బేసిక్ రీఛార్జ్ రూ.49 ప్లాన్‌ను తొలగించించిన జియో

|

రిలయన్స్ జియో సంస్థ తమ టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేసిన తరువాత కొత్త ప్లాన్లు డిసెంబర్ 6 నుండి అమలుచేసింది. కానీ కంపెనీ జియోఫోన్ ప్లాన్ల ధరలను పెంచడానికి బదులుగా దాని వాలిడిటీ మరియు ప్రయోజనాలను మార్పులు చేసింది. ఇప్పుడు జియో యొక్క అత్యంత సరసమైన రూ.49 రీఛార్జ్ ప్లాన్‌ను తొలగించింది. కొత్త రీఛార్జీలు ఇప్పుడు రూ.75 నుండి ప్రారంభమవుతాయి.

జియో
 

కొన్ని వారాల క్రితం జియో తమ వినియోగదారుల కోసం ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రీఛార్జి కోసం రూ.75, రూ .99, రూ .153, రూ .297, రూ .594 వంటి ప్లాన్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే జియోఫోన్ యూజర్లు జియోయేతర నిమిషాలు పొందడానికి అదనపు ఐయుసి టాప్-అప్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. జియోఫోన్ రూ.49 ప్లాన్ తొలగింపుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో యొక్క రూ.49 ప్లాన్ రీఛార్జ్

జియో యొక్క రూ.49 ప్లాన్ రీఛార్జ్

రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులను ఆకర్షించింది. ఇది సరసమైన ధరతో పాటు 1,500 రూపాయల వరకు రీఛార్జ్ ను అందిస్తుంద. కానీ చాలా మంది జియో వినియోగదారులను ఆకట్టుకున్నది రూ.49 ప్లాన్. ఈ ప్లాన్‌ జియో వినియోగదారులకు ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 1 జిబి డేటాను 28 రోజులు అందించింది. ఐయుసి టాప్-అప్ వోచర్‌లను ప్రవేశపెట్టిన తరువాత రూ.49 ప్లాన్‌ను ఆనందిస్తున్న జియో వినియోగదారులు జియోయేతర నిమిషాలకు అదనపు ఛార్జీలను చెల్లించాల్సి వచ్చింది.

అన్‌లిమిటెడ్ కాల్‌లను మళ్ళి మొదలు పెట్టిన ఎయిర్‌టెల్

పోర్టుఫోలియో

ఇప్పుడు జియో తన పోర్టుఫోలియో నుండి ఈ ప్లాన్‌ ను పూర్తిగా తొలగించబడింది. గత వారం రిలయన్స్ జియో ధరలను పెంచడం ద్వారా తన టారిఫ్ ప్లాన్‌లను అప్‌డేట్ చేసింది. ఇందులో భాగంగా రూ.49 జియో ప్లాన్‌ను తొలగించింది. కంపెనీ జియో ప్లాన్‌ల ధరలను పెంచకపోగా బేస్ రీఛార్జ్ ప్యాక్ ఇప్పుడు రూ.75 నుండి ప్రారంభించింది.

అన్‌లిమిటెడ్ కాలింగ్ మీద పరిమితిని తొలగించిన వోడాఫోన్

రిలయన్స్ జియో
 

గత నెలలో రిలయన్స్ జియో జియోఫోన్ ఆల్ ఇన్ వన్ రీఛార్జ్‌లతో ముందుకు వచ్చింది. ఇది జియోయేతర నిమిషాలను కూడా అందిస్తుంది. జియో వినియోగదారుల కోసం ఆల్ ఇన్ వన్ ప్లాన్ లు రూ.75, రూ.125, రూ .155 మరియు రూ.185గా ఉన్నాయి. ఇవి అపరిమిత జియో-టు-జియో వాయిస్ కాలింగ్ కలిగిన రూ .75 ప్యాక్ 500 నిమిషాల నాన్-జియో కాల్స్, రోజుకు 100 ఎంబి డేటా మరియు రీఛార్జ్ చేసిన తేదీ నుండి 28 రోజుల వరకు మొత్తంగా 50 SMSల ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు రూ.49 రీఛార్జ్ ప్రేమికులు రూ .75 ఆల్ ఇన్ వన్ రీఛార్జిని ఉపయోగించుకోవచ్చు. ఇది జియోయేతర నిమిషాలను కూడా అందిస్తుంది.

BSNL నుంచి మూడు STV ప్లాన్‌లు అవుట్

జియో పాత రీఛార్జీలు

జియో పాత రీఛార్జీలు

రిలయన్స్ జియో కేవలం 49 రూపాయల ప్లాన్‌ను మాత్రమే తొలగించింది. ఇంతకుముందు జియోఫోన్ ప్లాన్‌లు రూ .99, రూ .153, రూ .297, రూ .594 రీఛార్జికి ఇంకా అందుబాటులో ఉన్నాయి. అయితే మళ్ళీ యూజర్లు జియోయేతర వాయిస్ కాలింగ్ నిమిషాలు పొందడానికి అదనపు ఐయుసి టాప్-అప్ రీఛార్జ్ లను ఉపయోగించాలి.

 రూ.99 ప్లాన్

జియో యొక్క రూ.99 ప్లాన్ రోజుకు 0.5 జిబి డేటా (28 రోజులకు మొత్తం 14 జిబి), 300 ఎస్‌ఎంఎస్‌లు మరియు 28 రోజుల పాటు అపరిమిత జియో-టు-జియో వాయిస్ కాలింగ్‌తో వస్తుంది. రూ.153 ప్యాక్ రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత జియో-టు-జియో వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100SMSలను అదే 28 రోజుల చెల్లుబాటు కోసం అందిస్తుంది. రూ. 594, రూ .297 ల లాంగ్-వాలిడిటీ జియోఫోన్ ప్లాన్లు 84 జీబీ డేటా, అపరిమిత జియో-టు-జియో కాలింగ్ ప్రయోజనాలతో 168 రోజుల వాలిడిటీతో లభిస్తాయి.

ఆల్ ఇన్ వన్ రీఛార్జీ ప్లాన్లు

ఇప్పుడు నాలుగు జియోఫోన్ ఆల్ ఇన్ వన్ రీఛార్జీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి వాటి ధరలు వరుసగా రూ .75, రూ .125, రూ .155 మరియు రూ.185. రూ. 125 ప్యాక్ రోజుకు 500 ఎంబి డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 500 నాన్-జియో నిమిషాలు మరియు 300 ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను 28 రోజుల వాలిడిటీతో అందిస్తాయి. రూ .155 రీఛార్జ్ ప్యాక్ రోజుకు 1 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత జియో-టు-జియో వాయిస్ కాలింగ్, 500 నిమిషాల నాన్-జియో కాల్స్‌ ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. చివరగా రూ.185 జియోఫోన్ ఆల్ ఇన్ వన్ రీఛార్జ్ రోజుకు 2 జిబి డేటాతో వస్తుంది మరియు మిగిలిన ప్రయోజనాలు రూ .155 ప్లాన్‌తో సమానంగా ఉంటాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
JioPhone Plan Of Rs. 49 Gets Removed By Jio; Find More Changes In Other Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X