JioFiber కొత్తగా రూ.100 లకే ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను విడుదల చేసింది...

|

ఇండియాలోని టెలికాం రంగంలోకి జియో ప్రవేశించిన కొద్ది రోజులలోనే అధిక వినియోగదారులను పొందడమే కాకుండా మొదటి స్థానానికి చేరుకున్నది. అయితే తరువాత రోజులలో బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా తన యొక్క పంథాను కొనసాగించాలని జియోఫైబర్ పేరుతో ప్రవేశించింది. అయితే ముందు నుంచి ఉన్న వాటికి గట్టి పోటీని ఇవ్వలేనప్పటికీ కూడా మంచి గుర్తింపును అందుకున్నది. ఇప్పుడు తన వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి కొత్తగా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను తీసుకొచ్చింది.

జియోఫైబర్

ప్రస్తుతం మీరు జియోఫైబర్ యొక్క కస్టమర్ అయితే కనుక రూ.999 కంటే ఎక్కువ ధర వద్ద లభించే ప్లాన్‌లను కొనుగోలు చేసిన వారు మాత్రమే ఓవర్-ది-టాప్ (OTT) సబ్‌స్క్రిప్షన్‌లను పొందగలరు. అయితే భారతదేశంలో నివసిస్తున్న చాలా మంది ఇంత మొత్తం చెల్లించి కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. అటువంటి వారికి అనుకూలంగా జియోఫైబర్ కొత్తగా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్‌లను తీసుకొనివచ్చింది. ఇవి 30 Mbps మరియు 100 Mbps డౌన్‌లోడ్/అప్‌లోడ్ వేగాన్ని అందించే రూ.399 మరియు రూ.699 ధరల వద్ద లభించే ప్లాన్‌లకు పొడిగింపుగా ఉద్దేశించబడ్డాయి. ఈ రెండు ప్లాన్‌ల యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నెలకు రూ. 100లకే జియోఫైబర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్

నెలకు రూ. 100లకే జియోఫైబర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్

జియోఫైబర్ తన యొక్క వినియోగదారులకు కొత్తగా అందుబాటులోకి తీసుకొనివచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.399 లేదా రూ. 699 ప్లాన్‌కి పొడిగింపుగా ఉంటుంది. మీరు ముందుగా ఈ ప్లాన్‌లలో దేనినైనా కొనుగోలు చేసి ఆపై నెలకు రూ.100తో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను పొందాలి. ఇలా పొందిన వినియోగదారులు ఆరు OTT యాప్‌లను ఉచితంగా యాక్సిస్ చేయడానికి అనుమతిని పొందుతారు.

స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్‌బుక్‌ యాప్‌లో HD వీడియోలను అప్‌లోడ్ చేయడం ఎలా?స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్‌బుక్‌ యాప్‌లో HD వీడియోలను అప్‌లోడ్ చేయడం ఎలా?

నెలకు రూ. 200లకే జియోఫైబర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్
 

నెలకు రూ. 200లకే జియోఫైబర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్

మీకు మరిన్ని OTT యాప్‌లకు యాక్సెస్ కావాలంటే కనుక మీరు ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇది నెలకు రూ.200 ధరతో లభిస్తుంది. ఇది 14 OTT యాప్‌లను ఉచితంగా యాక్సెస్ చేయడనికి అనుమతిని ఇస్తుంది. ఈ ప్లాన్‌లు జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ప్రీపెయిడ్ జియోఫైబర్ కస్టమర్ అయితే కనుక ఈ కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను పొందడానికి మీరు ముందుగా పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌గా మారవలసి ఉంటుంది. మీరు కంపెనీ నుండి ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తున్నట్లయితే మీరు జియో సెట్-టాప్ బాక్స్ (STB)ని కూడా క్లెయిమ్ చేయవచ్చు.

జియోఫైబర్

జియోఫైబర్ యొక్క ఇతర ప్లాన్‌లలో ఎటువంటి మార్పులు లేకుండా ముందు మాదిరిగానే కొనసాగుతున్నాయి. మీరు ఇప్పటికీ ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్‌లు లేకుండా జియోఫైబర్ నుండి మీ ఎంట్రీ-లెవల్ ప్లాన్‌లను కొనసాగించాలనుకుంటే మీరు అలానే ముందుకు వెళ్ళవచ్చు. అయితే మీకు OTT సబ్‌స్క్రిప్షన్‌లు కావాలంటే కనుక ఇతర ISPలు (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు) అందిస్తున్న వాటితో పోలిస్తే సరసమైన ధరలో జియోఫైబర్ అందిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను ఎంచుకోవడం మీకు ఉత్తమ మార్గం అని మా అభిప్రాయం. ఇది టెల్కో యొక్క ప్రతి వినియోగదారులకు ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేసే అవకాశాన్ని ఇస్తుంది.

Best Mobiles in India

English summary
JioFiber Launched New Entertainment Bonanza Plans Starting at Just Rs.100 Only

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X