Home
News

JioPhone 5G లాంచ్ వివరాలు , ధర మరియు స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. చూడండి.

By Maheswara

గత ఏడాది జూలైలో జరిగిన రిలయన్స్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో, రిలయన్స్ భారతదేశంలో జియో ఫోన్ 5G ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఈ ఏడాది వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ఈ ఫోన్‌ను విడుదల చేయాలని భావించారు. కానీ అనుకున్న ప్రకారం అది జరగలేదు. కాగా , ఇప్పుడు Jio అక్టోబర్‌లో 5G సేవను ప్రారంభించాలని భావిస్తున్నందున, రాబోయే కొన్ని వారాల్లో Jio ఫోన్ 5Gని ఆవిష్కరించవచ్చు అని అంచనాలున్నాయి.

Jio ఫోన్ 5G

Jio ఫోన్ 5G

అవును, రిలయన్స్  Jio ఫోన్ 5Gని పరిచయం చేయబోతోంది, అయితే దీని లాంచ్ టైమ్‌లైన్ ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. కానీ , ఈ కొత్త జియో ఫోన్ 5G (జియో ఫోన్ 5G) ఫోన్ ఫీచర్లు ఇప్పుడు లీక్ అయ్యాయి. 91మొబైల్స్ తన నివేదిక ప్రకారం రాబోయే జియో 5G ఫోన్ ఫీచర్లను వెల్లడించింది. అలాగే, జియో తన రాబోయే 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.12,000 కు విడుదల కానున్నట్లు అంచనాలున్నాయి. ఇంకా, తక్కువ కు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

నివేదిక ప్రకారం

నివేదిక ప్రకారం

నివేదిక ప్రకారం, Jio ఫోన్ 5Gకి 'గంగా' అనే సంకేతనామం ఉంటుంది మరియు మోడల్ నంబర్ 'LS1654QB5'తో ప్రారంభించబడుతుంది. జియో ఫోన్ 5G స్మార్ట్‌ఫోన్ 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ 6.5 అంగుళాల HD+ LCD స్క్రీన్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఎంట్రీ లెవల్ 5G SoC. దీనితో పాటు, ఈ ఫోన్ 4GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ తో వస్తుంది.

ఇది కాకుండా

ఇది కాకుండా

ఇది కాకుండా, దీని వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ప్రధాన ప్రైమరీ కెమెరాలో 13-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. సెకండరీ కెమెరాలో 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. అదనంగా, ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో కూడా వస్తుంది . ఇంకా, ఈ ఫోన్ 4GB RAM స్టోరేజ్ వేరియంట్ కలిగి ఉంటుంది. మరియు ప్రాసెసర్‌ Android 12 OSలో కూడా రన్ అవుతుంది. కనెక్టివిటీ కోసం Wi-Fi 802.11 a/b/g/n, బ్లూటూత్ 5.1 ఎంపికలు కూడా ఉంటాయి.

జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ ఫీచర్లు:

జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ ఫీచర్లు:

రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని అభివృద్ధి చెందిన తరువాత తన యొక్క వినియోగదారులను 4G సేవలను ఉపయోగించడానికి ప్రోత్సహించడానికి జియోఫోన్ ను కూడా తక్కువ ధరలోనే విడుదల చేసింది. అయితే దాని తరువాత దాని కొనసాగింపుగా జియోఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేసింది.

JioPhone NEXT ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్ ద్వారా రక్షించబడిన 5.45-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది 2GB RAM మరియు 32GB అంతర్నిర్మిత మెమరీతో వస్తుంది మరియు Qualcomm Snapdragon QM215 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ మెమరీని 512 GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 'ప్రగతి OS' పై రన్ అవుతుంది. జియో మరియు గూగుల్ యాప్‌లు కూడా ఇందులో ప్రీలోడ్ చేయబడ్డాయి.
అలాగే జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్‌ని అందిస్తోంది. అదనంగా, వెనుకవైపు 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా మరియు 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. ఫోన్ 3500 mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్, Wi-Fi, హాట్‌స్పాట్ మరియు OTG సపోర్ట్ ఉన్నాయి.

 

More from GizBot

Best Mobiles in India

English summary
JioPhone 5G Launch Date And Specifications Leaked. Price And Other Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X