జియో ఫైబర్ వచ్చేస్తోంది, స్పీడ్‌లో ఏ మార్పు లేదు !

By Hazarath
|

ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న జియో ఫైబర్ నెట్ అతి త్వరలోనే దూసుకువస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం జియో రిలయన్స్‌ కమ్యూనికేషన్‌కు చెందిన ఆస్తులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ డీల్ పూర్తి కాగానే జియో ఫైబర్ లాంచ్ తేదీలను ప్రకటిస్తుందని అనధికార రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

 

అత్యంత తక్కువ ధరలో నోకియా 1, రెడీగా ఉండండి !అత్యంత తక్కువ ధరలో నోకియా 1, రెడీగా ఉండండి !

డీల్‌

డీల్‌

ఇదిలా ఉంటే జియోకు, ఆర్‌కామ్‌కు మధ్య జరుగుతున్న ఈ డీల్‌లో ఆర్‌కామ్‌కు చెందిన 850, 900, 1800, 2100 మెగాహెడ్జ్‌ బ్యాండ్స్‌లో 122.4 యూనిట్ల 4జీ ఎయిర్‌వేవ్స్‌ను జియో కొనుగోలు చేస్తోంది.

1,78,000 కిలోమీటర్ల ఫైబర్‌, 43వేల టవర్లు..

1,78,000 కిలోమీటర్ల ఫైబర్‌, 43వేల టవర్లు..

1,78,000 కిలోమీటర్ల ఫైబర్‌, 43వేల టవర్లు ఈ డీల్లో భాగం కానున్నాయి. ఇప్పటికే వైర్‌లెస్‌ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న జియో, 1,78,000 కిలీమీటర్లకు పైగా ఫైబర్‌ నెట్‌వర్క్‌తో భవిష్యత్తులో టెలికాం దిగ్గజాలకు భారీ షాక్ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి.

3,00,000 కిలోమీటర్ల ఫైబర్‌ నెట్‌వర్క్‌ ..
 

3,00,000 కిలోమీటర్ల ఫైబర్‌ నెట్‌వర్క్‌ ..

జియోకి ఇప్పటి వరకు 3,00,000 కిలోమీటర్ల ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఉందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. గ్రామ గ్రామాలకు జియోని విస్తరించాలంటే మరింత పైబర్ నెట్ వర్క్ అవసరం ఎంతైనా ఉంది.

ఆర్‌కామ్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌..

ఆర్‌కామ్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌..

ఇప్పుడు ఆర్‌కామ్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను దక్కించుకున్న అనంతరం ఎక్కువ ప్రాంతాల్లో, చాలా వేగవంతంగా దీన్ని లాంచ్‌ చేయడానికి వీలవుతుందని టెక్‌ వర్గాలు తెలిపాయి.

100 ఎంబీపీఎస్ స్పీడుతో ..

100 ఎంబీపీఎస్ స్పీడుతో ..

ఉచితంగా మూడు నెలల ట్రయల్‌ నేపథ్యంలో జియో ఎంపికచేసిన ప్రాంతాల్లో జియోఫైబర్‌ను అందుబాటులో ఉంచింది. జియోఫైబర్ ద్వారా కనీసం 100 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.

Best Mobiles in India

English summary
JioFiber can be a reality soon now that Jio has bought RCom fiber network Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X