Jio vs Airtel vs Vi: డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఎవరు??

|

ఇండియా యొక్క టెలికాం రంగంలో గల ప్రధాన ప్రవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా(Vi) ఎప్పటికప్పుడు తమ వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేస్తున్నాయి. ముందు నుంచి కూడా ఎవరైనా ఒక టెల్కో ధరలు పెంచితే మిగిలిన వారు అదే విధానాన్ని అనుసరించేవారు. ఈ నెల 1 నుంచి రిలయన్స్ జియో తన యూజర్ల కోసం డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో నాలుగు కొత్త ప్లాన్‌లను విడుదల చేసింది. అయితే దీనికి పోటీగా ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా(Vi) కూడా డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్రయోజనంతో కొన్ని ప్లాన్ లను విడుదల చేసింది. అయితే డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో విడుదలైన ప్లాన్ లలో ఏది మెరుగ్గా ఉందొ వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రిలయన్స్ జియో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో తన యొక్క వినియోగదారుల కోసం సెప్టెంబర్ 1, 2021 నుండి డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో కొన్ని ప్లాన్‌లను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లు కస్టమర్‌లకు డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్ లో ఇంగ్లీష్‌తో సహా పూర్తిస్థాయి అంతర్జాతీయ కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి అనుమతిని ఇస్తాయి. ఈ కొత్త ప్లాన్‌లు రూ.499, రూ.666, రూ.888, రూ.2,599 మరియు రూ.549 ధరల వద్ద లభిస్తాయి. ఈ ప్లాన్‌లలో రూ.549 'డేటా వోచర్' ప్లాన్ మినహా మిగిలినవన్నీ కూడా అపరిమిత వాయిస్ కాలింగ్, SMS మరియు డేటా ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్లాన్‌లతో వినియోగదారులకు అందించే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 1 సంవత్సరం చెల్లుబాటుతో వస్తుంది. వినియోగదారులు అంతర్జాతీయ కంటెంట్‌ను ఇంగ్లీష్‌లో కూడా యాక్సెస్ చేయవచ్చు.

Google Pay లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ లు చేయడం ఎలా ? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్Google Pay లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ లు చేయడం ఎలా ? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

భారతీ ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు
 

భారతీ ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో సెప్టెంబర్ 31, 2021 న అందరికంటే ముందుగా డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ముందుకు వచ్చింది. భారతీ ఎయిర్‌టెల్ దీనిని అనుసరిస్తు కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది. భారతీ ఎయిర్‌టెల్ తన వెబ్‌సైట్‌లో కనిపించే మూడు కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అవి రూ.2,798, రూ.699 మరియు రూ.499 ధరల వద్ద లభిస్తాయి. వీటిలోరూ.499 మొదటి ప్లాన్ 28 రోజుల స్వల్ప వ్యాలిడిటీతో వస్తుంది. ఇది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్-ఓన్లీ ప్లాన్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను అందిస్తుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ, అపోలో 24/7 సర్కిల్ మరియు ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీలపై రూ .100 క్యాష్‌బ్యాక్ వంటి ఉచిత ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలను ఈ ప్లాన్ వినియోగదారులకు అందిస్తుంది. .

ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులకు రూ.699 మరియు రూ.2,798 ధరల వద్ద లభించే రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తాయి. రూ.699 మరియు రూ .2,798 ప్లాన్‌లు ఒక్కొటి వరుసగా 56 రోజులు మరియు 365 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. రెండు ప్లాన్‌లు వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను అందిస్తాయి. రూ .499 ప్లాన్‌తో అందించే అన్ని ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్‌లను స్వీకరించడానికి వినియోగదారులకు అర్హత ఉంటుంది.

వొడాఫోన్ ఐడియా(Vi) - డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వొడాఫోన్ ఐడియా(Vi) - డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్ OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలతో నాలుగు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో మొదటి ప్లాన్ రూ.501 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. ఇది వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను అందించడంతో పాటుగా కంపెనీ నుండి 16GB బోనస్ డేటా కూడా అదనంగా లభిస్తుంది. రెండవ ప్లాన్ రూ.701 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 3GB రోజువారీ డేటా మరియు 32GB బోనస్ డేటాను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అలాగే రూ.901 ప్లాన్ 3GB రోజువారీ డేటా మరియు 48GB బోనస్ డేటాను 84 రోజుల చెల్లుబాటు కాలంతోను మరియు చివరిగా రూ.2,595 దీర్ఘకాలిక ప్లాన్ 1.5GB రోజువారీ డేటాతో 365 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. ఇవి డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ మరియు Vi మూవీస్ & టీవీకి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో లభిస్తాయి. ఈ ప్లాన్‌లన్నీ కూడా వినియోగదారులకు ఉచిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో వస్తాయని గమనించండి. ఇంకా వీరికి 'వీకెండ్ డేటా రోల్‌ఓవర్' మరియు 'బింగే ఆల్ నైట్' ఆఫర్‌ కూడా ఉపయోగించుకుంటారు.

Jio vs Airtel vs Vi

Jio vs Airtel vs Vi

డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో లాంచ్ అయిన టెల్కో యొక్క అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు అనేక ధరల విభాగాలలో విడుదలైనప్పటి మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ టెల్కోలు ధరల విభాగాలలో అందించే అన్ని ప్రయోజనాలు ఒకే రకంగా ఉన్నప్పటికీ వాలిడిటీలో తేడాలు ఉన్నాయి. రోజు వారి డేటా ప్రయోజనాలు ఒకే రకంగా ఉన్నప్పటికీ Vi టెల్కో మాత్రం తమ యొక్క ప్లాన్ లతో అదనపు డేటాను అందిస్తున్నది. అంతేకాకుండా వీకెండ్ డేటా రోల్‌ఓవర్' మరియు 'బింగే ఆల్ నైట్' ఆఫర్‌ కూడా ఉన్నాయి. కాబట్టి జియో మరియు ఎయిర్టెల్ తో పోలిస్తే వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు మెరుగ్గా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Jio vs Airtel vs Vi: Who is The BEST Among The New Prepaid Plans of Disney + Hotstar

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X