JioFiber Broadband: యూజర్లను అద్భుతమైన ఆఫర్లతో ఆకట్టుకుంటున్న జియోఫైబర్
భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి కొత్తగా ఇటీవల కాలంలో ప్రవేశించిన జియోఫైబర్ మెరుగైన ప్లాన్లను అందిస్తూ ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకొని అనదికాలంలోనే అగ్రశ్రేణి ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఆపరేట్లలో ఒకటిగా ఎదిగింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కూడా భారతదేశంలో అగ్రశ్రేణి ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ బ్రాండ్లలో ఒకటిగా కొనసాగుతున్నది. ఈ రెండు సంస్థలకు దేశవ్యాప్తంగా మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు మరియు అనేక సర్కిల్‌లలో తమ యొక్క సేవలను అందిస్తారు.

ఈ రెండు కంపెనీలు భారతదేశంలోని టైర్ -2 మరియు టైర్ -3 నగరాలకు కూడా తమ యొక్క సేవలను విస్తరిస్తున్నందున ఆ నగరాల్లో నివసించే చాలా మంది ప్రజలు ఏ ఆపరేటర్‌ను ఎంచుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడటానికి ఈ వ్యాసం రాస్తున్నాము. ఈ రెండు కంపెనీలు చాలా సారూప్యమైన ప్లాన్లను అందిస్తున్నందున సరైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడడానికి జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క సమర్పణలలో గల చిన్న తేడాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు ఆర్థికంగా మెరుగ్గా ఉందా?
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అందించే ప్లాన్ల కంటే జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు చాలా పొదుపుగా ఉంటాయి. ఈ రెండు కంపెనీలు అందించే బేస్ ప్లాన్లలో జియో రూ .399 ధరను కలిగి ఉండగా ఎయిర్‌టెల్ సంస్థ రూ.499 ధర వద్ద లభిస్తుంది. ఈ కంపెనీల బేస్ ప్లాన్ల మధ్య రూ.100 వ్యత్యాసం ఉన్నప్పటికీ ఎయిర్‌టెల్ సంస్థ 30Mbps వేగంతో లభించే జియో ప్లాన్‌కు వ్యతిరేకంగా 40 Mbps వేగాన్ని అందించడం ద్వారా ధరల అంతరాన్ని సమర్థిస్తుంది.

ఈ రెండు కంపెనీలు తమ యొక్క వినియోగదారులకు 100 Mbps వేగంతో లభించే ప్లాన్‌లను కూడా అందిస్తున్నాయి. ఇందులో కూడా రెండు ఫైబర్ బ్రాండ్ల ప్లాన్లల యొక్క ధరల వత్యాసంలో రూ.100 గ్యాప్ ఉంది. ఇక్కడ కూడా ఎయిర్టెల్ యొక్క ప్లాన్ ఖరీదైనదిగా ఉంటుంది. అయితే రెండు ప్లాన్లు ఒకే వేగం, అదే FUP డేటా (3.3TB) మరియు స్థిర-లైన్ వాయిస్ కాలింగ్ ప్రయోజనంతో వస్తాయి. ఎయిర్టెల్ యొక్క ప్లాన్ తో ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ మరియు షా అకాడమీ వంటి కొన్ని ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలు ఉన్నాయి.

జియో రూ.999 ప్లాన్‌తో ఎయిర్టెల్ ప్లాన్‌కు మించిన ప్రయోజనాలు
రూ.999 ధరల విభాగంలో లభించే ప్లాన్ల విషయానికి వస్తే జియో యొక్క ప్లాన్ ఎయిర్టెల్ ప్లాన్ కంటే చాలా వెనుకబడి ఉంది. ఎయిర్టెల్ యొక్క ప్లాన్ 200 Mbps వేగంతో లభించగా జియోఫైబర్ యొక్క ప్లాన్ 150 Mbps వేగంతో వస్తుంది. డిస్నీ + హాట్‌స్టార్ విఐపి, అమెజాన్ ప్రైమ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం మరియు ఇతర ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ఇతర OTT ప్రయోజనాలు ఎయిర్‌టెల్ ప్లాట్‌ఫామ్‌కు ఉచిత చందాను అందించబడతాయి. రిలయన్స్ జియో నెలకు రూ.1,000 విలువైన బహుళ OTT ప్రయోజనాలను ఉచితంగా అందిస్తుంది.

రెండు కంపెనీలు రూ.1,499 ధర వద్ద తమ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇవి 300Mbps స్పీడ్‌తో అదే మొత్తంలో ఎఫ్‌యుపి డేటాను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌తో అందించే OTT ప్రయోజనాల కారణంగా ఇక్కడ Jio ఎయిర్‌టెల్ కంటే ముందడుగు వేస్తుంది. JioFiber వినియోగదారులకు నెలకు 1,500 రూపాయల విలువైన 15 రకాల OTT ప్రయోజనాలను తమ ప్లాట్‌ఫారమ్‌లలో అందిస్తుంది. ఎయిర్‌టెల్ 999 రూపాయల ప్లాన్‌తో సమానమైన OTT ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ మళ్లీ రూ.999 ప్లాన్‌తో మరియు రూ.3999 ధర వద్ద లభించే ప్లాన్‌తో అదే ఒటిటి ప్రయోజనాలను 1 జిబిపిఎస్ వేగంతో అందిస్తుంది. JioFiber వినియోగదారులకు కూడా అదే ధరల వద్ద ప్లాన్ లను అందిస్తుంది. అయితే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ VIP, సోనీలైవ్ వంటి వాటితో సహా మరిన్ని OTT ప్రయోజనాలను అందిస్తుంది. పైన పేర్కొన్న ధరలలో ఏదీ పన్నులు కలిగి ఉండదు. కంపెనీలలో దేనితోనైనా వినియోగదారులు ఆఫర్ యొక్క నిబంధనలు మరియు షరతులకు అనుగుణంగా ఉంటే ఉచిత రౌటర్‌ను స్వీకరించడానికి అర్హులు.


Click it and Unblock the Notifications