జియోఫోన్ నెక్స్ట్ ను రూ.1999లకే కొనుగోలు చేయవచ్చు!! EMI స్కీమ్ ప్లాన్‌లపై ఓ లుక్ వేయండి...

|

ప్రముఖ టెలికాం సంస్థ జియో సరసమైన ధరలో 4G ఫోన్ ను జియోఫోన్ నెక్స్ట్ పేరుతో నవంబర్ 2021లో లాంచ్ చేసింది. రిలయన్స్ జియో ద్వారా ప్రారంభించబడిన ఈ సరసమైన 4G స్మార్ట్‌ఫోన్ ముందు రూ.5,000 లోపు ఉంటుందని అంచనా వేయబడింది. అయితే వినియోగదారులను నిరాశపరుస్తూ ఇండియా యొక్క మార్కెట్‌లో రూ.6,499 ధర వద్ద లాంచ్ చేశారు. దీనిని వినియోగదారులు పూర్తి మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేయవచ్చు లేదా కంపెనీ అందించే ప్రత్యేక EMI స్కీమ్ లో కూడా కొనుగోలు చేయవచ్చు. జియో సంస్థ అందించే EMI స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

భారతదేశంలో జియోఫోన్ నెక్స్ట్ ను రూ.1,999కి కొనుగోలు చేయడం ఎలా?

భారతదేశంలో జియోఫోన్ నెక్స్ట్ ను రూ.1,999కి కొనుగోలు చేయడం ఎలా?

జియో కంపెనీ తన యొక్క వినియోగదారుల కోసం EMI స్కీమ్‌ను అందిస్తోంది. ఈ EMI స్కీమ్‌ ద్వారా జియోఫోన్ నెక్స్ట్ ని కేవలం రూ.1,999 మొత్తం చెల్లించి కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో రూ.501 ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఇది ముందస్తు చెల్లింపు మొత్తంలో రూ.2,500 ధరగా చేస్తుంది. దీని తరువాత వినియోగదారులు జియో యొక్క EMI ప్లాన్‌లను కొనసాగించడానికి బహుళ ఎంపికలను కలిగి ఉంటారు. కంపెనీ ఎ) ఆల్వేస్ ఆన్ ప్లాన్, బి) లార్జ్ ప్లాన్, సి) ఎక్స్‌ఎల్ ప్లాన్ మరియు డి) ఎక్స్‌ఎక్స్ఎల్ ప్లాన్ వంటి నాలుగు రకాల ప్లాన్‌లను అందిస్తోంది.

మెరుగైన హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం అందుబాటులో ఉన్న అత్యుత్తమ 500 Mbps ప్లాన్‌లుమెరుగైన హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం అందుబాటులో ఉన్న అత్యుత్తమ 500 Mbps ప్లాన్‌లు

ఆల్వేస్ ఆన్ ప్లాన్‌
 

** జియో అందించే నాలుగు ప్లాన్‌లలో మొదటిది ఆల్వేస్ ఆన్ ప్లాన్‌తో వినియోగదారులు ప్రతి నెల 5GB + 100 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను 18 నెలలు (రూ.350/నెలకు) లేదా 24 నెలలు (రూ.300/నెలకు) పొందుతారు.

** రెండవది లార్జ్ ప్లాన్ కూడా వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటా మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. అదనంగా ఇది 18 నెలలు మరియు 24 నెలల పాటు వరుసగా రూ.500/నెలకు మరియు రూ. 450/నెలకు అందుబాటులో ఉంటుంది.

గేమింగ్ ప్రియులకు శుభవార్త!! Vi గేమ్‌లను ప్రారంభించిన ప్రైవేట్ టెల్కో...  గేమింగ్ ప్రియులకు శుభవార్త!! Vi గేమ్‌లను ప్రారంభించిన ప్రైవేట్ టెల్కో...  

XL మరియు XXL ప్లాన్‌

** రోజువారీ అధిక డేటాను కావాలనుకునే వారు టెల్కో అందించే XL మరియు XXL ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు. XL ప్లాన్‌తో వినియోగదారులు నెలకు రూ.500 (24 నెలలు) లేదా నెలకు రూ. 550 (18 నెలలు)తో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో 2GB రోజువారీ డేటాను పొందుతారు.

** చివరగా XXL ప్లాన్‌తో వినియోగదారులు నెలకు రూ.550 (24 నెలలు) లేదా నెలకు రూ. 600 (18 నెలలు)తో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటుగా 2.5GB రోజువారీ డేటాను అందిస్తారు. JioPhone Nextతో కంపెనీ అందించే అన్ని ప్లాన్‌లు ఇవి. ఈ ప్లాన్‌లలో దేనితోనైనా డివైస్ యొక్క మొత్తం ధర నిజంగా ఖరీదైనదిగా మారుతుంది. JioPhone నెక్స్ట్ విజయవంతమైందా లేదా అనేది ప్రస్తుతానికి తెలియదు.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Jiophone Next is Now Available Just Rs.1999 Only With Easy EMI Options

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X