Home
News

మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ వార్షిక ప్లాన్ల పై ఓ లుక్కేయండి

ఒకానొక సమయం లో డేటా వాడుకోవాలన్న కాల్స్ చేయాలన్న చాలా పొదుపుగా వాడుకోవల్సి వచ్చేది. జియో రాకతో ఒక్కసారిగా పరిస్థితులన్ని మారిపోయాయి.

ఒకానొక సమయం లో డేటా వాడుకోవాలన్న కాల్స్ చేయాలన్న చాలా పొదుపుగా వాడుకోవల్సి వచ్చేది. జియో రాకతో ఒక్కసారిగా పరిస్థితులన్ని మారిపోయాయి. జియో తన ఉచిత ప్లాన్ తో మార్కెట్‌ను ముంచెత్తటంతో పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు కూడా ఉచిత ప్లాన్లను మార్కెట్ లో ప్రవేశబెట్టాయి. మొదట ఉచిత డేటా తో మొదలైన వార్ అన్ లిమిటెడ్ కాల్స్,ఫ్రీ SMS ,ఫ్రీ రోమింగ్ కాల్స్ వరకు వెళ్లాయి.అయితే ఇప్పుడు లేటెస్ట్ గా టెలికాం దిగ్గజాలు వార్షిక ప్లాన్లను మార్కెట్ లోకి విడుదల చేశాయి .నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ వార్షిక ప్లాన్లను మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

BSNL రూ.1,312 ప్లాన్

BSNL రూ.1,312 ప్లాన్

365 రోజుల వ్యాలిడిటీతో BSNL అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,312 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ఉచితంగా 1,000 ఎస్సెమ్మెస్‌లు, 5జీబీ(2G / 3G) డేటాను వినియోగించుకోవచ్చు. డేటా అయిపోగానే యాడ్ ఆన్ డేటా ప్యాక్‌లతో యూజర్లు ప్రత్యేక రీఛార్జి చేసుకుంటే పరిమితి మేరకు డేటా వాడుకోవచ్చు.ముంబై ,ఢిల్లీలో తప్ప అన్ని సర్కిళ్ల కస్టమర్స్ ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు.

BSNL రూ.1,699 ప్లాన్

BSNL రూ.1,699 ప్లాన్

365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు.

BSNL రూ. 2,099 ప్లాన్

BSNL రూ. 2,099 ప్లాన్

365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 4జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు.

జియో రూ.1699 ప్లాన్

జియో రూ.1699 ప్లాన్

జియో రూ.1699 ప్లాన్ తో ఉచితంగా లోకల్‌, నేషనల్‌ కాల్స్‌, అపరిమిత రోమింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది.

వోడాఫోన్ ఐడియా రూ.1499 ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ.1499 ప్లాన్

ఈ రూ.1499 ప్లాన్‌ కింద రోజుకు 1జీబీ డేటాను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా యూజర్లు పొందనున్నారు.ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు.

Best Mobiles in India

English summary
Jio vs BSNL vs Vodafone Idea: Best annual prepaid plans.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X