Just In
- 17 hrs ago
BSNL యూజర్లకు కొత్తగా రూ.197 వోచర్ ప్లాన్!! 180 రోజుల వాలిడిటీతో కానీ...
- 18 hrs ago
Airtel vs Vi vs Jio: IPL చూడడానికి అవసరమైన అధిక FUP డేటాను అందించే ప్లాన్లు ఇవే...
- 1 day ago
ఐఫోన్ లో Android ఫీచర్లు వాడేందుకు కొత్త యాప్ !
- 1 day ago
Redmi Note 10 ఫోన్లలో టచ్ స్క్రీన్ సమస్యలు..? లాంచ్ అయ్యి నెల కూడా కాలేదు..!
Don't Miss
- News
ప్రభుత్వం నుంచి ఆలయాలకు విముక్తి: తిరుపతి బీజేపీ-జనసేన మేనిఫెస్టో కీలకాంశాలు
- Movies
Vakeel Saab Day 3 collections: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత.. ఆ పరిస్థితులను తొక్కేసిన పవన్ కల్యాణ్ మూవీ
- Sports
SRH vs KKR: ప్చ్.. సరిపోని హిట్టింగ్.. హైదరాబాద్‌కు దక్కని శుభారంభం!
- Finance
టాప్ టెన్‌లోని 4 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.14 లక్షల కోట్లు జంప్
- Lifestyle
Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు చాలా సంతోషిస్తారు...
- Automobiles
మలేసియాలో విడుదలైన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్; పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
JioFiber బంపర్ ఆఫర్!! లాంగ్ టర్మ్ ప్లాన్‌లపై 30 రోజుల అదనపు వాలిడిటీ...
టెలికాం రంగంలో విపరీతమైన మార్పులను తీసుకువచ్చిన రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా జియోఫైబర్ పేరుతో అడుగు పెట్టింది. జియోఫైబర్ మొదలైనప్పటి నుంచి వినియోగదారులను ఆకట్టుకోవడానికి రకరకాల ఆఫర్లను అందిస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు మళ్లీ కొత్తగా మరొక ఆఫర్‌తో తిరిగి వచ్చింది. ఈ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఇప్పుడు ఎవరైతే దీర్ఘకాలిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను ఎంచుకున్నట్లు అయితే వారికి 30 రోజుల వరకు అదనపు సబ్స్క్రిప్షన్స్ ఉచితంగా అందిస్తోంది. జియోఫైబర్ వినియోగదారులు ఒక నెల వాలిడిటీ నుండి సంవత్సరం అంటే వార్షిక చెల్లుబాటుతో లభించే ప్లాన్ లను వేర్వేరు వేగంతో మరియు ప్రయోజనాలతో అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

JioFiber దీర్ఘకాలిక ప్లాన్లతో అదనపు వాలిడిటీ
జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ అందించే దీర్ఘకాలిక ప్లాన్ లను పొందే వినియోగదారులు ఇప్పుడు అదనంగా ఒక నెల పాటు సేవలను ఉచితంగా పొందవచ్చు. సంస్థ అందించే ప్రతి ప్లాన్ లో ఈ అదనపు వాలిడిటీ ప్రయోజనం వర్తిస్తుంది. ఒక సంవత్సరం పాటు ఏదైనా ప్లాన్ ను ఎంచుకునే వినియోగదారులు ఇప్పుడు అదనంగా 30 రోజులపాటు ప్లాన్ యొక్క అన్ని సేవలను ఉచితంగా పొందవచ్చు. ఇంకా 6నెలలు లేదా సెమీ వార్షిక వాలిడిటీతో ఏదైనా ప్లాన్ ను కొనుగోలు చేసే వినియోగదారులు 15 రోజులపాటు అన్ని రకాల సేవలను ఉచితంగా పొందటానికి అర్హులు అవుతారు.

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఇప్పుడు ఏదైనా ఒక ప్లాన్ ను ఒక సంవత్సరం చెల్లుబాటుతో కొనుగోలు చేస్తే వారికి ఆ ప్లాన్ యొక్క ప్రయోజనం 360 రోజులు + 30 రోజులు ఉచితం విధంగా ప్యాక్ చేయబడి అందిస్తుంది. అలాగే 6నెలలు లేదా సెమీ వార్షిక వాలిడిటీతో ఏదైనా ప్లాన్ ను ఎంచుకుంటే కనుక వారికి ప్లాన్ ప్రయోజనాలు 180 రోజులు + 15 రోజులు ఉచితం విదంగా అందించబడుతుంది. అయితే ప్లాన్ యొక్క ఇతర అన్ని ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి.

జియోఫైబర్ వినియోగదారులు బ్రాడ్‌బ్యాండ్ యొక్క ఏదైనా ప్లాన్ ను లాంగ్ టర్మ్ వాలిడిటీతో ఎంచుకుంటే కనుక వారికి ప్లాన్ యొక్క నెలవారీ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. ఉదాహరణకు 30Mbps వేగంతో లభించే ప్లాన్‌ను వార్షిక వాలిడిటీతో ఎంచుకునే వినియోగదారులు వన్‌టైమ్ చెల్లింపుగా రూ.5,694 చెల్లించవలసి ఉంటుంది. దీని అర్థం వినియోగదారుడికి నెలసరి వ్యయం రూ.474. అయితే ఈ అదనపు ఒక నెలతో ప్లాన్ యొక్క నెలవారీ ఖర్చు రూ.438 కు తగ్గించబడుతుంది.

దీర్ఘకాలిక ప్లాన్ లపై అదనపు వాలిడిటీ అనేది JioFiber నుండి లభించే ఒక అద్భుతమైన ప్రయోజనం. ఈ ఆఫర్ ఎంతకాలం ఉంటుందనే దానిపై కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలను విడుదల చేయలేదు కాబట్టి మీకు ఇష్టమైన ప్లాన్ ను అన్ని రకాల ప్రయోజనాలతో తక్కువ ధర వద్ద పొందడానికి ఇదే సరైన సమయం. జియో యొక్క తన తాజా ఆఫర్ కు మంచి స్పందన లభిస్తే కనుక దీర్ఘకాలిక ప్లాన్ ల మీద ఈ ఆఫర్ పొడిగించే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఏదేమైనా వార్షిక ప్లాన్ లేదా సెమీ వార్షిక ప్లాన్ లను ఎంచుకోవడానికి ఎవరినైనా ప్రేరేపించడానికి ఈ అదనపు వాలిడిటీ సరిపోతుందా?
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999