జియో ఫోన్లు ఎన్ని కావాలంటే అన్ని సొంతం చేసుకోవచ్చు..

Written By:

జీరోకే జియో ఫోన్ అంటూ ముకేష్ అంబాని సంచలనం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. స్మార్ట్ స్పెషిఫికేషన్లతో వస్తున్న ఈ జియో ఫీచర్ ఫోన్ ను యూజర్లు రూ. 1500 డిపాజిట్ కట్టి సొంతం చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని తిరిగి మూడేళ్ల తరువాత జియో రీఫండ్ చేస్తుంది. ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో దీన్ని బిజినెస్ గా మలుచుకునేందుకు జియో అవకాశం ఇస్తోంది.

రూ. 20 వేల ఫోన్ రూ. 10,999కే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కీప్‌ మి పోస్టెడ్‌ పేరుతో

కీప్‌ మి పోస్టెడ్‌ పేరుతో ఒక రిజిస్ట్రేషన్‌ పేజీని బ్యానర్‌గా జియో తన వెబ్‌సైట్‌లో పొందుపరించింది.

ప్రస్తుతం రెండు ఆప్షన్లను

అయితే ఈ పేజీలో అంతకముందు కేవలం ఒక్క ఆప్షన్‌ మాత్రమే ఉండేది. ఒక వ్యక్తి మాత్రమే తమ ఆసక్తిని రిజిస్ట్రర్‌ చేసుకునే ఆప్షన్‌ను ఉంచిన జియో, ప్రస్తుతం రెండు ఆప్షన్లను పెట్టింది.

బిజినెస్‌ అనే ఆప్షన్‌ను

బిజినెస్‌ అనే ఆప్షన్‌ను కూడా పెట్టింది. బిజినెస్‌ మోడ్‌లో కూడా ఈ ఫోన్‌ను ఎంటర్‌ప్రైజ్‌ యూజర్లు రిజిస్ట్రర్‌ చేసుకోవచ్చు.

 

1-5 నుంచి 50 వరకు

కాంటాక్ట్‌ నేమ్‌, కంపెనీ పేరు, పిన్‌ కోడ్‌, పాన్‌ లేదా జీఎస్టీఎన్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, కాంటాక్ట్‌ చేయాల్సిన వ్యక్తి నెంబర్‌, ఎన్ని డివైజ్‌లు అవసరమో తెలుపుతూ రిజిస్ట్రర్‌ చేసుకుంటే, బల్క్‌గా ఆర్డర్లను పొందవచ్చు. 1-5 నుంచి 50 వరకు, ఆపైనా బల్క్‌ ఆర్డర్లను బిజినెస్‌ కస్టమర్లు చేపట్టవచ్చని జియో తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

జియోఫైను కూడా

కేవలం జియో ఫోన్‌ మాత్రమే కాక, జియోఫైను కూడా యూజర్లు బల్క్‌ ఆర్డర్‌ చేయవచ్చు.

సబ్మిట్‌ నొక్కితే

ఒక్కసారి నియమ, నిబంధనలను అంగీకరించి, సబ్మిట్‌ నొక్కితే, రిజిస్ట్రర్‌ చేసుకున్నట్టు ఒక మెసేజ్‌ వస్తోంది. అంతేకాక ఈమెయిల్‌ ఐడీకి కూడా మెయిల్‌ పంపిస్తారు.

కంపెనీనే స్వయంగా

ఈ డివైజ్‌ను యూజర్లు బుక్‌ చేసుకోవడం మిస్‌ కాకూడదని కంపెనీనే స్వయంగా ప్రమోషన్‌ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ఫోన్‌ పొందడానికి, దాని అప్‌డేట్లను తెలుసుకోవడం కోసం కంపెనీ తన వెబ్‌సైట్‌లో ఈ రిజిస్ట్రర్‌ పేజీని ప్రారంభించిన సంగతి విదితమే.

ఆగస్టు 15 నుంచే

అయితే టెస్టింగ్‌కు కాస్త ముందుగానే అంటే ఆగస్టు 15 నుంచే జియో ఫోన్‌ అందుబాటులోకి వస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
JioPhone Will Be Available To Enterprise Users In Bulk, Registration Starts From August 24
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot