జియో బంపరాఫర్.. ఇలా చేస్తే చాలు 2 ఏళ్ల పాటు యూట్యూబ్‌లో యాడ్స్ బాధలుండవ్..!!
దేశీయ టెలికాం దిగ్గజం జియో (Jio) అదిరిపోయే ఆఫర్‌తో మళ్లీ కస్టమర్ల ముందుకు వచ్చేసింది. ఇకపై ఎన్నంటే అన్ని యూట్యూబ్ (YouTube) వీడియోలు యాడ్స్ లేకుండా ఉచితంగా చూడొచ్చు. జియోఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ కస్టమర్లు ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు తీసుకుంటే ఏకంగా 24 నెలలు ఫ్రీగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
ఇకపై యాడ్స్ లేకుండా నాన్-స్టాప్ వీడియోలు చూసేయొచ్చు. సాధారణంగా యూట్యూబ్‌లో 15 నుంచి 20 సెకన్ల వరకు స్కిప్ చేయలేని యాడ్స్ వస్తుంటాయి. దాని వల్ల వీడియో చూసే మూడ్ అంతా పోతుంది. కానీ యూట్యూబ్ ప్రీమియంతో ఈ బాధ ఉండదు.

* గతంలోనూ ఇలాంటి ఆఫర్లు
ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం జియోకి కొత్తేమీ కాదు. ఇదివరకు కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లతో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఇచ్చింది. ఇప్పుడు జియోఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు తీసుకునేవారికి ఏకంగా రెండేళ్లపాటు యూట్యూబ్ ప్రీమియంను ఫ్రీగా అందిస్తోంది. మీరు యూట్యూబ్ ప్రీమియం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, ఇప్పుడే సరైన సమయం.
* ఫ్రీ ప్రీమియం కోసం ఇలా చేయాలి
ఈ ఉచిత యూట్యూబ్ ప్రీమియం పొందాలంటే మీరు జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, మీరు యూట్యూబ్ ప్రీమియం బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు. అంటే యూట్యూబ్ మ్యూజిక్‌తో పాటు యూట్యూబ్ వీడియోలు కూడా యాడ్స్ లేకుండా చూడొచ్చు.
* బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే..
అంతేకాదు, మీ ఫోన్ స్క్రీన్ లాక్ చేసినా లేదా ఇతర పనులు చేస్తున్నా వీడియోలు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతూనే ఉంటాయి. మరో ఉపయోగకరమైన ఫీచర్ ఏంటంటే.. మీకు ఇంటర్నెట్ లేనప్పుడు చూసేందుకు వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.
* ఈ ప్లాన్లకే ఫ్రీ..
ఈ ఆఫర్‌కు అర్హత కలిగిన జియోఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు వచ్చేసి.. రూ. 888, రూ.1,199, రూ.1,499, రూ.2,499, ఇంకా రూ.3,499 ప్లాన్‌లు. యూట్యూబ్ ప్రీమియంతో మీరు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్స్, పీసీలు, ఇంకా స్మార్ట్ టీవీలు వంటి అనేక డివైజ్‌లలో యాడ్స్ లేకుండా వీడియోలు చూసేయొచ్చు.
* రూ.3,000 సేవ్
ఈ రెండేళ్ల యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ వాల్యూ దాదాపు రూ.3,000 ఉంటుంది. అంటే ఇది జియో ఇస్తున్న భారీ ఆఫర్ అని చెప్పొచ్చు. యాడ్స్ లేకుండా వీడియోలు చూడాలనుకునేవారికి యూట్యూబ్ ప్రీమియం ఒక పాపులర్ సర్వీస్. ఈ ఆఫర్ ద్వారా జియో మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
* యూట్యూబ్ మంత్లీ ప్లాన్ రేట్స్
ఒకసారి రిఫరెన్స్ కోసం చూస్తే.. ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం నెలవారీ ధరలు ఇండియాలో విద్యార్థుల కోసం రూ. 89, వ్యక్తిగత ప్లాన్ కోసం రూ.149, ఇంకా ఫ్యామిలీ ప్లాన్ కోసం రూ.299 ఇలా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఉచితంగా యాడ్స్ లేకుండా వీడియోలో చూడాలనుకునేవారు వచ్చిన ప్లాన్ ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








