జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ధరలు తగ్గాయి!! కొత్త కనెక్షన్ కోసం సరైన సమయం

|

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ జియో ఫైబర్ పేరుతో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్‌లను నెలకు రూ.399 ప్రారంభ ధరతో ప్రారంభించింది. కంపెనీ ఈ ప్లాన్‌లను 6 నెలల మరియు 12 నెలల వార్షిక ఎంపికలతో అందిస్తుంది. జియో ఫైబర్ బ్రోన్జ్ పేరుతో లభించే ఈ ప్లాన్ రూ.399 ధర వద్ద అపరిమిత వాయిస్ కాల్ సౌకర్యంతో పాటుగా 30Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ భారతదేశంలో ఎక్కడైనా 3,300 FUP డేటా పరిమితి మరియు అపరిమిత కాలింగ్‌తో వస్తుంది. అదేవిధంగా జియో ఫైబర్ యొక్క సిల్వర్ ప్లాన్ రూ.699 ధర వద్ద 100 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. అదనంగా ఇది అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే రూ.399 మరియు రూ.699 ధర వద్ద అందించే ప్లాన్‌లలో ఎటువంటి OTT యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లేదు. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

జియోఫైబర్

జియోఫైబర్ రూ.999 ధర వద్ద అందించే గోల్డ్ ప్లాన్ 150 Mbps వేగంతో 3,300 FUP డేటాను అందిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్ ప్రయోజనం కూడా ఉన్నాయి. ఇది కాకుండా 1,000 రూపాయల విలువైన 11 OTT యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. అలాగే రూ.1,499 ధర వద్ద లభించే జియోఫైబర్ డైమండ్ ప్లాన్‌ కూడా కస్టమర్‌లకు 300 Mbps వేగంతో 3,300 FUP డేటాను అందిస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యంతో పాటు 1,500 రూపాయల విలువైన 12 OTT యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తుంది. ఈ 12 OTT యాప్‌లలో Alt Balaji, Sun NXT, Shemaroo, Disney+ Hotstar, JioCinema, Zee5, Netflix, Prime Video, Lionsgate Play, Hoichoi, Sony Liv మరియు Voot వంటివి ఉన్నాయి.

Diamond+ ప్లాన్‌
 

జియోఫైబర్ రూ.2,499 ధర వద్ద అందించే Diamond+ ప్లాన్‌లో 4,000GB మొత్తం డేటాను 500Mbps వేగంతో అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ప్లాన్ 12 OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది. అలాగే జియో ఫైబర్ ప్లాటినం ప్లాన్ ఇప్పుడు వినియోగదారుల కోసం రూ.3,499కి తగ్గించబడింది. అంతకుముందు ఇది రూ.3,999 ధర వద్ద లభించేది. ఇది అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటుగా 12 OTT యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. చివరిగా రూ.8,499 ధర వద్ద లభించే టైటానియం ప్లాన్‌ను కంపెనీ అత్యంత ఖరీదైన ప్లాన్ విభాగంలో అందిస్తుంది. ఇది గరిష్టంగా 1Gbps వేగంతో 15,000GB నెలవారీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది.

జియోఫైబర్ 30-రోజుల ఉచిత ట్రయల్ ఆఫర్

జియోఫైబర్ 30-రోజుల ఉచిత ట్రయల్ ఆఫర్

జియోఫైబర్ కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి వాటి యొక్క అన్ని సేవలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 30 రోజుల పాటు ఉచితంగా యాక్సిస్ చేయడానికి 30-రోజుల ఉచిత ట్రయల్‌ని రిలయన్స్ జియో ప్రకటించింది. ట్రయల్ వ్యవధిలో భాగంగా JioFiber కొత్త కస్టమర్లు 150 Mbps ఇంటర్నెట్ వేగంతో డేటాను అందిస్తుంది. అలాగే 4K సెట్-టాప్ బాక్స్, టాప్ 10 పెయిడ్ OTT యాప్ లకు మరియు ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా లభిస్తాయి. ఫ్రీ ట్రయిల్ ముగిసిన తరువాత కస్టమర్ వీటి యొక్క సేవలను ఇష్టపడకపోతే కనుక ఎటువంటి ప్రశ్నలు అడగకుండా అన్ని డివైస్ లను తిరిగి తీసుకుంటామని కంపెనీ తెలిపింది.

జియోఫైబర్ కనెక్షన్‌ని పొందే విధానం

జియోఫైబర్ కనెక్షన్‌ని పొందే విధానం

స్టెప్ 1: జియో యొక్క వెబ్‌సైట్ jio.comకి లేదా మైజియో యాప్ కి వెళ్లండి.

స్టెప్ 2: జియోఫైబర్ ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: మీరు రీఛార్జ్/పేబిల్ మరియు JioFiber రిజిస్ట్రేషన్‌ని చూడగలిగే పేజీ ఓపెన్ చేయబడుతుంది.

స్టెప్ 4: Get JioFiber ఎంపిక మీద క్లిక్ చేయండి.

స్టెప్ 5: మీ పేరు, మొబైల్ నంబర్‌ని నమోదు చేసి "జెనరేట్ OTP" ఎంపిక మీద క్లిక్ చేయండి.

స్టెప్ 6: మీ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.

స్టెప్ 7: OTPని ధృవీకరించు క్లిక్ చేయండి.

స్టెప్ 8: మీకు జియోఫైబర్ కనెక్షన్ అవసరమైన మీ చిరునామాను నమోదు చేయండి.

స్టెప్ 9: చివరిగా 'సబ్మిట్' ఎంపిక మీద క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

English summary
JioFiber Broadband Plans Price Slashed! How to Get JioFiber New Connection

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X