Home
News

జియో, వోడాఫోన్ ఐడియా రూ.600 విభాగం ప్లాన్‌ పోరులో గెలుపు ఎవరిదీ??

భారతదేశం యొక్క మూడవ అతిపెద్ద టెలికం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా (Vi) అగ్రశ్రేణి టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియోకు గట్టి పోటీని ఇస్తున్నది. ఈ రెండు సంస్థలు ఒకే ధర పరిధిలో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే ఆపరేటర్లు అందించే ప్రయోజనాలు చాలా భిన్నంగా ఉన్నాయి. కొంతమంది Vi యొక్క ప్లాన్‌ను ఇష్టపడుతూ ఉంటే మరికొందరు జియో యొక్క ప్లాన్‌ను ఇష్టపడుతున్నారు. ప్రస్తుత సమయంలో వినియోగదారుడి అవసరాలు మరియు కోరికలు చాలా భిన్నంగా ఉంటాయి. వొడాఫోన్ ఐడియా మరియు రిలయన్స్ జియో రూ.600 విభాగంలోని ప్లాన్‌లు ఎంత భిన్నంగా ఉన్నాయో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా రూ.601 ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ.601 ప్లాన్

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు కొత్తగా రూ.601 ధర వద్ద ఒక ప్లాన్‌ను అందిస్తుంది. వినియోగదారులకు ప్రీమియం ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాన్ని అందించడం కోసం దీనిని ప్రవేశపెట్టారు. రూ.601 ధర వద్ద లభించే ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు కాలానికి 3GB రోజువారి డేటా ప్రయోజనంతో లభిస్తుంది. ఈ ప్లాన్ రూ.801 ప్లాన్‌కు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లను కూడా పొందుతారు.

వీకెండ్ డేటా రోల్‌ఓవర్

ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు సంస్థ అందించే ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' మరియు ‘బింగే ఆల్ నైట్' ఆఫర్‌ను కూడా పొందుతారు. ఇంకా ఒక సంవత్సరం పాటు Vi మూవీస్ & టీవీ యాక్సిస్ యొక్క అదనపు ప్రయోజనం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో లభించే ప్రీమియం OTT ప్రయోజనంలో డిస్నీ + హాట్‌స్టార్ VIP కూడా ఉంది. 3GB రోజువారీ డేటా కాకుండా సంస్థ వినియోగదారులకు 32GB బోనస్ డేటాను కూడా అందిస్తుంది. కాబట్టి ఈ ప్లాన్‌తో యూజర్లు మొత్తంగా 200GB డేటాను పొందుతారు.

రిలయన్స్ జియో రూ.599 ప్లాన్ బెనిఫిట్స్

రిలయన్స్ జియో రూ.599 ప్లాన్ బెనిఫిట్స్

రిలయన్స్ జియో రూ.600 ధర విభాగంలో తన వినియోగదారులకు రూ.599 ధర వద్ద ఒక ప్లాన్ ను అందిస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలతో వస్తుంది. అయితే ఇది వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను మాత్రమే అందిస్తుంది. JioCloud, JioSecurity మరియు మరెన్నో Jio యాప్లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు పొందే మొత్తం డేటా 168GB. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది.

రూ.600 ప్లాన్ యుద్ధంలో గెలుపు ఎవరిదీ?

రూ.600 ప్లాన్ యుద్ధంలో గెలుపు ఎవరిదీ?

ప్రస్తుత కరోనా సమయంలో అధిక డేటా కోసం చూస్తున్నట్లయితే వోడాఫోన్ ఐడియా(Vi) అందించే బోనస్ డేటా మరియు ప్లాన్‌తో లభించే ఇతర ఆఫర్‌లు జియో కంటే ఎన్నోరెట్లు మెరుగ్గా ఉన్నాయి. అయితే చెల్లుబాటు పరంగా చూసుకుంటే కనుక జియో యొక్క ప్లాన్ గెలుపుకు చెరువుగా ఉంది. Jio యొక్క ప్లాన్ చెల్లుబాటు పరంగా మాత్రమే గెలుస్తుంది. Vi యొక్క ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క OTT ప్రయోజనంతో కూడా వస్తుంది. ఏదేమైనా ఓపెన్‌సిగ్నల్ ప్రకారం జియో యొక్క నెట్‌వర్క్ కవరేజ్ మొత్తం దేశంలోనే ఉత్తమమైనది, కాబట్టి మీలో ఎవరైనా ఎల్లప్పుడూ అధిక దూరం ప్రయాణం చేస్తూ ఉంటే కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాన్ ను పొందండి.

Best Mobiles in India

English summary
Jio Vs Vodafone Idea(Vi): Who is Offers More Benefits Under Rs.600 Prepaid Plan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X