Home
News

JioMart డొమైన్‌లతో నకిలీ వెబ్‌సైట్‌లు!!! నమ్మారో జేబులు కాలినే ...

ఇండియా యొక్క అతి పెద్ద సంస్థలలో ఒకటైన రిలయన్స్ కంపెనీ ఇటీవల "జియోమార్ట్" పేరుతో ఆన్ లైన్ సేవలను ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఇండియాలో జియో సంస్థకు మంచి గుర్తింపు కూడా ఉంది. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ జియోమార్ట్ డొమైన్‌లను సృష్టిస్తు ఎక్కువ మంది ప్రజలను తమ సైట్‌కు ఆకర్షించి వారి నుండి డబ్బును మోసగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ నకిలీ వెబ్‌సైట్‌లు అమాయక వ్యక్తులకు జియోమార్ట్ సేవల ఫ్రాంచైజీ హోదాను కల్పించే నెపంతో మోసం చేస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోమార్ట్ నకిలీ డొమైన్‌లు

జియోమార్ట్ నకిలీ డొమైన్‌లు

అధికారిక జియోమార్ట్ డొమైన్‌లుగా చెప్పుకునే ఈ నకిలీ సైట్ల ఉనికిని తెలియజేస్తూ రిలయన్స్ సంస్థ ఇటీవల ఒక ప్రకటనను విడుదల చేసింది. "మేము ప్రస్తుతం ఎటువంటి డీలర్షిప్ లేదా ఫ్రాంఛైజీ మోడల్‌ను ఆపరేట్ చేయలేదని ప్రజలకు తెలియజేస్తున్నాము. అలాగే ఎటువంటి డీలర్ లేదా ఫ్రాంచైజీని ఏ విధంగానైనా నియమించటానికి మేము ఏ ఫ్రాంచైజీని లేదా ఏ ఏజెంట్‌ను నియమించలేదని కంపెనీ స్పష్టంగా తెలిపింది. అంతేకాకుండా ఫ్రాంఛైజీగా నియమించే నెపంతో మేము ఎవరి వద్ద నుండి కూడా ఎటువంటి మొత్తాన్ని వసూలు చేయము అని కంపెనీ తెలిపింది. "

జియోమార్ట్ నకిలీ వెబ్‌సైట్‌ల జాబితా

జియోమార్ట్ నకిలీ వెబ్‌సైట్‌ల జాబితా

సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టిస్తున్నారు. ఇందులో జియోమార్ట్ యొక్క సర్వీసులను అందిస్తున్నట్లు తెలుపుతూ డబ్బును చెల్లించాలని ప్రజలను మోసం చేస్తున్నారనే విషయాన్ని జియో సంస్థ కూడా అంగీకరించింది. ఇది అధికారిక జియోమార్ట్ సర్వీస్ అని చెప్పుకునే ఈ నకిలీ డొమైన్ పేర్లలో కొన్నింటి జాబితాను జియో సంస్థ విడుదల చేసింది.

* jmartfranchise.in

* jiodealership.com

* jiomartfranchises.com

* jiomartshop.info

* jiomartreliance.com

* jiomartfranchiseonline.com

* jiomartsfranchises.online

* jiomart-franchise.com

* jiomartindia.in.net

* jiomartfranchise.co

జియోమార్ట్ నకిలీ వెబ్‌సైట్‌ల కార్యకలాపాలు

జియోమార్ట్ నకిలీ వెబ్‌సైట్‌ల కార్యకలాపాలు

జియోమార్ట్ నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించిన వ్యక్తి లేదా గ్రూపులకు వ్యతిరేకంగా క్రిమినల్ లేదా సివిల్ ప్రొసీడింగ్స్ చేయడానికి కంపెనీ వెనుకాడదని రిలయన్స్ రిటైల్ హెచ్చరించింది. నకిలీ డొమైన్‌లు ట్రేడ్‌మార్క్‌ల దుర్వినియోగానికి స్పష్టమైన కేసు మరియు రిలయన్స్ సామర్దాలను మరియు ప్రతిష్టను కాపాడటానికి చర్యలు తీసుకుంటుంది. ఈ నకిలీ సైట్‌ల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి జియో సంస్థ సోషల్ మీడియాను ఉపయోగించుకుంది. అలాంటి డొమైన్‌లను మరియు వాటి కార్యకలాపాలను ఉపయోగించవద్దని వారిని ప్రోత్సహిస్తుంది.

ఇండియాలో ఎక్కువ నగరాలలో రిలయన్స్ జియోమార్ట్ సేవలు

ఇండియాలో ఎక్కువ నగరాలలో రిలయన్స్ జియోమార్ట్ సేవలు

రిలయన్స్ జియోమార్ట్ 2020 మే నాటికి దేశంలోని 200 కి పైగా నగరాల నుండి ఆర్డర్‌లను స్వీకరిస్తోంది. వీటిలో ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు మరియు పూణే వంటి నగరాలు ఉన్నాయి. ఈ నగరాలలో మీరు ఉంటే కనుక ఇప్పటికే వీటిని ఉపయోగించుకోవచ్చు. పున రూపకల్పన చేసిన వెబ్‌సైట్ లైవ్ మరియు ప్రముఖ వెబ్ బ్రౌజర్‌ల ద్వారా ఇది అందుబాటులో ఉంది. వినియోగదారులు Jiomart.com వెబ్‌సైట్‌కు వెళ్లడం ద్వారా ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించవచ్చు. జియోమార్ట్ ప్రస్తుతం ప్రీపెయిడ్ పేమెంట్ లతో ఆర్డర్‌లను అంగీకరిస్తోంది. వినియోగదారులు నెట్-బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు మరియు డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్స్  చేయవచ్చు. రిలయన్స్ కొన్ని ఉత్పత్తులను గరిష్ట రిటైల్ ధర (MRP) కన్నా 5 శాతం తక్కువకు విక్రయిస్తున్నట్లు పేర్కొంది.

Best Mobiles in India

English summary
JioMart Franchise Scams: Reliance JioMart Fake Websites Offers JioMart Services Be careful
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X