Home
News

జియోఫైబర్ యొక్క కొత్త త్రైమాసిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు వాటి పూర్తి వివరాలు

ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి ప్రవేశించిన కొన్ని రోజులకే మంచి గుర్తింపు అందుకున్న జియోఫైబర్ ఈ సంవత్సరం జూన్‌లో సెమీ వార్షిక మరియు వార్షిక జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇవి నెలవారీన రూ.399 ధర నుండి ప్రారంభమవుతుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌ను సెమీ వార్షికంగా లేదా వార్షిక ప్రాతిపదికన కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఈ ప్లాన్‌లు జీరో సెక్యూరిటీ డిపాజిట్ మరియు జీరో ఇన్‌స్టాలేషన్ ఛార్జీల వంటి ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

జియోఫైబర్

అయితే ఇప్పుడు జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ తన వినియోగదారుల కోసం త్రైమాసిక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వినియోగదారులు మూడు నెలల చెల్లుబాటు కాలానికి జియోఫైబర్ ప్లాన్‌లను ముందుగా సబ్‌స్క్రైబ్ చేయవచ్చు మరియు తరువాత దాని కోసం చెల్లించవచ్చు. ఈ త్రైమాసిక జియోఫైబర్ ప్లాన్‌లను అధికారిక జియో వెబ్‌సైట్ యొక్క జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ బ్యానర్ నుండి బుక్ చేసుకోవచ్చు. వీటిని పొందడానికి 'బుక్ నౌ' బటన్ ను ఎంచుకోవలసి ఉంటుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ తన వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 4K సెట్-టాప్ బాక్స్‌ని ఉచితంగా అందిస్తుంది. ఏదేమైనా ఈ సర్వీసును ఉపయోగించుకునే వినియోగదారులకు కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి. వీటిలో ఒకేసారి తిరిగి చెల్లించే మొత్తం మరియు ఇన్‌స్టాలేషన్ కోసం చెల్లించిన రూ.1,000 అడ్వాన్స్ ఉన్నాయి. 30 రోజుల ట్రయల్ వ్యవధి తర్వాత యూజర్లు సర్వీసును నిలిపివేస్తే సెట్-టాప్ బాక్స్‌ పని చేసే స్థితిలో తిరిగి ఇవ్వబడినట్లయితే ఇవి తిరిగి ఇవ్వబడతాయి. జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు 3300GB వాణిజ్య వినియోగదారు విధానంతో అపరిమిత ప్లాన్లుగా ప్రచారం చేయబడ్డాయి.

జియోఫైబర్100 Mbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియోఫైబర్100 Mbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియోఫైబర్100 Mbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మూడు నెలల పాటు 100 Mbps డేటా స్పీడ్‌తో పాటు అపరిమిత కాలింగ్ మరియు డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ ధర రూ.2,097. ఇందులో అదనపు స్ట్రీమింగ్ ప్రయోజనాలు ఏవి కూడా అందుబాటులో లేవు.

జియోఫైబర్ 150 Mbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియోఫైబర్ 150 Mbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్

150 Mbps స్పీడ్ తో లభించే జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మూడు నెలల చెల్లుబాటు కాలానికి రూ.2,997 ధర వద్ద లభిస్తుంది. అదనంగా ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, మరియు నెట్‌ఫ్లిక్స్ వంటి మరిన్ని OTT సబ్‌స్క్రిప్షన్‌లతో వస్తుంది.

జియోఫైబర్ 300 Mbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియోఫైబర్ 300 Mbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియోఫైబర్ 300 Mbps త్రైమాసిక ప్లాన్ రూ.4,497 ధర వద్ద లభిస్తుంది. ఇది అపరిమిత వాయిస్ మరియు డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా మరిన్ని 15 OTT సబ్‌స్క్రిప్షన్‌లతో వస్తుంది.

జియోఫైబర్ 500 Mbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియోఫైబర్ 500 Mbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియోఫైబర్ 500 Mbps త్రైమాసిక పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 500 Mbps వేగంతో అపరిమిత డేటా మరియు వాయిస్ ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా 15 OTT సబ్‌స్క్రిప్షన్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. దీని ధర మూడు నెలలకు రూ.7,497.

జియోఫైబర్ 1 Gbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియోఫైబర్ 1 Gbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియోఫైబర్ యొక్క 1 Gbps పోస్ట్‌పెయిడ్ ప్లాన్ త్రైమాసిక చెల్లుబాటు కాలానికి లభించే అపరిమిత ప్లాన్ రూ.11,997 ధర వద్ద 1Gbps డేటా వేగంతో అపరిమిత డేటా మరియు వాయిస్ మరియు స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. 1 Gbps వేగంతో లభించే మరొక జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 6600GB డేటాను అందిస్తుంది. దీని ధర రూ .25,497. ఇవి రెండు కూడా ఇతర ప్లాన్‌ల వలె నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా 15 OTT సబ్‌స్క్రిప్షన్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
JioFiber Launches 3 Months Validity New Postpaid Broadband Plans: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X