జియో vs BSNL: 336 రోజుల ప్లాన్ వార్.. తక్కువ ధరలో ఏది బెస్ట్.. యూజర్లకు లాభం ఏంటి?
JIO vs BSNL: ఇటీవల కాలంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ చాలా ఎక్కువైంది. ఇవి చీప్ ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఉండే ప్లాన్స్‌కి ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే చాలా మందికి నెల నెలా రీఛార్జ్ చేసుకునే బాధ తప్పుతుంది, పైగా ఖర్చు కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం BSNL, జియో కంపెనీలు అందిస్తున్న 336 రోజుల వాలిడిటీ ప్లాన్స్‌ని కంపేర్ చేద్దాం.
ఈ రెండు ప్లాన్స్ కూడా మెయిన్‌గా వాయిస్ కాల్స్ కోసం డిజైన్ చేశారు. అంటే ఎవరైతే ఎక్కువ డేటా వాడకుండా, కేవలం కాలింగ్, అప్పుడప్పుడు మెసేజ్‌లు చేసుకోవాలనుకుంటారో వాళ్లకి ఈ ప్లాన్స్ బాగా సెట్ అవుతాయి. మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్ ప్లానో చూద్దాం.

* BSNL రూ.1,499 ప్లాన్
BSNL రూ.1,499 ప్లాన్‌ను వాయిస్ కాల్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ల కోసం తీసుకొచ్చారు. ఇందులో మీరు లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్ అన్నీ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. దేశంలో ఎక్కడున్నా ఏ నెట్‌వర్క్‌కైనా టెన్షన్ లేకుండా కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు, రోజుకి 100 SMSలు కూడా ఉన్నాయి. మెసేజ్‌లు పంపించేవాళ్లకి ఇది బాగా యూజ్ అవుతుంది.
ఈ ప్లాన్‌లో 336 రోజులకు మొత్తం 24GB డేటా ఇస్తారు. రోజూ కొంచెమే డేటా వాడుకునేవాళ్లకు ఇది ఉపయోగపడుతుంది. డేటా అయిపోతే మాత్రం మళ్లీ వేరే డేటా ప్యాక్ వేసుకోవాల్సిందే. ఈ ప్లాన్ నెలకి దాదాపు రూ.136 మాత్రమే పడుతుంది. అందుకే ఇది లాంగ్ టర్మ్ ప్లాన్స్ లో చాలా చౌకైన ప్లాన్ అని చెప్పొచ్చు.
* జియో రూ.1,748 ప్లాన్
ఇప్పుడు జియో రూ.1,748 ప్లాన్ విషయానికి వస్తే, ఇది కూడా కాలింగ్, SMS కోసమే కానీ ఇందులో డేటానే ఇవ్వడం లేదు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు, కానీ డేటా లభించదు. SMSలు రోజుకింత అని కాకుండా మొత్తం 3,600 SMSలు ఇస్తారు. ఈ 3,600 SMSలు అయిపోతే మళ్లీ డబ్బులు పెట్టి SMS ప్యాక్ వేసుకోవాలి.
ఈ ప్లాన్‌లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, జియో యాప్స్ వాడుకోవచ్చు. అంటే జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ లాంటి యాప్స్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్, స్టోరేజ్ బెనిఫిట్స్ పొందొచ్చు. కానీ మొబైల్ డేటా మాత్రం ఉండదు. ఇంటర్నెట్ కావాలంటే వేరే డేటా ప్యాక్ వేసుకోవాల్సిందే. ఈ ప్లాన్ నెలకి దాదాపు రూ.158 అవుతుంది.
అంటే BSNL ప్లాన్ కంటే ఇది కొంచెం ఎక్కువ ధర. ఒకవేళ మీకు ఏడాది మొత్తం వ్యాలిడిటీతో పాటు, డేటా కూడా బాగా కావాలంటే ఎయిర్‌టెల్ రూ.3,999 ప్లాన్ కూడా ఒక ఆప్షన్. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకి 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకి 100 SMSలు ఇస్తారు.
అంతేకాదు, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు ఫ్రీగా ఇస్తారు. 5G నెట్‌వర్క్ ఉన్న ఏరియాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా వాడుకోవచ్చు. ఇంకా స్పామ్ కాల్ అలర్ట్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కంటెంట్, మూడు నెలల అపోలో 24|7 సర్కిల్ మెంబర్‌షిప్, ఫ్రీ హలోట్యూన్స్ లాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీలకు వాయిస్, SMS-ఓన్లీ ప్లాన్స్ కూడా ఇవ్వాలని చెప్పిన తర్వాతే ఈ ప్లాన్స్ వచ్చాయి. ఎందుకంటే చాలా మంది యూజర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్లు, డేటా ప్లాన్లు చాలా ఖరీదుగా ఉన్నాయని కంప్లైంట్ చేశారు. అందుకే వాళ్ల కోసం ఈ వాయిస్ ప్లాన్స్ తీసుకొచ్చారు.


Click it and Unblock the Notifications








