తిరిగి ప్రారంభమైన jiophone బుకింగ్స్, ఒక్కొక్కరికి ఐదు

|

చాలా రోజుల గ్యాప్ తరువాత జియో‌ఫోన్ బుకింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సెకండ్ రౌండ్ బుకింగ్స్‌కు సంబంధించి జియో తన అఫీషియల్ వెబ్‌సైట్ అయిన జియో.కామ్‌లో "Come on India join the movement" పేరుతో సరికొత్త బ్యానర్‌ను పోస్ట్ చేసింది. ఈ బ్యానర్ అడుగున 'Order now’ బటన్‌ను కూడా జియో అందుబాటులో ఉంచింది.

 

జియో టార్గెట్ 50 కోట్లు..

జియో టార్గెట్ 50 కోట్లు..

ఈ సెకండ్ రౌండ్ ప్రీ-బుకింగ్‌లో భాగంగా ఒక్కో మొబైల్ నెంబర్ పై ఐదేసి ఫోన్‌లను ఆర్డర్ చేసుకునే వీలుంటుంది. 50 కోట్ల మంది యూజర్లకు కనెక్ట్ అవ్వాలనే లక్ష్యంతో డిజైన్ చేయబడిన జియోఫోన్ అదే లక్ష్యంతో ముందుకు సాగుతోన్నట్లు తెలుస్తోంది.

రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌తో..

రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌తో..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ వెల్లడించిన వివరాల ప్రకారం జియోఫోన్‌ ప్రతి ఒక్కరికి ఉచితంగా లభిస్తుంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్ క్రింద ముందుగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడు సంవత్సరాల తరువాత తిరిగి రీఫండ్ చేసేస్తారు.

జియో ఫోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలంటే..?
 

జియో ఫోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలంటే..?

జియో ఫోన్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకునే వారు MyJio appలోకి జియోఫోన్ పేజీలోని Order now బటన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత ఓపెన్ అయ్యే పేజీలో మీ ఏరియా పిన్‌కోడ్ ఇంకా కావల్సిన ఫోన్‌ల సంఖ్యను ఎంటర్ చేసి నగదు చెల్లించినట్లయితే ఓ కన్ఫర్మేషన్ మెసేజ్ మీకు అందుతుంది. ఆఫ్ లైన్ పద్ధతిలో ఈ ఫోన్‌లను బుక్ చేసుకోవాలనుకునే వారు సమీపంలోని జియో స్టోర్‌కు వెళ్లవల్సి ఉంటుంది.

అమెజాన్‌లో కొన్ని ఉచితంగా దొరుకుతాయి, అవేంటో ఓ లుక్కేయండిఅమెజాన్‌లో కొన్ని ఉచితంగా దొరుకుతాయి, అవేంటో ఓ లుక్కేయండి

జియోఫోన్ స్పెసిఫికేషన్స్...

జియోఫోన్ స్పెసిఫికేషన్స్...

2.4 అంగుళాల డిస్‌ప్లే, KAI ఓఎస్, 1.2గిగాహెట్జ్ డ్యుయల్-కోర్ SPRD 9820A/QC8905 ప్రాసెసర్, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, ఎమర్జెన్సీ మెసేజ్ లోకేషన్..

ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, ఎమర్జెన్సీ మెసేజ్ లోకేషన్..

జియో ఫోన్ ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్‌తో వస్తోంది. ఫోన్ కీప్యాడ్‌లోని 5 బటన్ పై లాంగ్‌ప్రెస్ ఇవ్వటం ద్వారా ఎమర్జెన్సీ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ముందుగానే సెట్ చేసుకుని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఈ ఎమర్జెన్సీ మెసేజ్ లోకేషన్‌తో సహా షేర్ చేయబడుతుంది.

ప్రత్యేకమైన యాప్ సూట్...

ప్రత్యేకమైన యాప్ సూట్...

జియో‌ఫోన్‌లో జియో యాప్స్‌ సూట్‌తో పాటు జియోఫోన్ బ్రౌజర్, ఫేస్‌బుక్, నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌బ్రాడ్ కాస్ట్ యాప్‌లను పొందుపరిచారు. వాయిస్ కమాండ్‌లను జియో ఫోన్ సపోర్ట్ చేస్తుంది. తెలుగుతో సహా 22 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ ద్వారా UPI అలానే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు చెల్లింపులను సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Pre-booking for JioPhones have started once again. Jio's website Jio.com shows a banner that reads "Come on India join the movement" and there's a Order now button placed at the bottom of the banner.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X