రిలయన్స్ జియోకు ట్రిపుల్ ధమాకా, అవార్డుల పంట

దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన సత్తాను చాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ల

|

దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన సత్తాను చాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (జియో) ఏకంగా మూడు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. రిలయన్స్ జియో గోల్డన్ గ్లోబ్ టైగర్స్ 2019లో మూడు అవార్డులను గెలుచుకుంది. జియో కు చెందిన ప్రముఖ కార్యక్రమాలు భారతీయ డిజిటల్ లైఫ్కు ప్రత్యేకమైన, అర్ధవంతమైన ప్రయోజనాలను చేకూర్చిందని కంపెనీ తెలిపింది. ఈ అవార్డుల ద్వారా రిలయన్స్ జియో ప్రపంచ మార్కెట్లోకి కాలు పెట్టినట్లయిందని దేశీయంగా మార్కెటింగ్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని నమోదు చేసుకున్నదని కంపెనీ తెలిపింది.

రిలయన్స్ జియోకు ట్రిపుల్ ధమాకా, అవార్డుల పంట
రిలయన్స్ జియో ప్రపంచంలో 300 మిలియన్ల మంది భారతీయులను కనెక్ట్ చేసినందుకు గానూ మార్కెట్ లీడర్షిప్ అవార్డును దక్కించుకుంది. తాజా 4జీ ఎల్టీఈ టెక్నాలజీతో ప్రపంచంలోని అతి పెద్ద మొబైల్ డేటా నెట్వర్క్, దేశీయంగా అతిపెద్ద వైర్లెస్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్గా అవతరించామని జియో ఓ ప్రకటనలో తెలిపింది.

రెండవది బెస్ట్ కాంపైన్ అవార్డు

రెండవది బెస్ట్ కాంపైన్ అవార్డు

జియో క్రికెట్ క్రికెట్ ప్లే (JCPA)లో బెస్ట్ కాంపైన్ అవార్డును సొంతం చేసుకుంది. జియో యాప్ ద్వారా క్రికెట్ ప్లేను మొబైల్ స్క్రీన్ మీద పరిచయం చేసినందుకుగానూ ఈ అవార్డు వరించింది.ఈ గేమ్ జియో యూజర్లకు నాన్ జియో యూజర్లకు అందుబాటులో ఉంది.

మూడవది జియో ఫోన్ అవార్డు

మూడవది జియో ఫోన్ అవార్డు

మూడవ అవార్డును ఇండియా స్మార్ట్ఫోన్ జియో ఫోన్కే దక్కింది. అద్భుతమైన డేటా ప్రయోజనాలతో జియో ఫీచర్ ఫోన్ దేశంలో లక్షలాది మంది వినియోగదారులను ఆకట్టుకుందని జియో తెలిపింది. జియో ఫోన్ ద్వారా ఫీచర్ ఫోన్ మార్కెట్లో జియో తిరుగులేని ఆధిపత్యాన్ని నమోదు చేశామని అందుకే ఈ అవార్డును సొంతం చేసుకున్నామని జియో తెలిపింది

గోల్డెన్ గ్లోబ్ టైగర్స్ అవార్డ్స్ -2019

గోల్డెన్ గ్లోబ్ టైగర్స్ అవార్డ్స్ -2019

మలేషియాలోని కౌలాలంపూర్లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గోల్డెన్ గ్లోబ్ టైగర్స్ అవార్డ్స్ -2019 అవార్డులను విజేతలకు అందించారు. మార్కెటింగ్, బ్రాండింగ్, సోషల్ ఇన్నోవేషన్ తదితర రంగాల్లో టైగర్స్ గా నిలిచిన సంస్థలు, వ్యక్తులకు గోల్డెన్ గ్లోబ్ టైగర్స్ పురస్కారాలు అందజేస్తారు.

 

 

4జీ డేటా వేగం బాగా ఉండటం

4జీ డేటా వేగం బాగా ఉండటం

రిలయన్స్‌ జియో 4జీ డేటా వేగం బాగా ఉండటం, అందుబాటు ధరల వల్లే, రెండున్నరేళ్లలోనే 30 కోట్లకు పైగా చందాదార్లను సాధించింది. వినియోగదారుడి నుంచి లభించే సగటు మొత్తంలోనూ జియో వాటా అధికంగా ఉంటోంది. విపణిలో తమ వాటా నిలుపుకునేందుకు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కూడా 4జీ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. జియో మాత్రం ఏకంగా 5జీ వైపు తన చూపును నిలిపింది.

అత్యధికులకు చేరువైన నెట్‌వర్క్‌

అత్యధికులకు చేరువైన నెట్‌వర్క్‌

దేశీయంగా 4జీ సేవలు అందుబాటులోకి తేవడంలో అత్యధికులకు చేరువైన నెట్‌వర్క్‌గా జియో నిలిచిందని లండన్‌ కేంద్రంగా పనిచేసే మొబైల్‌ అనలిటిక్స్‌ అంతర్జాతీయ సంస్థ ఓపెన్‌ సిగ్నల్‌ నివేదించింది. ఈ సంస్థ గత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు అధ్యయనం నిర్వహించి, నివేదిక రూపొందించింది.

వేగంగా చేరగలుగుతున్న నెట్ వర్క్

వేగంగా చేరగలుగుతున్న నెట్ వర్క్

ఏదైనా వెబ్‌సైట్‌కు వేగంగా చేరగలుగుతున్న నెట్ వర్క్ జియో మాత్రమేనని ఓపెన్ సిగ్నల్ చెబుతోంది. అయితే ఎయిర్ టెల్ నెట్ వర్క్ పరిధిలోనే మెరుగ్గా వీడియో వీక్షించొచ్చు. ఎయిర్ టెల్ లో డౌన్ లోడ్ వేగం పెరుగుతుండగా, ఐడియా నెట్ వర్క్ అప్ లోడ్ లో వేగాన్ని నమోదు చేసింది. జియో మాత్రం అన్నింటిలో అప్రతిహంగా దూసుకుపోతోంది.

 

Best Mobiles in India

English summary
Reliance Jio wins 3 awards at Golden Globe Tigers Award 2019

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X