం రూ.500, లోకల్ + STD+ ISD కోసం రూ.2000 మరియు లోకల్+ STD+ ISD+ ఇంటర్నేషనల్ రోమింగ్ కోసం రూ.2000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. వినియోగదారులు BSNL అధికారిక వెబ్‌సైట్‌లో యాడ్-ఆన్ ప్యాక్‌లతో పాటు ఉచిత డేటా వినియోగం తర్వాత వర్తించే అదనపు ఛార్జీలను తనిఖీ చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
Jio vs Airtel vs Vi vs BSNL: Useful Family Postpaid Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X