Home
News

JioFiber ఉచిత ట్రయల్ ప్లాన్‌లలో ముఖ్యంగా తెలుసుకోవలసింది....

రిలయన్స్ జియో సంస్థ జియోఫైబర్ పేరుతో బ్రాడ్బ్యాండ్ రంగంలోకి అడుగుపెట్టిన తరువాత మొదటిసారిగా ఇటీవల తన ప్లాన్లలో మార్పులను చేసింది. జియోఫైబర్ ప్రస్తుతం మరికొంత మంది యూజర్లను పెంచుకోవడానికి కొన్ని కొత్త ప్లాన్లను విడుదల చేసింది. జియోఫైబర్ ఇప్పుడు తన వినియోగదారులకు మొత్తంగా ఏడు ప్లాన్లను అందిస్తున్నది. వీటి యొక్క ధరలు నెలకు రూ.399 నుండి 30 Mbps వేగంతో మరియు నెలకు 1 Gbps వేగంతో రూ.8,499 ధర వరకు ఉన్నాయి. జియోఫైబర్ యొక్క వెబ్‌సైట్‌లో కనిపించే మరోక గొప్ప విషయం ఏమిటంటే వినియోగదారుల కోసం 30 రోజుల ట్రయల్ ఆఫర్. ఈ ఆఫర్ మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

JioFiber 30-రోజుల ఉచిత ట్రయల్ ప్లాన్‌లు

JioFiber 30-రోజుల ఉచిత ట్రయల్ ప్లాన్‌లు

జియోఫైబర్ తన వినియోగదారుల కోసం ప్రస్తుతం అందిస్తున్న ఉచిత ట్రయల్ ను రెండు ప్లాన్‌లలో అందిస్తోంది. ఈ ఆఫర్ జియోఫైబర్ యొక్క వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ రెండు ప్లాన్‌లు వినియోగదారులకు 150 Mbps వేగాన్ని అందిస్తాయి. అయితే రెండు ప్లాన్‌లు భిన్నమైన ధరలో నిర్ణయించబడి ఉన్నాయి మరియు విభిన్న ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి.

JioFiber 30-రోజుల ఫ్రీ ట్రయల్ మొదటి ప్లాన్‌

JioFiber 30-రోజుల ఫ్రీ ట్రయల్ మొదటి ప్లాన్‌

జియోఫైబర్ తన వినియోగదారులకు అందిస్తున్న మొదటి ప్లాన్ నెలకు రూ.1,500 ధరతో వస్తుంది. ఇది వినియోగదారునికి 150 Mbps వేగాన్ని అందిస్తుంది. కస్టమర్ చెల్లించిన రూ.1,500 పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది. అంటే దీని మొదటి నెల అద్దె మీకు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ డేటా ప్రయోజనంను అందిస్తుంది. JioFiber యొక్క ట్రూలీ అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌లు ప్రతి నెలా 3.3TB డేటా యొక్క FUP పరిమితితో వస్తాయి. ఇది గమనించవలసిన అవసరం ఎంతగానో ఉంది. కానీ ఈ ప్లాన్‌తో OTT ప్రయోజనాలు ఏవీ ఉండవు కానీ ఎటువంటి FUP పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం మాత్రం లభిస్తుంది. కస్టమర్ ఉచితంగా వై-ఫై మోడెమ్ / రౌటర్ ను కూడా అదనంగా పొందవచ్చు.

JioFiber 30-రోజుల ఫ్రీ ట్రయల్ రెండవ ప్లాన్‌

JioFiber 30-రోజుల ఫ్రీ ట్రయల్ రెండవ ప్లాన్‌

30 రోజుల ట్రయల్ కోసం జియోఫైబర్ అందిస్తున్న రెండవ ప్లాన్‌ యొక్క ధర 2,500 రూపాయలు. రూ.2,500 చెల్లించి కొనుగోలు చేసిన వినియోగదారులకు ఆ మొత్తం పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది కాబట్టి ఈ ప్లాన్ యొక్క మొదటి నెల ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ కూడా 150Mbps వేగంతోనే డేటాను అందిస్తుంది. ఇది నెలకు అన్‌లిమిటెడ్ డేటా (3.3 TB) ను అందిస్తుంది. కానీ ఈ ప్లాన్ OTT ప్రయోజనాలతో వస్తుంది. వీటిలో డిస్నీ + హాట్‌స్టార్ విఐపి, జియో సినిమా, Zee5 ప్రీమియం, సోనీ లైవ్, వూట్, ALTబాలాజీ, సన్ ఎన్‌ఎక్స్‌టి, షెమారూ, లయన్స్‌గేట్ ప్లే, మరియు Hoichoi వంటి OTT సభ్యత్వాల జాబితాలో ఉన్నాయి. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో మొదటగా ఉచిత మోడెమ్ / రౌటర్ ఉంది. కానీ దానితో పాటు ప్యాకేజీలో 4K సెట్-టాప్ బాక్స్ ను కూడా లభిస్తుంది.

Best Mobiles in India

English summary
JioFiber 30-Days Free Trial Offers Two Different Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X