జియో బ్రాడ్‌బాండ్, అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు !

|

దేశంలో మరో విప్లవాత్మక మార్పుకు నాంది పలికే విధంగా జియో ముందుకు దూసుకురానున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్లు అది తీసుకురానున్న జియో GigaFiber మీదనే ఉన్నాయి. ఎలాంటి ఆఫర్లతో అది మార్కెట్లోకి వస్తుందోనని అందరూ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలయన్స్‌ ప్రారంభించబోయే జియోగిగాఫైబర్‌ సర్వీసులు, బ్రాడ్‌బాండ్, ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేగలవని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (సీవోఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ వ్యాఖ్యానించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ శీర్షికలో భాగంగా జియో బ్రాడ్‌బాండ్ మీద కొన్ని విషయాలను పాఠకులకు అందిస్తున్నాం.

 

జియో దెబ్బ, నోకియా బనానా ఫోన్‌కి వాట్సప్ ఫీచర్ !జియో దెబ్బ, నోకియా బనానా ఫోన్‌కి వాట్సప్ ఫీచర్ !

గృహాలు, వ్యాపార సంస్థలను టార్గెట్‌..

గృహాలు, వ్యాపార సంస్థలను టార్గెట్‌..

గృహాలు, వ్యాపార సంస్థలను టార్గెట్‌గా చేసుకుని త్వరలోనే అత్యంత వేగంతో కూడిన ఫిక్స్‌డ్‌ లైన్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను జియో అందుబాటులోకి తీసుకురానుంది. 

1,100 నగరాల్లో..

1,100 నగరాల్లో..

దేశవ్యాప్తంగా 1,100 నగరాల్లో ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను రిలయన్స్‌ అందుబాటులోకి తీసుకురానుంది.

ఆగస్టు 15 నుంచి..

ఆగస్టు 15 నుంచి..

ఈ సేవలను ఆగస్టు 15 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి తీసకురానున్నారు. ఆసక్తిగల కస్టమర్లు ఆ రోజు నుంచి బ్రాడ్‌బ్యాండ్ కోసం రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

ఫైబర్‌ కనెక్టివిటీ ద్వారా
 

ఫైబర్‌ కనెక్టివిటీ ద్వారా

ఫైబర్‌ కనెక్టివిటీ ద్వారా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, అల్ర్టా హై డెఫినే షన్‌ వాయిస్‌ యాక్టివేటెడ్‌ వర్చువల్‌ అసిస్టెన్స్‌, వర్చువల్‌ రియాలిటీ గేమింగ్‌, మల్టీ పార్టీ వీడియో కాన్ఫరెన్స్‌, డిజిటల్‌ షాపింగ్‌, స్మార్ట్‌ హోమ్‌ సొల్యూషన్లను పొందవచ్చు.

ఇంటిదాకా ఒకే ఫైబర్‌..

ఇంటిదాకా ఒకే ఫైబర్‌..

ప్రస్తుతం నెట్‌ సంస్థలు.. భవంతి దాకా ఒక లైను, ఆ తర్వాత బయటి నుంచి ఇంటికి మరో లైను ద్వారా ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్నాయి. దీనివల్ల స్పీడ్‌ తగ్గిపోతోందని, గిగాఫైబర్‌తో అలాంటి సమస్య లేకుండా నేరుగా ఇంటిదాకా ఒకే ఫైబర్‌తో కనెక్షన్‌ ఉంటుంది.

మిల్లీ సెకన్ల వ్యవధిలోనే ..

మిల్లీ సెకన్ల వ్యవధిలోనే ..

దీని ద్వారా స్పీడ్‌పరమైన కష్టాలకు చెక్ పెట్టవచ్చు. మిల్లీ సెకన్ల వ్యవధిలోనే అత్యంత వేగంతో డౌన్‌లోడ్‌, అప్‌లోడ్స్‌ చేసుకోవచ్చు. సెకను వేలాది మెగాబైట్లు, గిగాబైట్ల వేగంతో కూడిన డేటాను అందించేందుకు జియో పావులు కదుపుతోంది.

100 ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ స్పీడ్‌

100 ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ స్పీడ్‌

త్వరలో రానున్న ఈ ఫైబర్ ద్వారా 1 జీబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్, 100 ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ స్పీడ్‌తో జియో గిగాఫైబర్‌ సర్వీసులు ఉండనున్నాయి. ఈ సర్వీస్‌ ద్వారా 5 కోట్ల గృహాలకు డేటా కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంది.

 గిగాటీవీ సెట్‌టాప్‌ బాక్స్‌

గిగాటీవీ సెట్‌టాప్‌ బాక్స్‌

ఏజీఎంలో గిగాటీవీ సెట్‌టాప్‌ బాక్స్‌ను కూడా లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. పలు ప్రాంతీయ భాషల్లో వాయిస్‌ కమాండ్స్‌కి అనుగుణంగా దీన్ని రూపొందిస్తున్నారు.

600 టీవీ చానల్స్, వేల కొద్దీ సినిమాలు

600 టీవీ చానల్స్, వేల కొద్దీ సినిమాలు

యూజర్లు తమ టీవీ ద్వారా మల్టీ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ నిర్వహించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. జియో గిగాటీవీ సెట్‌టాప్‌ బాక్స్‌తో 600 టీవీ చానల్స్, వేల కొద్దీ సినిమాలు, అసంఖ్యాకంగా పాటలు కూడా రిలయన్స్‌ జియో అందించనుంది.

వీడియో కాలింగ్‌ చేసే సదుపాయం

వీడియో కాలింగ్‌ చేసే సదుపాయం

జియో గిగాఫైబర్, గిగాటీవీ సెట్‌టాప్‌ బాక్స్‌లకు కనెక్టయిన ఇతరత్రా టీవీ యూజర్లకు వీడియో కాలింగ్‌ చేసే సదుపాయం కూడా జియోటీవీలో ఉండనుంది.

 ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడి

ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడి

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం రిలయన్స్‌ ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. 

ఈ సర్వీసుల ప్రారంభ తేదీ

ఈ సర్వీసుల ప్రారంభ తేదీ

అయితే ఈ సర్వీసుల ప్రారంభ తేదీ, ప్లాన్ల వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Best Mobiles in India

English summary
Jio GigaFiber: Here is all about the 'biggest telecom game-changer More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X