Home
News

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ని రూ.500లకే పొందవచ్చు!! కానీ...

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) యొక్క యానువల్ జనరల్ మీటింగ్ (AGM) లో జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రకటించినప్పటి నుంచి ఇంటర్నెట్‌లో ఈ ఫోన్ ధరలు మరియు ఫీచర్స్ గురించి అనేక రూమర్స్ ఉన్నాయి. ఎట్టకేలకు జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లోకి సెప్టెంబర్ 10, 2021 నుండి అందుబాటులోకి రానుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇప్పుడు ఆన్‌లైన్‌లో మరొక పుకారు హల్ చల్ చేస్తోంది. జియోఫోన్ నెక్స్ట్ ప్రారంభించినప్పుడు కొనుగోలు చేసిన వినియోగదారులకు దాని ఖర్చులో 10%తో మాత్రమే తమ చేతులలో పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ - రిలయన్స్ భాగస్వామ్యం

గూగుల్ - రిలయన్స్ భాగస్వామ్యం

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ భాగస్వామ్యంతో రిలయన్స్ కంపెనీ ప్రారంభిస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్ట్. రిలయన్స్ జియో తన తదుపరి జెనెరేషన్ జియోఫోన్ నెక్స్ట్‌ను సెప్టెంబర్ 10 నుంచి భారతదేశంలో విక్రయించనుంది. ఈ ఫోన్ యొక్క ముందస్తు బుకింగ్‌లు ఈ వారం ప్రారంభమవుతాయని అందరూ భావిస్తున్నారు. అయితే ప్రీ-బుకింగ్‌లకు ముందు కొన్ని నివేదికల ప్రకారం రాబోయే 6 నెలల్లో కంపెనీ 50 మిలియన్ యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

జియోఫోన్ నెక్స్ట్

రిలయన్స్ కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 50 మిలియన్ యూనిట్లను విక్రయించడానికి కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిరమల్ క్యాపిటల్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ అషూర్ మరియు DMI ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. నివేదికల ప్రకారం ఈ సంస్థలన్నీ కలిపి రూ.10,000 కోట్ల వ్యాపారాన్ని చేయనున్నట్లు అంచనా. జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ బేసిక్ మరియు అడ్వాన్స్ వంటి రెండు మోడళ్లలో అందించబడుతున్నట్లు అంచనా. ఇందులో బేసిక్ మోడల్ ధర సుమారు రూ.5,000 కాగా అడ్వాన్స్ మోడల్ ధర సుమారు రూ.7,000.

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ని రూ.500 ధరకే పొందడం ఎలా?

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ని రూ.500 ధరకే పొందడం ఎలా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిరమల్ క్యాపిటల్, IDFC ఫస్ట్ అషూర్ మరియు DMI ఫైనాన్స్ కంపెనీలు జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ని కొనుగోలు చేసే కస్టమర్లపై భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు పూర్తి మొత్తాన్ని చెల్లించనవసరం లేదు. వారు కేవలం 10 శాతం ధరను చెల్లించవచ్చు. మిగిలిన మొత్తాన్ని సులభంగా EMI లలో చెల్లించవచ్చని నివేదిక పేర్కొంది.

NBFC

రిలయన్స్ జియో ఎంచుకున్న మార్గం ఇదే అయితే మీరు అడ్వాన్స్ మోడల్‌ని కేవలం రూ.700 చెల్లించి మరియు బేసిక్ మోడల్‌ని రూ.500 చెల్లించి పొందడంలో అర్థం ఉంది. మిగిలిన వాటిని ఈ-ఈఎంఐ ఆప్షన్‌లలో చెల్లించవచ్చు. బ్యాంకులు కాకుండా రిలయన్స్ జియో నాలుగు బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీలతో (NBFC లు) దాదాపు 2500 కోట్ల రూపాయల క్రెడిట్ సపోర్ట్ డీల్స్‌పై సంతకం చేసిందని నివేదిక పేర్కొంది.

జియోఫోన్ నెక్స్ట్ సాఫ్ట్‌వేర్

జియోఫోన్ నెక్స్ట్ సాఫ్ట్‌వేర్

రూ.5,000 ధర వద్ద లభించే జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ గేమ్-ఛేంజర్ కావచ్చు. ఇది ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఇండస్ట్రీని షేక్చేసే అవకాశం ఎంతగానో ఉంది. అలాగే ఇతర కంపెనీలు మెరుగైన స్పెసిఫికేషన్స్ మరియు సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌తో అదే రేంజ్‌లోని డివైజ్‌లతో బయటకు వచ్చేలా చేస్తుంది. ఒకవేళ జియో దీన్ని అందించడంలో విఫలమైతే కనుక కంపెనీ వాగ్దానాలపై ఇది బాగా కనిపించదు. అంతేకాకుండా తదుపరి దాని చందాదారుల బేస్‌పై కూడా నిజంగా ప్రభావం చూపదు. చాలా మంది వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను హాట్‌స్పాట్‌లు లేదా వాయిస్ కాల్‌ల కోసం ద్వితీయ పరికరంగా కూడా ఉపయోగించవచ్చు.

JioPhone Next

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే ధృవీకరించబడిన విషయం ఏమిటంటే ఇది ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌లో రన్ అవుతుంది. ఆన్‌లైన్ నివేదికల ప్రకారం JioPhone Next స్మార్ట్‌ఫోన్ యొక్క ధర రూ.5000. అయితే ఇక్కడ పేర్కొన్న ధర కేవలం లీక్ మాత్రమే అని గమనించండి మరియు కంపెనీ దానిని ధృవీకరించలేదు. కాబట్టి స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన తర్వాతే దాని అసలు ధర తెలుస్తుంది. జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తే వినియోగదారులు బడ్జెట్ విభాగంలోనే 4G స్మార్ట్‌ఫోన్‌ను పొందే అవకాశం ఉంది. ఎంట్రీ లెవల్ 4G స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి కూడా అధిక మొత్తంలో డబ్బును ఖర్చుచేయవలసిన అవసరం లేదు. ఆశాజనక జియోఫోన్ నెక్ట్స్ వినియోగదారులు ఆశించేది మరియు ఇది 4G నెట్‌వర్క్‌లకు అప్‌గ్రేడ్ చేయడానికి ప్రజలను నెట్టివేస్తుంది. తద్వారా భారతదేశం 2G మరియు 3G నెట్‌వర్క్‌లను వీలైనంత వేగంగా వదిలించుకోవచ్చు మరియు 4G మరియు 5G మాత్రమే ఉన్న దేశంగా కొనసాగుతుంది.

Best Mobiles in India

English summary
JioPhone Next 4G Smartphone Could be Available Just Rs.500 Only: Price, Specs, Software Details, Pre-Booking and More Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X