Home
News

JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు: రూ.1,800 విలువైన OTT చందాలకు ఉచిత యాక్సిస్...

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి ప్రవేశించిన తరువాత మిగిలిన వారితో పోటీ పడడానికి తీవ్రంగా కృషి చేస్తున్నది. ఇది ఇప్పుడు కొత్తగా కొన్ని ప్లాన్‌లను ప్రవేశపెట్టడంతో జియోఫైబర్ ఇప్పుడు తన పోర్ట్ పోలియోలో మొత్తంగా ఏడు ప్లాన్‌లను కలిగి ఉన్నాయి. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు రూ.399 ప్రారంభ ధర వద్ద నుండి ప్రస్తుతం లభిస్తున్నాయి. అయితే దేశంలోని ఇతర సంస్థలు తమ ISPలను సరసమైన ధరల వద్ద లభించడం లేదు. రిలయన్స్ జియో యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో లభించే అదనపు ప్రయోజనాల మాదిరిగానే రూ.1,800 విలువైన OTT సబ్స్క్రిప్షన్ లను జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో అందిస్తోంది. JioFiber అందించే OTT ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల OTT ప్రయోజనాలు

JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల OTT ప్రయోజనాలు

JioFiber యొక్క రూ.399 మరియు రూ.699 ఎంట్రీ లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఎటువంటి OTT సబ్స్క్రిప్షన్స్ ఉండవు. అయితే OTTసబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు రూ.999 మరియు ఆపైన ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో లభిస్తాయి. రూ.999 ధర వద్ద లభించే జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ యొక్క OTT ప్రయోజనాల విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ VIP, సోనీలైవ్, Zee5, SunNXT, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ALTBalaji , హోయిచోయ్, షెమరూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ +, ఈరోస్ నౌ, జియో సినిమా మరియు జియోసావన్ ప్రయోజనాలు లభిస్తాయి. మొత్తంమీద జియోఫైబర్ యొక్క రూ.999 ప్లాన్ రూ.1,000 విలువైన OTT సబ్స్క్రిప్షన్ లను ఉచితంగా అందిస్తుంది.

 

రూ.1,500 విలువైన OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలతో JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

రూ.1,500 విలువైన OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలతో JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

రూ.1,499 ధర వద్ద లభించే జియోఫైబర్ ప్లాన్‌ యొక్క OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 1,500 రూపాయల విలువైన OTT సభ్యత్వాలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. వీటి యొక్క వివరాలలోకి వెళితే రూ.499 విలువైన నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ VIP, సోనీలైవ్, ZEE5, SunNXT, VOOT సెలెక్ట్, VOOT కిడ్స్, ALTBalaji , హోయిచోయ్, షెమరూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ +, ఈరోస్ నౌ, జియో సినిమా మరియు జియోసావన్ వంటి OTTలకు ఉచిత యాక్సిస్ లభిస్తుంది.

రూ.1,600 విలువైన OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలతో JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

రూ.1,600 విలువైన OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలతో JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

రూ .2,499 మరియు రూ .3999 ధర వద్ద లభించే జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల యొక్క OTT ప్రయోజనాల విషయానికి వస్తే ఇవి నెలకు రూ.649 విలువైన నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ విఐపి, సోనీలైవ్, Zee5, సన్‌ఎన్‌ఎక్స్‌టి, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ALTBalaji, హోయిచోయ్, షెమరూమీ, లయన్స్‌గేట్ ప్లే ఈరోస్ నౌ, జియో సినిమా మరియు జియోసావన్ వంటి OTT యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు ఉచితంగా అందించే OTT యాప్ చందాల విలువ సుమారు 1,650 రూపాయలు.

రూ.1,800 విలువైన OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలతో JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

రూ.1,800 విలువైన OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలతో JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యొక్క పోర్ట్ పోలియోలో చివరగా రూ.8,499 ధర వద్ద గల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 799 రూపాయల విలువైన ‘నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం' ప్లాన్ యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది కాకుండా ఇతర OTT ప్రయోజనాలలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ VIP, సోనీలైవ్, ZEE5, సన్‌ఎన్‌ఎక్స్‌టి, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఎఎల్‌టిబాలాజీ, హోయిచోయ్, షెమరూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ +, ఈరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ వంటి OTTలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. జియో ఫైబర్ యొక్క ఈ ప్లాన్‌ అందిస్తున్న OTT చందా ప్రయోజనాల విలువ సుమారు రూ.1,800.

Best Mobiles in India

English summary
JioFiber Broadband Plans Offer Free Access For OTT subscriptions Worth Rs 1,800
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X