JioPhone మీద ధర భారీగా పెరగనున్నది!!! డిస్కౌంట్ ఆఫర్స్ అవుట్..
ఇండియాలోని టెలికాం రంగంలోకి ప్రవేశించి కొత్త మార్పులకు శ్రీకారం సృష్టించిన రిలయన్స్ జియో తరువాత కాలంలో వినియోగదారుల కోసం సరసమైన ధరలో జియోఫోన్ ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ధరను రూ.300 వరకు పెంచే ఆలోచనలో సంస్థ ఉన్నట్లు సన్నిత వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రూ.699 ధర మీద రూ.300 పెంచి రూ.999 రిటైల్ ధరకు పెంచనున్నది.

జియోఫోన్ మీద ధర పెంపు
ఆఫ్‌లైన్ రిటైలర్లు మరియు టెల్కో జియోఫోన్ ధరను పెంచడానికి సిద్ధంగా ఉందని కొన్ని లీక్ లు తెలుపుతున్నాయి. 2019 దీపావళి సందర్భంగా జియో సంస్థ రూ.699 ధర వద్దనే జియోఫోన్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అదే ఆఫర్ ఇప్పటి వరకు అందుబాటులో ఉంది. గత సంవత్సరం ఈ ఆఫర్‌ను ప్రారంభించినప్పుడు ఇది ‘పరిమిత కాలం' ఒప్పందం అని జియో పేర్కొంది. ప్రస్తుతం దీని యొక్క డిమాండ్ తగ్గినందున జియో ఈ ఆఫర్‌ను ఒక సంవత్సరానికి పైగా నిలుపుకొని ఉండవచ్చు. ఫోన్ యొక్క ధరను పెంచడంతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు జియో రూ.125 రీఛార్జిని తప్పనిసరి చేస్తుంది. కాబట్టి ఈ ఫోన్ మొత్తం ధర 1,124 రూపాయలుగా ఉండవచ్చు. అయితే ఈ వార్తలకు సంబంధించి రాబోయే రోజుల్లో కంపెనీ అధికారిక ప్రకటన చేయవచ్చు.

JioPhone దీపావళి పండుగ ఆఫర్ వివరాలు
జియోఫోన్ మీద 2019 సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఈ ఫీచర్ ఫోన్ అందించే ధర విలువైన నిష్పత్తిపై అందరిని ఆకట్టుకున్నది. ఇది ఫీచర్ ఫోన్ అయినప్పటికీ ఇది జియో యొక్క 4G LTE నెట్‌వర్క్‌లో రన్ అవుతుంది. ఈ ఆఫర్‌లో ఉత్తమమైనది 1,500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్‌ను తొలగించడం. వినియోగదారులందరూ చెల్లించాల్సినది జియోఫోన్‌కు కేవలం రూ.699 మరియు టారిఫ్ ప్లాన్ కోసం రూ.99. మూడు సంవత్సరాలలో ఫోన్‌ను జియోకు తిరిగి ఇస్తే కస్టమర్ కు రూ.299 వరకు తిరిగి ఇస్తామని కంపెనీ తెలిపింది.

జియోఫోన్ అదనపు డేటా ప్యాక్ ఆఫర్
దీపావళి 2019 ఆఫర్ కింద ఫోన్ కొనుగోలు చేసిన ప్రతి యూజర్కు రూ.99 విలువైన అదనపు డేటా ప్యాక్‌ను జియో అందించింది. అయితే రూ.99 డేటా ప్యాక్ ప్రయోజనాన్ని పొందడానికి వినియోగదారులు నెలవారీ రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. మొత్తంమీద జియో వినియోగదారులకు రూ.1,500 (ఉచిత డేటా ప్యాక్‌లకు సుమారు 700 రూపాయలు + రూ .800 డిస్కౌంట్) ప్రయోజనాలను అదనంగా అందించింది.

జియోఫోన్ రీఛార్జ్ ఆఫర్
ఇప్పుడు జియో సంస్థ ఫోన్ యొక్క ధరను 999 రూపాయలకు పెంచాలని చూస్తున్నందున ఇది మొదటి ఏడు రీఛార్జ్‌లలో అదనపు డేటా ప్యాక్ ఆఫర్‌ను అందిస్తుందో లేదో తెలియాలసి ఉంది. జియోఫోన్ వినియోగదారులకు మొదటి రీఛార్జిగా కంపెనీ 125 రూపాయలను తప్పనిసరి చేస్తే కనుక 4G ఫీచర్ ఫోన్‌కు తగ్గుదల కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications