జియోఫోన్ సింగిల్ సిమ్ ఫీచర్ ఫోన్!

Posted By: Madhavi Lagishetty

గతవారం ప్రకటించిన జియో ఫోన్ పై అనేక సందేహాలు వెల్లవెత్తుతున్నాయి. ఎన్నో అంశాలతో పాటు...90రోజుల ప్రివ్యూతో సంచలనం రేపిన జియో ఫోన్ డిజైన్ పై స్పష్టత లేదు.

జియోఫోన్ సింగిల్ సిమ్ ఫీచర్ ఫోన్!

రిలయన్స్ జియో ప్రకటించిన 4జి వోల్టేజ్ సామర్ధ్యం ఉన్న ఫోన్. జియోఫోన్ ను రెండు వేరియంట్లలో రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకటి సింగిల్ సిమ్ వేరియంట్ అయితే... మరొక్కటి డ్యూయల్ సిమ్. అయితే 4జి వోల్ట్ ను ఫస్ట్ కార్డ్ స్లాట్ లో, రెండవ స్లాట్ లో ఏ ఇతర నెట్ వర్క్ కు చెందిన సిమ్ అయినా సరే 2జి స్లాట్ గా ఉంటుంది.

గాడ్జెట్ 360 రిపోర్ట్ ప్రకారం జియోఫోన్ సింగిల్ సిమ్ ఫీచర్ ఫోన్ గా మాత్రమే విడుదల చేయనున్నట్లు జియో ప్రతినిధి తెలిపినట్లు పేర్కొంది. 4జి వోల్ట్ నెట్ వర్క్ తో మాత్రమే పనిచేస్తుందని తెలిపింది. హ్యాండ్ సెట్ లో జియో సిమ్ కార్డును మాత్రమే ఉపయోగించాలి. 4జి అనేది ఒక డివైస్ మాత్రమే. ప్రస్తుతం జియో మాత్రమే 4జి వోల్ట్ సేవలను భారత్ లో అందిస్తోంది. అయితే కొద్ది రోజుల్లోనే ఎయిర్ టెల్ కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది.

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్

ఆగస్టు 15న జియోఫోన్ బీటా ట్రయల్ ప్రారంభం అవుతుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఆగస్టు 24న బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. హ్యాండ్ సెట్ కోసం ముందే బుక్ చేసుకున్నవారు ఫస్ట్ వచ్చిన సర్వ్ ఆధారంగా పొందుతారు. సెప్టెంబర్ లో జియోఫోన్ లు మార్కెట్లో విస్త్రుతంగా లభ్యం అవుతాయి. బీటా ట్రయల్స్ లో క్లారిటీ వచ్చాకే హార్డ్ వేర్ గురించి ఆలోచిస్తామని జియో ప్రతినిధి తెలిపారు.

జియో ఫోన్ హైలెట్స్ ను అమలు చేయడానికి వాయిస్ కమాండ్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే హ్యాండ్ సెట్ 22 భారతీయ ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు మైక్రో ఎస్డీ కార్ట్ స్లాట్ కూడా ఉంది. జియో ఫోన్ టీవీ కెబుల్ కి హ్యాండ్ సెట్ సపోర్ట్ ఇస్తుంది. దీంతో వినియోగదారులు టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. NFCడిజిటల్ పేమెంట్ కూడా ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ లో వాట్సప్ సపోర్ట్ చేయదు. ఫేస్ బుక్ తోపాటు ఇతర అకౌంట్స్ ను బ్రౌసింగ్ చేసుకోవచ్చు.

English summary
JioPhone will be launched as a single SIM feature phone only. It is said to work with 4G VoLTE networks only.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot