జియోకు పోటీగా యాన్యువల్ ప్లాన్‌లను లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్
ఇండియన్ టెలికం మార్కెట్లో పండుగల వేడి రాజుకుంది. ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని జియో, బీఎస్ఎస్ఎల్ వంటి ప్రముఖ టెల్కోలు సరికొత్త ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి.
ఇండియన్ టెలికం మార్కెట్లో పండుగల వేడి రాజుకుంది. ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని జియో, బీఎస్ఎస్ఎల్ వంటి ప్రముఖ టెల్కోలు సరికొత్త ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని ప్లాన్‌లు ఏడాది వ్యాలిడిటీతో వస్తున్నాయి. జియో ఈ ట్రెండ్‌ను స్టార్ట్ చేయగా తాజాగా ఈ జాబితాలోకి బీఎస్ఎన్ఎల్ వచ్చి చేరింది. జియోకు పోటీగా రెండు సరికొత్త యాన్యువల్ ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

365 రోజుల వ్యాలిడిటీతో జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్..
365 రోజుల వ్యాలిడిటీతో జియో అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1699 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 1.5జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు.

షియోమి స్మార్ట్‌ఫోన్‌తో తీసుకుంటే..
ఒకవేళ మీరు ఈ ప్లాన్‌ను షియోమి స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా తీసుకున్నట్లయితే అదనంగా రోజుకు 1.5జీబి మీకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ప్లాన్ ను నవంబర్ 30లోపు సబ్ స్ర్రైబ్ చేసుకున్నట్లయితే 100 శాతం క్యాష్‌బ్యాక్ మీకు లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను 5 కూపన్ల రూపంలో జియో మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ కూపన్లను రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో డిసెంబర్ 31, 2018లోపు ఉపయోగించుకోవచ్చు.

365 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ప్రీపెయిడ్ ప్లాన్స్..
జియోకు పోటీగా రెండు సరికొత్త యాన్యువల్ ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. వీటిలో మొదటి ప్లాన్ ఖరీదు రూ.1699. రెండవ ప్లాన్ ఖరీదు రూ.2099. 365 రోజుల వ్యాలిడిటీతో ఈ రెండు ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో మొదటి ప్లాన్‌ను ఆప్ట్ చేసుకున్నట్లయితే రోజుకు 2జీబి 3జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

రెండవ ప్లాన్‌ను ఆప్ట్ చేసుకున్నట్లయితే..
రెండవ ప్లాన్‌ను ఆప్ట్ చేసుకున్నట్లయితే రోజుకు 4జీబి 3జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఈ రెండు ప్లాన్‌లను కంపేర్ చేసి చూసినట్లయితే బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోన్ ప్లాన్‌లలో డేటా ఎక్కువుగా లభిస్తున్నప్పటికి ఇంటర్నెట్ వేగం మాత్రం 3జీలోనే ఉంటుంది. ఇదే సమయంలో జియో అఫర్ చేసే డేటా 4జీ వేగంతో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








