Jio Vs Airtel 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్న జియో రూ.899, ఎయిర్‌టెల్ రూ.929 రీఛార్జ్ ప్లాన్‌లో ఏది బెస్ట్..
జియో ప్రస్తుతం దేశంలో యూజర్ల పరంగా అతిపెద్ద టెలికాం సంస్థగా ఉంది. అదే ఎయిర్‌టెల్ రెండో స్థానంలో ఉంది. అయితే రెండు సంస్థలు పోటాపోటీగా సేవలు అందిస్తున్నాయి. ఇటీవలే రెండు సంస్థలు ప్రముఖ సంస్థ స్పేస్‌ఎక్స్‌తో శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. జియో, ఎయిర్‌టెల్ భారీ సంఖ్యలో యూజర్లను కలిగి ఉన్నాయి. యూజర్ల డేటా, కాలింగ్, OTT పరంగా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉన్నాయి.
జియో రూ.899 రీఛార్జ్ ప్లాన్ లో (Jio Rs899 Recharge Plan) భాగంగా 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. అదే ఎయిర్‌టెల్ రూ.929 రీఛార్చ్ ప్లాన్ లో 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. రెండు టెలికాం సంస్థలు ఒకే రకమైన వ్యాలిడిటీని అందిస్తున్నా.. డేటా, ఇతర ప్రయోజనాల్లో చాలా తేడాలున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏదీ బెస్ట్..?

జియో రూ.899 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా ఈ ప్లాన్ లో రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. మరియు అదనంగా 20GB డేటాను అందిస్తోంది.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 200 GB డేటాను పొందవచ్చు. మరియు 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. మార్చి 22 తర్వాత రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజులపాటు జియోహాట్‌స్టార్ మొబైల్/ TV సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు.
దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా జియోటీవీ, జియో క్లౌడ్ యాప్‌లను వినియోగించుకోవచ్చు. 50GB వరకు స్టోరేజీని వినియోగించుకోవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.929 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో (Airtel Rs929 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్ లో భాగంగా మొత్తంగా 135GB 4G డేటాను పొందవచ్చు. ఎయిర్‌టెల్Xstream ప్రయోజనాలను పొందవచ్చు. మరియు ఉచితంగా హాలోట్యూన్స్‌ను వినియోగించుకోవచ్చు. అపోలో 24/7 సర్కిల్ ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ జియో, ఎయిర్‌టెల్ రెండు ప్లాన్‌లో జియో అత్యంత మెరుగైన ప్రయోజనాలను అందిస్తోంది. ఏకంగా 200 GB డేటాను అందిస్తోంది. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. ఎయిర్‌టెల్ కేవలం 135 GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ రెండు ప్లాన్ లో జియో మెరుగైన ప్రయోజనాలను అందిస్తోంది.
ఇటీవల ఎయిర్‌టెల్, జియో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల కోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్‌లింక్ ఉపగ్రహాల ద్వారా మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించనుంది. అయితే ఇందుకు స్పేస్‌ఎక్స్ సంస్థకు భారత ప్రభుత్వం అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








