జియోఫైబర్ 500 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ ఎంతమేర ఉపయోగకరంగా ఉంది!!!

|

ఇండియాలోని ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో టెలికాం సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా తన యొక్క సేవలను అందిస్తూ అద్భుతమైన ప్లాన్‌లతో యూజర్లను ఆకట్టుకుంటున్నది. జియోబ్రాడ్‌బ్యాండ్ తన యొక్క విభాగంలో చౌకైన ఎంపికగా ఉండకపోవచ్చు కానీ యూజర్లు విస్మరించలేని అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఆన్ లైన్ పద్దతిలో నేర్చుకోవడం, గేమింగ్, స్ట్రీమింగ్ వంటి ప్రయోజనాల కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్ అనేది ప్రస్తుత కాలంలో మన జీవితంలో కీలకంగా మారిడమే కాకుండా హై-స్పీడ్ ప్లాన్‌లకు డిమాండ్ కూడా బాగానే పెరిగింది. జియోబ్రాడ్‌బ్యాండ్ 500 Mbps వేగంతో అందించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు ఇతర ISPలతో బిన్నంగా ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫైబర్ 500 Mbps ప్లాన్

జియోఫైబర్ 500 Mbps ప్లాన్

500 Mbps హై-స్పీడ్ తో ఇంటర్నెట్ ను అందించే ప్లాన్ యొక్క విషయానికి వస్తే జియోఫైబర్ అనేక బహుళ ప్రయోజనాలతో కూడిన ప్యాక్‌ని కలిగి ఉంది. జియోఫైబర్ నెలకు రూ.2,499 ధర వద్ద ఈ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 500 Mbps హై-స్పీడ్ సుష్టమైన అప్‌లోడ్ మరియు డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తు ఒకే సమయంలో బహుళ పరికరాల్లో అతుకులు లేని కనెక్టివిటీని అందిస్తుంది. దీనితో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ లతో పాటుగా మరొక పదమూడు OTT యప్ప్లేకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తూ టన్నుల కొద్ది వినోద భరిత సభ్యత్వాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒక సంవత్సరం చెల్లుబాటు వ్యవధిని కలిగి ఉంది. ఈ ప్లాన్ ధర GSTని మినహాయించిందని మరియు అది వర్తించే విధంగా ఛార్జ్ చేయబడుతుందని గమనించాలి. దీనిని పొందాలని చూస్తున్న వినియోగదారులు రిలయన్స్ జియో అధికారిక వెబ్‌సైట్ నుండి ప్లాన్‌ను యాక్సెస్ చేయవచ్చు.

నెలకు రూ. 100లకే జియోఫైబర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్

నెలకు రూ. 100లకే జియోఫైబర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్

జియోఫైబర్ తన యొక్క వినియోగదారులకు కొత్తగా అందుబాటులోకి తీసుకొనివచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.399 లేదా రూ. 699 ప్లాన్‌కి పొడిగింపుగా ఉంటుంది. మీరు ముందుగా ఈ ప్లాన్‌లలో దేనినైనా కొనుగోలు చేసి ఆపై నెలకు రూ.100తో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను పొందాలి. ఇలా పొందిన వినియోగదారులు ఆరు OTT యాప్‌లను ఉచితంగా యాక్సిస్ చేయడానికి అనుమతిని పొందుతారు. మీకు మరిన్ని OTT యాప్‌లకు యాక్సెస్ కావాలంటే కనుక మీరు ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇది నెలకు రూ.200 ధరతో లభిస్తుంది. ఇది 14 OTT యాప్‌లను ఉచితంగా యాక్సెస్ చేయడనికి అనుమతిని ఇస్తుంది. ఈ ప్లాన్‌లు జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ప్రీపెయిడ్ జియోఫైబర్ కస్టమర్ అయితే కనుక ఈ కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను పొందడానికి మీరు ముందుగా పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌గా మారవలసి ఉంటుంది. మీరు కంపెనీ నుండి ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తున్నట్లయితే మీరు జియో సెట్-టాప్ బాక్స్ (STB)ని కూడా క్లెయిమ్ చేయవచ్చు.

