JioFiber బడ్జెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు!! ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్‌ యాక్సెస్‌లతో

|

దేశంలోని ప్రముఖ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP)లలో జియోఫైబర్ కూడా ఒకటి. టెలికాం రంగంలోనే కాకుండా బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా జియో మెరుగైన సేవలను అందిస్తున్నది. ప్రస్తుత పరిస్థితులలో ప్రజల యొక్క ఇంటర్నెట్ మరియు నెట్‌వర్క్ కనెక్టివిటీ అవసరం గరిష్ట స్థాయికి చేరుకుంది. నేటి సమాజంలో ఒక రోజు ఇంటర్నెట్ డిస్‌కనెక్ట్ కావడంతో ఒక వ్యక్తి తాను వెనుకబడిపోయినట్లుగా భావించే అవకాశం కూడా లేకపోలేదు.

బ్రాడ్‌బ్యాండ్

ఇంటర్నెట్‌ సాయంతో ప్రతి ఒక్కరు తమ యొక్క అన్ని రకాల పనులను చాలా వేగంగా చేయడం వంటి వాటికి అలవాటుపడ్డారు. కానీ ప్రతి ఒక్కరూ తమ యొక్క అవసరాల కోసం హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ఎంచుకోలేరు మరియు వాటి కోసం ప్రతి నెల చెల్లించలేరు కూడా. అందుకే జియోఫైబర్ వంటి ISPలు తమ వినియోగదారులకు వారి బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవడంతో పాటుగా ఇంటర్నెట్ కనెక్టివిటీని తక్కువ-ధరలో లభించే ప్లాన్‌తో అందిస్తున్నాయి. జియోఫైబర్ కంపెనీ సరసమైన ధరలో అందించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు మరియు అవి మూడు నెలల సర్వీస్‌తో ఎంచుకున్నప్పుడు అందించే ఓవర్-ది-టాప్ (OTT) సబ్‌స్క్రిప్షన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫైబర్ 30 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

జియోఫైబర్ 30 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

జియోఫైబర్ తన యొక్క వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలను ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడ్‌లలో అందిస్తుంది. మీరు తక్కువ మొత్తంలో ఖర్చు చేసి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ఉచితంగా OTT యాక్సెస్‌ని పొందాలనుకుంటే కనుక ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఇందులో మొదటిది రూ.1797 ధర వద్ద లభిస్తుంది. దీనికి GST కూడా ఉంటుంది అని గమనించండి. ఇది మూడు నెలల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ పోస్ట్‌పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 30 Mbps వేగంతో నెలకు 3.3TB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. దీనితో పాటుగా డిస్నీ+ హాట్‌స్టార్, ZEE5, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, సన్‌ఎన్‌ఎక్స్‌టి, హోయిచోయ్, డిస్కవరీ+ లతో సహా 14 OTT యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తుంది. వినియోగదారులు 550+ కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. అదనంగా కంపెనీ జియో STBని కూడా ఉచితంగా కూడా అందిస్తుంది.

జియోఫైబర్

జియోఫైబర్ వినియోగదారులు రూ.1797 మొత్తం కూడా అధికం అని భావిస్తే కనుక దీని కంటే కొద్దిగా తక్కువ ధర వద్ద లభించే ఇలాంటి 30 Mbps ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు. రూ.1497 + GST ధర వద్ద లభించే ప్లాన్‌తో నెలకు 3.3TB డేటాను 30 Mbps వేగంతో పాటుగా 6 OTT యాప్‌లు మరియు మూడు నెలల పాటు 400+ లైవ్ టీవీ ఛానెల్‌ల ప్రయోజనాలను పొందవచ్చు. డేటా పరిమితి ఈ ప్లాన్‌కు కూడా వర్తిస్తుంది. ఆ తర్వాత రూ.1197 + GST ధర వద్ద మూడు నెలల చెల్లుబాటు కాలానికి లభించే మరో 30 Mbps ప్లాన్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌కి సంబంధించిన నిబంధనలు మరియు షరతులు పైన పేర్కొన్న వాటికి సమానంగా ఉంటాయి. కానీ వినియోగదారులకు ఎటువంటి OTT ప్రయోజనాలు ఉండవు అని గుర్తుంచుకోవాలి.

కంక్లూషన్

కంక్లూషన్

మొత్తంగా చెప్పాలంటే కనుక ఈ ప్లాన్‌లన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా జియోఫైబర్ OTT ప్రయోజనాలు మరియు లైవ్ టీవీ యాక్సెస్‌తో తమ యొక్క ప్లాన్ లను అందిస్తుంది. మీరు OTT యాక్సెస్‌తో జియోఫైబర్ యొక్క 30 Mbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంటే కనుక మీరు టీవీ సబ్‌స్క్రిప్షన్ కోసం విడిగా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత రోజులలో కేవలం టీవీ సబ్‌స్క్రిప్షన్ కోసమే నెలకు రూ.300 వరకు ఖర్చు చేస్తున్నారు. వాటితో పోలిస్తే కనుక ఇది చాలా విలువైనది.

Best Mobiles in India

English summary
JioFiber Budget Broadband Plans Comes With Several OTT App Access: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X