Jio GigaFiberకి పోటీగా భారత్ ఫైబర్, BSNL ధమాకా ఆఫర్
దేశీయ రంగంలో ఇతర టెలికం దిగ్గజాలతో దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు జియోతో ఢీ అంటే ఢీ అంటోంది.
దేశీయ రంగంలో ఇతర టెలికం దిగ్గజాలతో దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు జియోతో ఢీ అంటే ఢీ అంటోంది. జియో గిగా ఫైబర్ కి పోటీగా భారత్ ఫైబర్ ని లాంచ్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా యూజర్లకు రోజుకు 35 జిబి డేటాను అందిస్తోంది. వినియోదారులు రోజుకు 1.1రూపాయి చెల్లించి 1జిబి డేటాను పొందవచ్చు. ఈ సంధర్భంగా BSNL Board CFA డైరక్టర్ వివేక్ బన్జాల్ మాట్లాడుతూ కస్టమర్ల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని దీన్ని రిలీజ్ చేశామని తెలిపారు. ప్రతి ఇంటికి ఫైబర్ టెక్నాలజీని తీసుకెళ్లే లక్ష్యంతో ఈ ఆఫర్ ని తీసుకువచ్చామని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.

బుకింగ్స్
భారత్ ఫైబర్ కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించారు. కంపెనీ అఫిషియల్ వెబ్ సైటు ద్వారా వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అందులో అన్ని వివరాలు పొందుపరిచామని ఆయన తెలిపారు.

జియోకి పోటీ
కాగా ఈ ప్లాన్ త్వరలో రానున్న జియో గిగా ఫైబర్ కి గట్టి పోటీనివ్వనుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. జియో గిగా ఫైబర్ వచ్చే లోపు వీలైనన్నీ కనెక్షన్లు అందిపుచ్చుకోవాలని ఎక్కువ డిమాండ్ ను సృష్టించుకోవాలని బిఎస్ఎన్ఎల్ వ్యూహారచన చేస్తోంది.

FTTH (Fiber to the home) లాంచ్
కాగా ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం Home WiFi కోసం FTTH (Fiber to the home) మీద భారీగానే ఇన్వెస్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా హై ఎండ్ క్వాలితో కూడిన హెచ్ డి కంటెంట్ అందుబాటులోకి తీసుకురానుంది.

399 రీఛార్జ్ ప్లాన్
కాగా రిలయన్స్ జీయో రూ. 399 రీఛార్జ్ ప్లాన్ కి దీటుగా, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) దాని రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఇంతకుముందు ఉన్న ప్లాన్ ని సవరించింది.సవరించిన రూ. 399 బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రోజుకు 3.21 జీబి 2G / 3G డేటాను అపరిమిత వీడియో కాలింగ్, రోజుకు 100 ఉచిత SMS మరియు ఉచిత వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ టోన్ (PRBT) తో అందిస్తుంది. రీఛార్జ్ ప్లాన్ 74 రోజుల వ్యవధి లభిస్తుంది.


Click it and Unblock the Notifications








