'మరో కొత్త స్కామ్.. పొరపాటున తిరిగి కాల్ చేశారో..' యూజర్లకు వార్నింగ్ మెసేజ్ పంపిన టెలికాం సంస్థ!
ప్రముఖ టెలికాం సంస్థ జియో తన యూజర్లకు కీలక సూచనలు చేసింది. ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లేకుంటే నష్టం జరుగుతుందని హెచ్చరించింది. దేశంలోని మొబైల్ యూజర్లను టార్గెట్ చేసి, మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. జియో యూజర్లు ఇంటర్నేషనల్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
నేరగాళ్లు ఇంటర్నేషనల్ నంబర్‌ల నుంచి తొలుత కాల్ చేస్తున్నారు. అయితే కొన్ని సెకన్ల పాటు కాల్ చేసి వెంటనే కట్ చేస్తున్నారు. వచ్చిన మిస్డ్ కాల్స్‌కు కొంతమంది స్పందిస్తున్నారు. అయితే వీరి నుంచి నేరగాళ్లు నిమిషానికి భారీగా ఛార్జీ చేస్తున్నారు. నిమిషానికి రూ.200 నుంచి రూ.300 వసూలు చేస్తున్నారని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది.

అంతర్జాతీయ నంబర్‌ల నుంచే వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జియో తన యూజర్లకు సూచిస్తోంది. ఇండియాలో మీకు వచ్చే ఫోన్ నంబర్‌ల ముందు +91 నంబర్ ఉంటుంది. వేరే నంబర్‌తో వచ్చే కాల్స్‌ను ఇంటర్నేషన్ కాల్స్ గా గుర్తించాలి. ఇంటర్నేషనల్ నంబర్‌లతో కాల్స్ చేస్తూ యూజర్లను మోసం చేయడాన్ని ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్‌గా (Premium Rate Service Scam) పేర్కొంది.
ఈ మోసాల బారిన పడకుండా యూజర్ల ఇంటర్నేషనల్ నంబర్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. +91 నంబర్ మినహా ఇతర నంబర్‌ల నుంచే వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలి. దీంతోపాటు గుర్తు తెలియని నంబర్లు నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించవద్దు. అర్థరాత్రి, వేకువ జామనే వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలి.
తరచూ ఇటువంటి నంబర్‌ల నుంచి ఫోన్‌లు వస్తుంటే టెలికాం ఆపరేటర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ కాల్ బ్లాకింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేయమని విజ్ఞప్తి చేయాలి. దీంతోపాటు ఈ తరహా నంబర్లను బ్లాక్ చేయాలి. ఈ స్కామ్ పై కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా అప్రమత్తం చేయాలి. ఇంటర్నేషనల్ కాల్స్ పట్ల వారికి అవగాహన కల్పించాలి.
ప్రీమిరేట్ రేట్ సర్వీస్ స్కామ్ కేవలం భారత్‌లోనే కాకుండా అనేక దేశాల్లోను వెలుగులోకి వస్తోంది. ఫలితంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తు్న్నారు. అయితే టెలికాం సంస్థలు ఈ తరహా నేరాలను కట్టడి చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనల పట్ల ముందస్తుగా అవగాహన కలిగి ఉండడం ఉత్తమం.
ఇప్పటికే స్పామ్ కాల్స్, SMS ల కారణంగా టెలికాం సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ కూడా ఈ తరహా స్పామ్ కాల్స్, SMS ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటోంది.
మోసపూరిత కాల్స్, మెసేజ్‌లు చేస్తున్న నంబర్లను బ్లాక్ చేస్తోంది. దీంతోపాటు మరింత కఠినంగా వ్యవహరించే విధంగా కీలక ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. మోసాలకు పాల్పడే వ్యక్తులు 6 నెలల నుంచి గరిష్ఠంగా 3 సంవత్సరాలపాటు కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేయకుండా ఉండేలా రూల్స్ రూపొదిస్తోంది.


Click it and Unblock the Notifications








