Jio యూజర్లకు భారీ బంపరాఫర్ తెచ్చింది.. రూ.6,500 మీ సొంతం!

|

దేశంలోనే అతి పెద్ద టెలికం కంపెనీ రిలయన్స్ జియోకు కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను విడుదల చేస్తుంది. తాజాగా, తమ సంస్థకు చెందిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) JioFiber కూడా వినియోగదారుల కోసం దీపావళి పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద, కొత్త JioFiber కనెక్షన్‌ని కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులు రూ.6500 విలువైన ప్రయోజనాలను పొందుతారని కంపెనీ పేర్కొంది. ఇది పరిమిత-కాల ఆఫర్, ఇది అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 28, 2022 మధ్య వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

jio

ఈ ఆఫర్కు కంపెనీ JioFiber డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022గా పేరు పెట్టింది. కంపెనీ ఈ ఆఫర్‌ను రూ.599 మరియు రూ.899 రెండు ప్లాన్‌లకు మాత్రమే తీసుకొచ్చింది. కనీసం ఆరు నెలల పాటు ప్లాన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు ఈ ఆఫర్ అందించబడుతుందని గుర్తుంచుకోండి. రూ.899 ప్లాన్‌ని మూడు నెలల పాటు కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోెవడానికి ఆర్టికల్ చివరి వరకు చదవండి.

JioFiber డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022

JioFiber డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022

Jio ఈ ఆఫర్‌ను JioFiber డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022గా పిలుస్తోంది. ఈ ఆఫర్ కింద, వినియోగదారులు 15 రోజుల అదనపు చెల్లుబాటుతో పాటు కంపెనీ నుండి 100% వాల్యూ బ్యాక్ ప్రయోజనాలను పొందుతారు. ఆఫర్‌లో ఉన్న ప్లాన్‌ల బ్రేక్‌డౌన్ మరియు మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుందో చూద్దాం.

1. రూ.599 X 6 నెలల ప్లాన్ తో కొత్త కనెక్షన్ తీసుకునే వారికి లభించే ప్రయోజనాలు;

1. రూ.599 X 6 నెలల ప్లాన్ తో కొత్త కనెక్షన్ తీసుకునే వారికి లభించే ప్రయోజనాలు;

ప్లాన్ తో వచ్చే సాధారణ ప్రయోజనాలు;
30 Mbps నెట్ స్పీడ్, 14+ OTT యాప్‌లు & 550+ ఆన్-డిమాండ్ ఛానెల్‌లు.
ధర(6 నెలలకు) రూ.4,241 (రూ.3,594 + రూ.647 GST)

దీపావళి ఆఫర్లో లభించే ప్రయోజనాలు;
ఈ ప్లాన్‌ తీసుకునే కొత్త కస్టమర్‌లు రూ.4,500 విలువైన వోచర్‌లను పొందుతారు. వోచర్‌లు 4 విభిన్న బ్రాండ్‌లకు చెందినవి. వాటిలో AJIO యొక్క రూ.1,000 వోచర్, రిలయన్స్ డిజిటల్ రూ.1,000 వోచర్, రూ.1,000 నెట్‌మెడ్స్ వోచర్ మరియు రూ.1,500 ఇక్సిగో వోచర్లు ఉంటాయి. అదనంగా, ఈ కస్టమర్లందరికీ ప్లాన్‌లో భాగమైన 6 నెలల చెల్లుబాటుతో పాటు 15 రోజుల అదనపు చెల్లుబాటు లభిస్తుంది.

2. రూ. 899 X 6 నెలల ప్లాన్ తో కొత్త కనెక్షన్ తీసుకునే వారికి లభించే ప్రయోజనాలు;

2. రూ. 899 X 6 నెలల ప్లాన్ తో కొత్త కనెక్షన్ తీసుకునే వారికి లభించే ప్రయోజనాలు;

ప్లాన్ తో వచ్చే సాధారణ ప్రయోజనాలు;
100 Mbps నెట్ స్పీడ్, 14+ OTT యాప్‌లు & 550+ ఆన్-డిమాండ్ ఛానెల్‌లు.
ధర (6 నెలలకు) రూ.6,365 (రూ. 5,394 + రూ. 971 GST)

దీపావళి ఆఫర్లో లభించే ప్రయోజనాలు;
ఈ ప్లాన్‌ తీసుకునే కొత్త కస్టమర్‌లు రూ.6,500 విలువైన వోచర్‌లను పొందుతారు. వోచర్‌లు 4 విభిన్న బ్రాండ్‌లకు చెందినవి వీరికి వస్తాయి. వాటిలో AJIO యొక్క రూ.2,000 వోచర్, రిలయన్స్ డిజిటల్ యొక్క రూ.1,000 వోచర్, నెట్‌మెడ్స్ యొక్క రూ.500 వోచర్ & ఇక్సిగో యొక్క రూ.3,000 వోచర్లు పొందుతారు. అదనంగా, ఈ కస్టమర్లందరికీ ప్లాన్‌లో భాగమైన 6 నెలల చెల్లుబాటుతో పాటు 15 రోజుల అదనపు చెల్లుబాటు లభిస్తుంది.

3. రూ. 899 X 3 నెలల ప్లాన్ తో కొత్త కనెక్షన్ తీసుకునే వారికి లభించే ప్రయోజనాలు;

3. రూ. 899 X 3 నెలల ప్లాన్ తో కొత్త కనెక్షన్ తీసుకునే వారికి లభించే ప్రయోజనాలు;

ప్లాన్ తో వచ్చే సాధారణ ప్రయోజనాలు;

100 Mbps నెట్ స్పీడ్, 14+ OTT యాప్‌లు & 550+ ఆన్-డిమాండ్ ఛానెల్‌లు.
ధర (3 నెలలకు) రూ.2,697 (రూ. 3,182 + రూ. 485 GST)

దీపావళి ఆఫర్లో లభించే ప్రయోజనాలు;
ఈ ప్లాన్‌ తీసుకునే కొత్త కస్టమర్‌లు రూ.3,500 విలువైన వోచర్‌లను పొందుతారు. వోచర్‌లు 4 విభిన్న బ్రాండ్‌లకు చెందినవి వీరికి వస్తాయి. వాటిలో AJIO యొక్క రూ.1,000 వోచర్, రిలయన్స్ డిజిటల్ యొక్క రూ.500 వోచర్, నెట్‌మెడ్స్ యొక్క రూ.500 వోచర్ & IXIGO యొక్క రూ.1,500 వోచర్లు వస్తాయి. దయచేసి గమనించండి, ఈ ప్లాన్‌పై అదనపు చెల్లుబాటు వర్తించదు.

పై ప్లాన్‌లలో దేనినైనా కొనుగోలు చేసే కస్టమర్‌లు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా రూ.6,000 విలువైన 4K JioFiber సెట్-టాప్ బాక్స్ (STB)ని కూడా పొందుతారు.

Best Mobiles in India

English summary
Jiofiber new custormers will get Rs.6,500 value back benefits. Check details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X