Home
News

Amazon సేల్‌ 2023.. JioBook ల్యా్ప్‌టాప్‌పై ఫెస్టివల్‌ ఆఫర్‌..!

రిలయన్స్ జియో జులై నెలలో JioBook పేరిట ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఆగస్టు నుంచి వీటిని సేల్‌కు అందుబాటులో ఉంచింది. విడుదల సమయంలో ఈ ల్యాప్‌ ధర రూ.16,499గా ఉంది. ఈ పండుగ సీజన్‌లో లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌ కింద ఈ ల్యాప్‌టాప్‌లపై డిస్కాంట్‌ను ప్రకటించింది.

జియో బుక్‌ ఆఫర్ ధర : విడుదల సమయంలో జియోబుక్‌ ధర రూ.16499గా ఉంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ బుక్‌ను రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ఈ ల్యాప్‌టాప్‌ కొనుగోలుపై అదనపు బ్యాంక్‌ ఆఫర్లు, EMI ఆఫర్లు ఇవ్వనుంది. ఫలితంగా మరింత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

jiobook at rs14999 only in amazon

జియో బుక్‌ స్పెసిఫికేషన్లు జియోబుక్ ల్యాప్‌టాప్‌ 4G కనెక్టివిటిని కలిగి ఉంటుంది. మరియు విద్యార్థులు, విద్యా సంబంధ అవసరాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జియో వెల్లడించింది. ఈ ల్యాప్‌ 11.6 అంగుళాల HD యాంటీ గ్లేర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

దీంతోపాటు మీడియాటెక్‌ MT 8788 ఆక్టాకోర్‌ /2.0 GHz/ ARM V8-A 64-bit ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 4GB ర్యామ్‌, 64GB స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డుతో స్టోరేజీని 256 GB వరకు పెంచుకొనే అవకాశం ఉంది.

ఈ జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ Jio OS అపుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌పైన పనిచేస్తుంది. ఈ OS 75కు పైగా షార్ట్‌కట్స్‌, యాప్స్, ఎక్స్‌టెండెట్ డిస్‌ప్లే, టచ్‌ప్యాడ్‌ గెస్చర్‌లు సహా మరిన్నింటిని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌ 8 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. మరియు స్టీరియో స్పీకర్ల, ఇన్ఫినిటి కీబోర్డు, పెద్ద టచ్‌ప్యాడ్‌ను కలిగి ఉంటుంది.

ఈ జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ ఇన్‌బిల్ట్‌ 4G సిమ్‌ కార్డును కలిగి ఉంటుంది. అయితే వినియోగదారులు ఆ సిమ్‌ కార్డును జియో వెబ్‌సైట్‌ లేదా జియో యాప్‌ ద్వారా యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జియో ల్యాప్‌ డ్యూయల్‌ బ్యాండ్‌ Wi-fi (2.4GHz- 5GHz)ను సపోర్టు చేస్తుంది.

ఈ జియోబుక్ మాట్టే ఫినిష్‌ తరహా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. అల్ట్రా స్లిమ్‌ బిల్డ్‌తో తక్కువ బరువును కలిగి ఉంటుంది. వైర్‌లెస్‌ ప్రింటింగ్‌, మల్టీ టాస్కింగ్‌ స్క్రీన్‌, ఇంటిగ్రేటెడ్‌ చాట్‌బోట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. జియో క్లౌడ్‌ ద్వారా గేమ్స్‌ ఆడేందుకు అవకాశం ఉంది. JioBIAN కోడింగ్‌తో విద్యార్థులు c/c++, Java, Python, perl వంటి వివిధ భాషల్లో కోండింగ్‌ నేర్చుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
JioBook laptop limited period offer at only RS 14499 in amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X