Home
News

జియోహాట్‌స్టార్ vs అమెజాన్ ప్రైమ్ వీడియో vs నెట్‌ఫ్లిక్స్.. వీటిలో ఏ స్ట్రీమింగ్ సర్వీస్ బెస్ట్?

JioHotstar Streaming Services: రిలయన్స్ అండదండలతో దూసుకుపోతున్న జియోస్టార్.. స్ట్రీమింగ్ ప్రపంచంలోకి 'జియోహాట్‌స్టార్' అనే కొత్త యాప్‌ను వదిలింది. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ రెండూ కలిసిపోయి ఇప్పుడు ఒకే గొడుగు కిందకి వచ్చేసాయి. దీంతో ఇండియాలో స్ట్రీమింగ్ గేమ్ మొత్తం మారిపోనుంది. మరి ఇప్పటిదాకా ఈ రంగాన్ని ఏలిన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లకు ఈ కొత్త జియోహాట్‌స్టార్‌ పోటీ ఇవ్వగలదా? రేట్లు, కంటెంట్ విషయంలో ఏది బెస్ట్ వాల్యూనో చూద్దాం.

* జియోహాట్‌స్టార్

జియోహాట్‌స్టార్ మాత్రం డిఫరెంట్ రూట్‌లో వెళ్తోంది. ఇక్కడ చాలా కంటెంట్ ఫ్రీగా దొరుకుతుంది. జియో యూజర్లకు మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కానీ హాలీవుడ్ సినిమాలు మాత్రం ఫ్రీగా చూడలేం. ఫ్రీ కంటెంట్ ఉన్నా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ప్రీమియం ఫీచర్స్ కావాలంటే మాత్రం డబ్బులు కట్టాల్సిందే. డబ్బులు కడితే యాడ్స్ ఉండవు, వీడియో క్వాలిటీ అదిరిపోతుంది.

JioHotstar plans

ఇంకా చాలా డివైజ్‌లలో చూసే వెసులుబాటు కూడా ఉంటుంది. జియోహాట్‌స్టార్‌లో మీ అవసరానికి తగ్గట్టు మూడు రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి మొబైల్ ప్లాన్. ఇది తక్కువ ధరలో వచ్చే ప్లాన్. 3 నెలలకు రూ.149 లేదా ఏడాదికి రూ.499. యాడ్స్ వస్తాయి, ఒకే మొబైల్‌లో చూడొచ్చు.

రెండోది సూపర్ ప్లాన్. ఇది కాస్త ఎక్కువ డివైజ్‌లలో చూడాలనుకునేవాళ్ల కోసం. 3 నెలలకు రూ.299 లేదా ఏడాదికి రూ.899. ఇందులో కూడా యాడ్స్ ఉంటాయి, కానీ రెండు డివైజ్‌లలో చూడొచ్చు. మూడోది ప్రీమియం ప్లాన్. అసలుసిసలైన కిక్కు కావాలంటే ఈ ప్లాన్ బెస్ట్. నెలకి రూ.299, 3 నెలలకు రూ.499 లేదా ఏడాదికి రూ.1499.

ప్రీమియం ప్లాన్‌లో యాడ్స్ ఉండవు, 4K క్వాలిటీతో వీడియోలు చూడొచ్చు, నాలుగు డివైజ్‌ల వరకు వాడొచ్చు. ఇదివరకే డిస్నీ+ హాట్‌స్టార్ వాడుతున్నవాళ్లు కొత్తగా జియోహాట్‌స్టార్‌లోకి మారిపోతారు. పాత ప్లాన్స్ అన్నీ జియోహాట్‌స్టార్ పేరుతో కంటిన్యూ అవుతాయి. జియో సినిమా ప్రీమియం యూజర్లను డైరెక్ట్‌గా జియోహాట్‌స్టార్ ప్రీమియంకి అప్‌గ్రేడ్ చేసేశారు.

* అమెజాన్ ప్రైమ్ వీడియో

అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రం పూర్తిగా సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో వెళ్తుంది. కానీ ఇందులో వీడియోలు చూడటమే కాదు.. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్, అమెజాన్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్.. ఇలా చాలా ఫీచర్లు వస్తాయి.

