జియోఫోన్ లాంచ్ అయ్యింది, అందరికి ఉచితం, పూర్తి వివరాలు

ఆగష్టు 24 నుంచి ప్రీబుకింగ్స్..

|

ముంబై వేదికగా జరుగుతోన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ యూన్యువల్ జనరల్ మీటింగ్‌లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ విప్లవాత్మక ఫీచర్లతో కూడిన కారుచౌక జియో ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసారు. ఈ జియో ఫోన్‌ను "India ka intelligent smartphone" అంటూ రిలయన్స్ అభివర్ణించింది.

రూ.153 బేస్ ప్యాక్..

రూ.153 బేస్ ప్యాక్..

ఈ ఫోన్‌ను ప్రతి ఒక్కరు ఉచితంగా సొంతం చేసుకోవచ్చని అంబానీ తెలిపారు. అయితే, ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ క్రింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడు సంవత్సరాల తరువాత రీఫండ్ చేస్తారు. జియోఫోన్‌కు సంబంధించి ప్రీ-బుకింగ్స్ ఆగష్టు 24 నుంచి ప్రారంభమవుతాయి. సెప్టంబర్ నుంచి ఫోన్ల‌ను డెలివరీ చేస్తారు. బేటా టెస్టింగ్ మాత్రం ఆగష్టు 15 నుంచి ప్రారంభమవుతుంది.

రూ.153కే అన్‌లిమిటెడ్ కాల్స్ , అన్‌లిమిటెడ్ 4జీ ఇంటర్నెట్‌

రూ.153కే అన్‌లిమిటెడ్ కాల్స్ , అన్‌లిమిటెడ్ 4జీ ఇంటర్నెట్‌

ఈ ఫోన్ కోసం రూ.153 స్టార్టర్ ప్యాక్‌ను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. జియోఫోన్ యూజర్లు ఈ ప్యాక్‌ను తీసుకోవటం ద్వారా ద్వారా నెలంతా అన్‌లిమిటెడ్ 4జీ వోల్ట్ కాల్స్, అన్‌లిమిటెడ్ 4జీ ఇంటర్నెట్‌తో పాటు అన్ని రకాల జియో సర్వీసులను ఆస్వాదించే వీలుంటుంది.

రూ.24, రూ.54 జియో సాచెట్ ప్యాక్స్..
 

రూ.24, రూ.54 జియో సాచెట్ ప్యాక్స్..

రూ.153 బేస్ ప్యాక్‌తో పాటు రూ.24, రూ.54 జియో సాచెట్ ప్యాక్‌లను కూడా అంబానీ లాంచ్ చేసారు. రూ.24 ప్యాక్ రెండు రోజుల వ్యాలిడిటీతో, రూ.54 ప్యాక్ 7 రోజుల వ్యాలిడిటీతో లభిస్తాయి. 

జియో ఫోన్ టీవీ కేబుల్

జియో ఫోన్ టీవీ కేబుల్

జియో ఫోన్ టీవీ కేబుల్ జియోఫోన్‌ను ఎలాంటి టీవీకైనా కనెక్ట్ చేస్తుంది.309 ప్లాన్‌ను తీసుకోవటం ద్వారా ఫోన్‌ను టీవీకి మిర్రర్ చేసుకుని నెల మొత్తం జియో సర్వీసులను పెద్దతెర పై ఆస్వాదించవచ్చు.

వాయిస్ కమాండ్స్, NFC సపోర్ట్‌

వాయిస్ కమాండ్స్, NFC సపోర్ట్‌

జియో‌ఫోన్‌లో జియో సూట్ యాప్స్‌తో పాటు జియోఫోన్ బ్రౌజర్, ఫేస్‌బుక్, నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌బ్రాడ్ కాస్ట్ యాప్‌లను పొందుపరిచారు. వాయిస్ కమాండ్‌లను జియో ఫోన్ సపోర్ట్ చేస్తుంది. తెలుగుతో సహా 22 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ ద్వారా UPI అలానే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు చెల్లింపులను సపోర్ట్ చేస్తుంది.

ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్

ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్

జియో ఫోన్ ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్‌తో వస్తోంది. ఫోన్ కీప్యాడ్‌లోని 5 బటన్ పై లాంగ్‌ప్రెస్ ఇవ్వటం ద్వారా ఎమర్జెన్సీ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ముందుగానే సెట్ చేసుకుని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఈ ఎమర్జెన్సీ మెసేజ్ లోకేషన్ తో సహా షేర్ చేయబడుతుంది.

డిజిల్ పేమెంట్స్..

డిజిల్ పేమెంట్స్..

జియో‌ఫోన్‌ డిజిటల్ చెల్లింపులను సపోర్ట్ చేస్తుంది. అన్నిరకాల నగదు లావాదేవీలను ఈ ఫోన్ ద్వారా నిర్వహించుకునే వీలుంటుంది. 

జియోఫోన్ స్పెసిఫికేషన్స్..

జియోఫోన్ స్పెసిఫికేషన్స్..

2.4 అంగుళాల డిస్‌ప్లే, 512MB ర్యామ్, KaiOS ప్లాట్‌ఫామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లుటూత్ వీ4.1 సపోర్ట్.

Best Mobiles in India

English summary
JioPhone Launched By Mukesh Ambani at Reliance AGM: Live Updates. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X