జియోఫైబర్ నుంచి కొత్తగా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు!! ఫ్రీగా సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జీలు

|

రిలయన్స్ జియో టెలికాం సంస్థ ఇండియాలో ప్రవేశించినప్పటి నుంచి వినూత్న మార్పులను తీసుకువస్తుంది. బ్రాడ్ బాండ్ విభాగంలో కూడా సంస్థ తన యొక్క హవాను కొనసాగిస్తున్నది. ఇప్పుడు ఈ సంస్థ జియోఫైబర్ భారతీయ చందాదారుల కోసం పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ ప్లాన్ లు ఇంకా కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రతిబింబించలేదు. కానీ జూన్ 17 గురువారం అంటే రేపటి నుంచి ప్రారంభించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు.

 

పోస్ట్‌పెయిడ్

కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు నెలకు రూ.399 నుండి ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా జియోఫైబర్ దూకుడుగా ఆరు నెలలు మరియు 12 నెలల సబ్స్క్రిప్షన్ ఎంపికలను కూడా అందిస్తుందని భావిస్తున్నారు. రిలయన్స్ జియో సంస్థ జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లను కొనుగోలు చేసిన వినియోగదారుల వద్ద నుండి ఇంటర్నెట్ సెటప్ యొక్క సెక్యూరిటీ డిపాజిట్‌ను మరియు ఇన్స్టాలేషన్ లను కూడా వసూలు చేయదు.

 

జియో రూ.247 కొత్త ప్లాన్‌ కంటే అధిక డేటాను అందిస్తున్న BSNL 4G ప్లాన్‌లు ఇవే...జియో రూ.247 కొత్త ప్లాన్‌ కంటే అధిక డేటాను అందిస్తున్న BSNL 4G ప్లాన్‌లు ఇవే...

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు
 

జియోఫైబర్ యొక్క కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఆఫర్ చేస్తున్న ప్రయోజనాలకు సమానమైన వాటిని అందిస్తుంది. ఈ ప్రణాళికలు నెలకు రూ.399 ధర వద్ద నుండి ప్రారంభం కానున్నాయి. కానీ జియో నెలవారీ ప్లాన్ యొక్క అధిక శ్రేణులను కూడా అందిస్తుందని భావిస్తున్నారు. JioFiber పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు కూడా ఆరు నెలల మరియు 12 నెలల ఎంపికలను అందించే అవకాశం ఉంది. అయితే ప్రణాళికల యొక్క ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియరాలేదు.

 

రోజువారి FUP డేటాలో జియో, ఎయిర్టెల్ లను వెనక్కి నెట్టిన వోడాఫోన్ ఐడియా(Vi)...రోజువారి FUP డేటాలో జియో, ఎయిర్టెల్ లను వెనక్కి నెట్టిన వోడాఫోన్ ఐడియా(Vi)...

జియోఫైబర్

ఏప్రిల్‌లో జియో తన ఆరు నెలల మరియు వార్షిక జియోఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లపై 30 రోజుల అదనపు వాలిడిటీని ప్రకటించింది. అదే ఆఫర్ JioFiber పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు విస్తరించబడే అవకాశం అధికంగా ఉంది.

ఆల్వేస్ ఆన్ సర్వీస్

జియో ఇప్పుడు కొత్తగా ‘ఆల్వేస్ ఆన్ సర్వీస్' ను కూడా అందించనుంది. ఇది ఏదైనా సర్వీస్ యొక్క అంతరాయాలను జాగ్రత్తగా చూసుకోవటానికి 24x7 కస్టమర్ సపోర్ట్ తో పాటు, జియోఫైబర్ పోస్ట్ పెయిడ్ ప్లాన్లతో ఆటోపే పేమెంట్ ఎంపికతో పాటు రానున్నట్లు సమాచారం.

4K సెట్-టాప్ బాక్స్‌

జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు వినియోగదారులకు రూ.1000 తిరిగి చెల్లించదగిన సెక్యూరిటీ డిపాజిట్ కోసం 4K సెట్-టాప్ బాక్స్‌ను అందిస్తారు. రూ.999 లో 15 OTT యాప్ లు కూడా లభిస్తాయి. వీటిలో ప్రాంతీయ యాప్ లైన సన్‌నెక్స్ట్, హోయిచోయ్ వంటివి మరిన్ని ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Jiofiber Plan to Launch Postpaid plans With Free Security Deposit Charges

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X