Just In
- 1 hr ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 4 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 5 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 6 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- Finance
Budget 2021-22: స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాల ధరలు పెరుగుతాయా?
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- News
ప్రశ్నిస్తే చంపేసే నయా నియంత జగన్ రెడ్డి : జనసేన కార్యకర్త వెంగయ్య మృతిపై లోకేష్ వ్యాఖ్యలు
- Automobiles
విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్
- Lifestyle
మీరు త్వరలో గర్భం ప్లాన్ చేస్తున్నారా? మీరు COVID-19 టీకా షాట్ పొందాలా వద్దా అని తెలుసుకోండి
- Movies
అభిజిత్ ఎవరు?.. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కామెంట్స్ వైరల్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
BSNL, Airtel, Jiofiber యొక్క అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు ఇవే!!!
ఇండియాలో గత కొన్ని నెలలుగా ముఖ్యంగా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం డిమాండ్ చాలా వరకు పెరిగింది. ఇంటి నుండి పనిచేసే వ్యక్తులు, విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు ప్రసారం చేయడం, ఆపై వినోద ప్రయోజనాల కోసం ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ స్ట్రీమింగ్ కారణంగా కూడా ఇంటర్నెట్ వినియోగం ఎక్కువ అయింది. అన్ని రకాల బ్రాడ్‌బ్యాండ్ సంస్థలు తమ వినియోగదారుల కోసం తక్కువ ధరతో పాటుగా అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను కూడా అందిస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ సంస్థలు అందించే ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను జాబితా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ యొక్క అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ నుండి అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు రూ.16,999 ధర వద్ద వస్తుంది. ఇది వినియోగదారులకు 100 Mbps ఇంటర్నెట్ వేగంతో 3,500GB ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటాను అందిస్తుంది. FUP డేటా వినియోగం తరువాత దీని స్పీడ్ 10 Mbpsకి పడిపోతుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో వినియోగదారులకు అపరిమిత కాలింగ్‌తో ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను కూడా పొందుతారు. బిఎస్ఎన్ఎల్ నుండి ఈ ప్లాన్ చాలా ఎక్కువ ధరతో చూడటం కొంచెం వింతగా ఉంది.
Also Read: 14 ఐఫోన్ 12 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్లతో పారిపోయి ఝలక్ ఇచ్చిన డెలివరీ బాయ్....

జియోఫైబర్ యొక్క అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
జియోఫైబర్ నుండి అత్యంత ఖరీదైన ప్లాన్ నెలకు రూ.8,499 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లకు 1Gbps ఇంటర్నెట్ స్పీడ్‌తో 6,600GB నెలవారీ FUP డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ విఐపి, సోనీలివ్, Zee5, ALTబాలాజీ, వూట్ కిడ్స్, హోయిచోయ్, షెమరూమి, లయన్స్‌గేట్ ప్లే, జియోసావన్, జియో సినిమా, డిస్కవరీ +, వూట్ సెలెక్ట్, మరియు ఈరోస్ నౌ వంటి OTT యాప్ లకు కూడా ఉచిత యాక్సిస్ ను కూడా వినియోగదారులకు అందిస్తుంది.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ నుండి అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు 3,999 రూపాయల ధర వద్ద లభిస్తుంది. ఇది నెలకు 1Gbps వేగంతో వినియోగదారులకు అన్లిమిటెడ్ డేటా (3.3TB లేదా 3,333GB) డేటాను అందిస్తుంది. దీనితో పాటుగా ఈ ప్లాన్ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా అదనంగా ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లకు లయన్స్‌గేట్, వూట్ బేసిక్, ఈరోస్ నౌ, షెమరూమి, అల్ట్రా, మరియు హంగామా ప్లే వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సిస్ ను ఉచితంగా అందిస్తుంది. దీనితో పాటుగా ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలు కూడా అదనంగా పొందవచ్చు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190