స్పెక్ట్రా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

స్పెక్ట్రా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

స్పెక్ట్రా బ్రాడ్‌బ్యాండ్ సంస్థ 500 Mbps హై-స్పీడ్ తో రెండు ప్లాన్‌లను ఆఫీస్ ప్లాన్‌లుగా జాబితా చేయబడి విభిన్న ధర ట్యాగ్‌లతో విభిన్న డేటా క్యాపింగ్‌తో లభిస్తాయి. ఇందులో స్పెక్ట్రా యొక్క మొదటి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు రూ.1,599 ధర ట్యాగ్‌తో లభిస్తుంది. ఇది 500 Mbps వేగంతో ఇంటర్నెట్ ను యాక్సిస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో మొత్తంగా 500GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ త్రైమాసిక, అర్ధ-వార్షిక మరియు వార్షిక ఎంపికలతో కూడా వస్తుంది. ఈ ప్లాన్ యొక్క మూడు నెలల ధర రూ. 4,797, ఆరు నెలల ప్లాన్ ధర రూ. 9,594 మరియు ఒక సంవత్సరానికి ధర ట్యాగ్ రూ. 19,188. 500 Mbps హై-స్పీడ్ తో లభించే మరొక ప్లాన్ నెలకు రూ.1,999 ధరతో వస్తుంది. ఈ ప్లాన్ నెలకు మొత్తం 750GB డేటాను అందిస్తుంది. పైన పేర్కొన్న విధంగానే ఈ ప్లాన్ కూడా త్రైమాసిక, అర్ధ-వార్షిక మరియు వార్షిక చెల్లుబాటుతో కూడా వస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.5,997, రూ. 11,994 మరియు రూ. 23,988 గా ఉన్నాయి.

టాటా ప్లే ఫైబర్ 500 Mbps ప్లాన్

టాటా ప్లే ఫైబర్ 500 Mbps ప్లాన్

టాటా స్కై ఇటీవలే దాని మోనికర్‌ని టాటా ప్లే ఫైబర్‌గా మార్చింది. అయితే ప్లాన్‌లు అలాగే ఉన్నాయి. టాటా ప్లే ఫైబర్ 500 Mbps ప్లాన్ ని నెలకు రూ.2,300 ధర వద్ద అందిస్తుంది. వివిధ చెల్లుబాటు కాలాలతో కంపెనీ ఈ 500 Mbps ప్లాన్‌ని అందిస్తోంది కాబట్టి వినియోగదారులు ఈ ప్లాన్‌ను దీర్ఘకాలికంగా కూడా పొందవచ్చు. మూడు నెలల వాలిడిటీకి రూ.6,900 ధర వద్ద ఈ ప్లాన్‌ను పొందవచ్చు. అలాగే ఆరు నెలల వాలిడిటీకి రూ.900 తగ్గింపుతో దీనిని రూ.12,900 ధర వద్ద పొందవచ్చు. చివరిగా ఒక సంవత్సరపు కాలానికి రూ.3000 తగ్గింపుతో రూ.24,600 ధర వద్ద పొందవచ్చు. టాటా ప్లే ఫైబర్ 100% ఫైబర్ నెట్‌వర్క్‌తో పాటుగా ఫైబర్ ఆప్టిక్స్‌తో ఎండ్-టు-ఎండ్ కనెక్టివిటీని నేరుగా సర్వీస్ ప్రొవైడర్ నుండి వినియోగదారుల ఇళ్లకు అందిస్తుంది. ఇది హై-స్పీడ్ కనెక్టివిటీతో స్థిరమైన ఇంటర్నెట్ అనుభవాన్ని అందిస్తుంది. వినియోగదారులు ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో 3300GB లేదా 3.3TB ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటాను అందుకుంటారు. ఆ తర్వాత వేగం 3 Mbpsకి తగ్గించబడుతుంది.

Best Mobiles in India

English summary
JioFiber Provides Better 500 Mbps Broadband Plan Among These Service Providers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X