అమెజాన్ ప్రైమ్‌లోనూ రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. వాటిలో మంత్లీ ఒకటి ఈ ప్లాన్ రూ.299 వసూల్‌ చేస్తుంది. ఇంకొకటి క్వార్టర్లీ ప్లాన్, ఇది 3 నెలలకు రూ.599 ఛార్జ్ చేస్తుంది. యాన్యువల్ ప్లాన్ ధర రూ.1,499. ఈ ప్లాన్‌లో ప్రైమ్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఫాస్ట్ డెలివరీ, ప్రైమ్ వీడియో, ఎక్స్‌క్లూజివ్ డీల్స్ అన్నీ పొందొచ్చు.

మరొకటి కూడా ఉంది. అది యాన్యువల్ ప్రైమ్ లైట్ ప్లాన్. ఇది తక్కువ ధరలో వచ్చే ప్లాన్. ఏడాదికి రూ.799. ఇందులో కొన్ని బెనిఫిట్స్ తక్కువగా ఉంటాయి, ప్రైమ్ వీడియో ఒక డివైజ్‌లో మాత్రమే చూడొచ్చు. కానీ తక్కువ బడ్జెట్‌లో కావాలనుకునేవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.

అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రాంతీయ కంటెంట్‌పై కూడా బాగా ఫోకస్ పెట్టింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలకు బాగా ఖర్చు పెడుతోంది. జియోహాట్‌స్టార్ లాగా ఫ్రీ కంటెంట్ ఇవ్వకపోయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు షాపింగ్ బెనిఫిట్స్ కూడా ఉండటం దీని ప్రత్యేకత.

* నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ ఈ మూడింటిలో కాస్త కాస్ట్లీ సర్వీస్. కానీ క్వాలిటీ విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఒరిజినల్ కంటెంట్, ఇంటర్నేషనల్ షోస్, చూసే ఎక్స్‌పీరియన్స్ అన్నీ బాగుంటాయి. కానీ ఇందులో ఫ్రీ కంటెంట్ ఉండదు, అమెజాన్ ప్రైమ్ లాగా ఇతర బెనిఫిట్స్ కూడా ఏమీ ఉండవు.

నెట్‌ఫ్లిక్స్‌లో కూడా డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. మంత్లీ మొబైల్ ప్లాన్ ధర రూ.149. 480p క్వాలిటీలో ఒక మొబైల్‌లో చూడొచ్చు. బేసిక్ ప్లాన్ నెలకి ధర రూ199. 720p క్వాలిటీతో ఒక డివైజ్‌లో చూడొచ్చు. స్టాండర్డ్ ప్లాన్ నెలకి రూ.499. 1080p క్వాలిటీతో రెండు డివైజ్‌లలో చూడొచ్చు.

ప్రీమియం ప్లాన్ నెలకి రూ.649. 4K + HDR క్వాలిటీతో నాలుగు డివైజ్‌లలో చూడొచ్చు. ఇది టాప్ ఎండ్ ప్లాన్ అన్నమాట. నెట్‌ఫ్లిక్స్ ఎవరికోసం అంటే.. క్వాలిటీ కంటెంట్, అదిరిపోయే వీడియో క్వాలిటీ కావాలనుకునేవాళ్ల కోసం. డబ్బులు కాస్త ఎక్కువైనా పర్లేదు అనుకునేవాళ్లకు ఇది బెస్ట్ ఛాయిస్.

జియోహాట్‌స్టార్ ఫ్రీ కంటెంట్ ఆప్షన్‌తో రావడం ఇండియా స్ట్రీమింగ్ మార్కెట్‌లో పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ప్లాట్‌ఫామ్ ఒక్కో రకం యూజర్లను టార్గెట్ చేస్తున్నాయి. జియోహాట్‌స్టార్ తక్కువ ధరలో ప్లాన్స్, ఫ్రీ కంటెంట్ ఆప్షన్ ఉండటంతో బడ్జెట్ ఫ్రెండ్లీ యూజర్లకు ఇది బెస్ట్ ఛాయిస్.

అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌తో పాటు షాపింగ్ బెనిఫిట్స్ కూడా ఉండటంతో ఇది ఒక కంప్లీట్ ప్యాకేజీలా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ క్వాలిటీ కంటెంట్, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకునేవాళ్ల కోసం. ఇండియాలో చాలామంది యూజర్లు ధర గురించి ఎక్కువ ఆలోచిస్తారు. జియోహాట్‌స్టార్ ఈ స్ట్రాటజీతో కోట్లాది మంది యూజర్లను అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

Best Mobiles in India

English summary
JioHotstar vs Prime Video vs Netflix: Which Streaming Service Offers the Best Value?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X