జియో టారిఫ్‌ల్లో భారీ మార్పులు, అన్నీ ప్రియమే!

టెల్కో దిగ్గజాలకు సవాల్ మీద సవాల్ విసురుతున్న జియో యూజర్లకు టారిఫ్ షాకిచ్చింది.

By Hazarath
|

టెల్కో దిగ్గజాలకు సవాల్ మీద సవాల్ విసురుతున్న జియో యూజర్లకు టారిఫ్ షాకిచ్చింది. పాత ప్లాన్ల ధరలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించినప్పటికీ దీపావళి నుంచి కొత్త టారిఫ్‌లు అములు చేస్తున్నట్లు వెబ్‌సైట్‌‌లో పేర్కొంది. పెంచిన టారిఫ్ పాన్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

 

అదను చూసి దెబ్బ కొట్టిన జియో, టెల్కోలకు భారీ షాక్ !అదను చూసి దెబ్బ కొట్టిన జియో, టెల్కోలకు భారీ షాక్ !

రూ.399 ప్లాన్ ఇప్పుడు రూ.459కి పెరుగుదల

రూ.399 ప్లాన్ ఇప్పుడు రూ.459కి పెరుగుదల

ఇప్పటివరకు 84 రోజుల పాటు అపరిమిత కాల్స్‌, సంక్షిప్త సందేశాలు (ఎస్‌ఎంఎస్‌), రోజుకు 1 జీబీ చొప్పున అధికవేగం 4జీ డేటా.. అనంతరం పరిమితవేగంతో అపరిమిత డేటా వినియోగానికి వీలు కల్పించే పథకానికి రూ.399 వసూలు చేస్తుండగా, ఈ ధరను రూ.459కి పెంచింది.

రూ.509 పథకం కాలపరిమితిని 56 రోజుల నుంచి 49 రోజులకు..

రూ.509 పథకం కాలపరిమితిని 56 రోజుల నుంచి 49 రోజులకు..

ఇదేవిధంగా రోజుకు 2జీబీ 4జీ డేటా అందించే రూ.509 పథకం కాలపరిమితిని 56 రోజుల నుంచి 49 రోజులకు తగ్గించింది.

 

రూ.999 పథకం కింద 60 జీబీ డేటాను 3 నెలల్లో..
 

రూ.999 పథకం కింద 60 జీబీ డేటాను 3 నెలల్లో..

రూ.999 పథకం కింద ఇప్పటివరకు 90 జీబీ డేటా ఇవ్వగా, ఇకపై 60 జీబీ డేటాను 3 నెలల్లో వాడుకోవచ్చని తెలిపింది.

రూ.149 పథకంపై 28 రోజుల పాటు 4జీబీ డేటా

రూ.149 పథకంపై 28 రోజుల పాటు 4జీబీ డేటా

రూ.149 పథకంపై ఇప్పటివరకు 2జీబీ డేటా మాత్రమే ఇవ్వగా, దీవాలీ ధమాకా కింద 28 రోజులకు 4జీబీ డేటా లభిస్తుంది.

కొత్తగా వారంరోజులకు..

కొత్తగా వారంరోజులకు..

కొత్తగా వారంరోజులకు రూ.52, రెండు వారాలకు రూ.98తో రీఛార్జి చేసుకునే పథకాలను ఆవిష్కరించింది. వీటికింద అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లకు తోడు, రోజుకు 0.15 జీబీ అధికవేగంతో, అనంతరం తక్కువ వేగంతో అపరిమిత డేటా వాడుకోవచ్చు.

రూ.4,999కి ..

రూ.4,999కి ..

రూ.1,999 రీఛార్జితో 6 నెలల్లో 125 జీబీ డేటా లభిస్తుంది. రూ.4,999కి గతంలో 210 రోజుల్లో 380 జీబీ డేటా ఇవ్వగా, ఇకపై ఏడాది కాల వ్యవధిలో 350 జీబీ డేటా వాడుకోవచ్చని తెలిపింది.

 

 

Best Mobiles in India

English summary
Jio's 84-day plan hiked to Rs 459; double data in Rs 149 scheme Read more News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X