RS.200 రేంజ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రోజుకు 1.5GB డేటాను అందించే టెల్కోలు

|

టెలికాం పరిశ్రమలో ప్రీపెయిడ్ విభాగంలో రోజు రోజుకి పోటీ ఎక్కువగా పెరుగుతున్నది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జీలు పరిశ్రమలో ఎక్కువ పోటీగా మారడానికి కారణం రిలయన్స్ జియో నిర్వహించిన డేటా టారిఫ్ వార్. ఏదేమైనా డేటా టారిఫ్ వార్ ముగిసినప్పటి నుండి ప్రీపెయిడ్ విభాగంలో మళ్లీ ఆకృతులను మార్చడం ప్రారంభమైంది.

జియో

IUCను ప్రవేశపెట్టిన తరువాత రిలయన్స్ జియో తీసుకున్న సంచలన నిర్ణయం కారణంగా ప్రీపెయిడ్ ప్రణాళికల యొక్క పోర్ట్‌ఫోలియోతో సహా చాలా విషయాలు మారిపోయాయి. దీని అర్థం ఇతర టెలికాం ఆపరేటర్ల ప్రీపెయిడ్ ప్లాన్లలో మరియు రిలయన్స్ జియో అందించే వాటి ధర వద్దే అధిక ప్రయోజనాలను అందిస్తున్నాయి.

 

జియో సెట్-టాప్ బాక్స్‌ అందిస్తున్న 150 ఛానెళ్ల వివరాలుజియో సెట్-టాప్ బాక్స్‌ అందిస్తున్న 150 ఛానెళ్ల వివరాలు

 ప్రీపెయిడ్ ప్లాన్‌

రూ.200 రేంజ్‌ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కొంతకాలం క్రితం వరకు రిలయన్స్ జియో నాయకత్వంగా వహించింది. అయితే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెలికాం కొత్త కదలికలు తీసుకురావడంతో అందులో విషయాలు కొద్దిగా మారిపోయాయి. రోజుకు 1.5 జిబి డేటాను అందించే రూ.200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఏ టెల్కో ఉత్తమంగా అందిస్తుందో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

BSNL నుంచి మరొక లాంగ్ టర్మ్ ప్లాన్!! రోజుకు 3GB డేటా ఆఫర్ అదుర్స్BSNL నుంచి మరొక లాంగ్ టర్మ్ ప్లాన్!! రోజుకు 3GB డేటా ఆఫర్ అదుర్స్

రిలయన్స్ జియో రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్

ఇందులో మొదటగా రిలయన్స్ జియో అందిస్తున్న రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాము. ఇది ఇప్పుడు బండిల్ కాని జియో FUP నిమిషాలతో వస్తుంది . ఇంతకుముందు ఈ ప్లాన్ ఇదే ధరతో ఉండి 28 రోజుల పాటు యాక్సిస్ లభించేది. కానీ ఇప్పుడు రూ .149 యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ 1.5 జీబీ రోజువారీ డేటాతో 24 రోజులకు మాత్రమే లభిస్తుంది. ఇది జియో టు జియో నెట్‌వర్క్‌పై అపరిమిత కాలింగ్ మరియు 300 నిమిషాల నాన్-జియో కాల్‌లను కూడా అందిస్తుంది. చందాదారులు అన్ని రిలయన్స్ జియో యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను కూడా పొందుతారు.

 

జియోసినిమా యాప్ లో ఉచితంగా SunNXT సినిమాలుజియోసినిమా యాప్ లో ఉచితంగా SunNXT సినిమాలు

భారతి ఎయిర్‌టెల్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.199 ధర వద్ద అందిస్తుంది. ఇది రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుంది, మరియు ఇది 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇది మాత్రమే కాదు చందాదారులు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు మరియు వీటితో పాటు అనేక అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. భారతి ఎయిర్‌టెల్ రూపొందించిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్, ఒక సంవత్సరం నార్టన్ మొబైల్ సెక్యూరిటీ, నాలుగు వారాల పాటు షా అకాడమీ కోర్సులకు యాక్సెస్ మరియు రెండేళ్ల చెల్లుబాటుతో రీఛార్జ్‌లపై 100% క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.

 

RS.299 యాడ్-ఆన్ ప్లాన్‌తో అపరిమిత డేటాను అందిస్తున్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్RS.299 యాడ్-ఆన్ ప్లాన్‌తో అపరిమిత డేటాను అందిస్తున్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్

వోడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్

ప్రీపెయిడ్ చందాదారుల కోసం వోడాఫోన్ తన పోర్ట్‌ఫోలియోలో కూడా ఇదే విధమైన ప్లాన్ ను అందిస్తున్నది. ఇందులో వారు 1.5GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో 28 రోజుల పాటు యాక్సిస్ ను పొందగలుగుతారు. చందాదారులు వొడాఫోన్ ప్లే యాప్ ను కూడా పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. వోడాఫోన్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ.199 ధర వద్ద అందిస్తుంది.

 

ఎక్కువ డేటా కోసం ACT ఫైబర్‌నెట్ అందిస్తున్న 5 కొత్త ఫ్లెక్సీబైట్స్ ప్లాన్‌లుఎక్కువ డేటా కోసం ACT ఫైబర్‌నెట్ అందిస్తున్న 5 కొత్త ఫ్లెక్సీబైట్స్ ప్లాన్‌లు

తీర్పు

తీర్పు

ఇప్పుడు ఈ ప్రణాళికల మధ్య గల పోలిక విషయానికి వస్తే వీటి మధ్య వ్యత్యాసం యొక్క ప్రధాన అంశం చెల్లుబాటు మరియు IUC నిమిషాల విషయం. పోర్ట్‌ఫోలియోలో భారతి ఎయిర్‌టెల్ యొక్క ఆఫర్ అత్యుత్తమమైనది. ఇది అందించే యాడ్-ఆన్‌లు మరియు డేటా ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకుంటే రిలయన్స్ జియో యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ ధర యొక్క ప్రయోజనాన్ని కలిగి ఉంది. రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ తక్కువ ధర వద్ద లభిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు అయితే దీని చెల్లుబాటు కాలం కేవలం 24 రోజులు మాత్రమే. ఇది మిగిలిన వారితో పోలిస్తే నాలుగు రోజులు తక్కువ. చివరగా ఐయుసి ఛార్జీల విషయానికి వస్తే ఈ ప్లాన్లలో అందించిన 300 నిమిషాలు అయిపోతే రిలయన్స్ జియో అందిస్తున్న టాక్ టైమ్ వోచర్లలో దేనినైనా మీరు రీఛార్జ్ చేసుకోవాలి. మొత్తంమీద మీరు ఇతర టెలికాం ఆపరేటర్లకు తక్కువ కాలింగ్ చేసే ఉద్దేశం కలిగి ఉంటే కనుక రిలయన్స్ జియో యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ ఉత్తమంగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Jio VS Airtel VS Vodafone: 1.5GB Daily Data Under Rs.200 Prepaid Plan

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X