Jio STB యూజర్లకు బ్రహ్మాండమైన ఫ్రీ ఆఫర్!! ఉచితంగా డిస్కవరీ + కంటెంట్‌

|

ఇండియాలో జియోఫైబర్ విభాగంలోకి అడుగుపెట్టిన తరువాత మార్కెట్ లో గల పోటీని దృష్టిలో ఉంచుకొని అనేక ఆఫర్లను విడుదల చేసింది. అందులో భాగంగా జియో సెట్-టాప్ బాక్స్ (STB) వినియోగదారులు ఇప్పుడు డిస్కవరీ + కంటెంట్‌ను పొందవచ్చు. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌ల భాగస్వామ్యంతో ఇప్పుడు 40 కంటే ఎక్కువ జెనెర్స్ ప్రపంచ స్థాయి కంటెంట్‌ను వినియోగదారులు చూడడానికి అనుమతిస్తుంది. ఇది హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు, బెంగాలీ మరియు మలయాళ భాషలలో అందుబాటులో ఉన్నందున యూజర్లు కంటెంట్‌లో ఎటువంటి భాషా అడ్డంకిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.

జియోఫైబర్

జియోఫైబర్ కనెక్షన్‌ను కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులకు జియో STB ఉచితంగా అందించబడుతుంది. ఇప్పుడు జియో STB లో డిస్కవరీ + ను చేర్చడంతో జియోఫైబర్ వినియోగదారులు డిస్కవరీ నెట్‌వర్క్ యొక్క విస్తారమైన కంటెంట్ లైబ్రరీను ప్రసారం చేయడానికి వారు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగించగలరు. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Jio STB లో డిస్కవరీ +  కంటెంట్

Jio STB లో డిస్కవరీ + కంటెంట్

జియోఫైబర్ యొక్క ప్లాన్ లలో నెలకు రూ.999 లేదా అంతకంటే ఎక్కువ ధర గల వాటిని ఎంచుకునే ఏ యూజర్ అయినా తమ ప్లాన్‌తో డిస్కవరీ + యొక్క సభ్యత్వాన్ని ఉచితంగా పొందవచ్చు. డిస్కవరీ + యొక్క కంటెంట్ లో వినోదం కంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ దృక్పథంతో కంటెంట్‌ను అందిస్తుంది. అయినప్పటికీ ఇది ఇప్పటికీ సూపర్ వినోదాత్మక మరియు ప్రసిద్ధ షోలైన మాన్ Vs వైల్డ్, ది ఐలాండ్ విత్ బేర్ గ్రిల్స్, అనిమల్స్, మోటారు వాహనాలు వంటి మరిన్ని అంకితమైన షోలను కలిగి ఉంది. ప్రీమియం సభ్యత్వం ఉంటే వినియోగదారులు తమ ప్లాట్‌ఫామ్‌లో BBC నుండి కొన్ని డాక్యుమెంటరీలను కూడా ప్రసారం చేయడానికి అనుమతిస్తాయి.

డిస్కవరీ + సబ్స్క్రిప్షన్

డిస్కవరీ + సబ్స్క్రిప్షన్ లో కొన్ని ఉచిత షోలు ఉన్నప్పటికీ చాలా బాగా తెలిసిన షోలు ప్రీమియం సభ్యత్వం క్రింద వస్తాయి. ఈ ప్లాట్‌ఫామ్ కోసం స్టాండర్డ్ లోన్ సబ్స్క్రిప్షన్ వినియోగదారులకు నెలకు రూ.99 లేదా సంవత్సరానికి రూ .299 ఖర్చు అవుతుంది. వినియోగదారులు నెలకు రూ.999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన జియోఫైబర్ ప్లాన్‌ను ఎంచుకుంటే తమ ప్లాట్‌ఫామ్ లో ఈ నెలవారీ లేదా వార్షిక రుసుమును చెల్లించటానికి మినహాయింపు ఉంటుంది.

జియో STB

వినియోగదారులు జియో STB కలిగి ఉంటే జియో స్టోర్ యాప్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ యాప్ అందుబాటులో ఉంది. డిస్కవరీ + ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ పుష్కలంగా ఉండడంతో మొత్తం కంటెంట్ 60 కంటే ఎక్కువ ఉప-శైలులు మరియు బహుళ భాషలుగా విభజించబడింది. వినియోగదారులు జియోఫైబర్ నుండి రూ.999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్ ను ఎంచుకుంటే కనుక వారికి ఈ ప్లాన్‌తో పాటు ఇతర OTT ప్రయోజనాలు కూడా అదనంగా లభిస్తాయి.

Best Mobiles in India

English summary
JioFiber and Discovery Partnership: These Plans Now Get Free Discovery+ Streaming

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X