Home
News

జియో అదిరిపోయే న్యూస్.. ఇకపై HD కాలింగ్, పల్లెల్లో చౌక ధరకే ఇంటర్నెట్..

By Ram Kumar

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో అదిరిపోయే అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఎప్పటిలాగే, తన సర్వీసులను మరింత మెరుగుపరచడంపై దృష్టి సారించిన జియో, ఇప్పుడు వాయిస్ ఓవర్ న్యూ రేడియో (VoNR) అనే సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.

కాలింగ్ టెక్నాలజీలో ఇది ఒక పెద్ద ముందడుగు, భారతదేశంలో ఈ సేవను అందిస్తున్న మొట్టమొదటి టెలికాం సంస్థ జియోనే కావడం విశేషం.

Jio s Game-Changing Move  VoNR Service Goes Live for Millions of Subscribers

* VoNR అంటే..

VoNR అనేది జియో 5G కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కాలింగ్ టెక్నాలజీ. ఇది వాయిస్ కాల్స్ క్వాలిటీని మెరుగుపరచడానికి అడ్వాన్స్‌డ్‌ 5G నెట్‌వర్క్స్‌ను ఉపయోగిస్తుంది.

చాలా టెలికాం సంస్థలు ఇప్పటికీ మెరుగైన కాల్స్ కోసం వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ (VoLTE)ని ఉపయోగిస్తుండగా, జియో మాత్రం ఒక అడుగు ముందుకేసి తన VoNR సర్వీస్ కోసం 5Gని వినియోగిస్తోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే, మీ దగ్గర జియో సిమ్, 5G-కాంపాటబుల్ ఫోన్ ఉండటం తప్పనిసరి.

* VoNR ఎలా బెస్ట్..

VoLTEతో పోలిస్తే VoNR చాలా మెరుగైన కాలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీని ద్వారా కాల్స్ HD సౌండ్ క్వాలిటీతో ఉంటాయి, అంటే మాటలు స్పష్టంగా వినిపిస్తాయి. అంతేకాకుండా, ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది, తద్వారా కస్టమర్లు అవతల వ్యక్తి మాట్లాడే ప్రతి పదాన్ని సులభంగా వినగలరు.

* లో లేటెన్సీ

మరొక ప్రయోజనం లో లేటెన్సీ, అంటే సంభాషణలలో దాదాపుగా ఎలాంటి ఆలస్యం ఉండదు. ఇది కమ్యూనికేషన్‌ను వేగంగా, సులభతరం చేస్తుంది. అంతేకాకుండా, VoNR 5G నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, తద్వారా జియో కస్టమర్లకు మెరుగైన ఓవరాల్ పెర్ఫార్మెన్స్ లభిస్తుంది.

ఈ లాంచ్‌తో, జియో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి పోటీదారుల కంటే చాలా ముందుకెళ్లిపోయింది. ఇండియన్ టెలికాం రంగంలో జియో దూకుడుకు ఇది మరో నిదర్శనం. ఇకపై మీ కాలింగ్ అనుభవం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

* గ్రామీణ ప్రాంతాల్లో చౌకైన ఇంటర్నెట్

ఇదిలా ఉండగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను చౌకగా మార్చేందుకు కొన్ని సూచనలు చేసింది. పబ్లిక్ డేటా ఆఫీసులు (PDOs) అందించే బ్రాడ్‌బ్యాండ్ ధరలను తగ్గించాలని ట్రాయ్ భావిస్తోంది. పీడీఓలు అంటే బల్క్‌గా ఇంటర్నెట్ కొనుగోలు చేసి, వై-ఫై హాట్‌స్పాట్‌ల ద్వారా కస్టమర్లకు విక్రయించే వ్యాపారాలు.

హోమ్ ఇంటర్నెట్ సర్వీసులకు సాధారణ ధరల కంటే రెండింతలు ఎక్కువ ఛార్జ్ చేయకూడదని ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ మార్పు పీఎం-వాణి ప్రోగ్రామ్ విజయవంతం కావడానికి సహాయపడుతుంది. పీఎం-వాణి కార్యక్రమాన్ని నాలుగేళ్ల కిందట గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ధరలో ఇంటర్నెట్‌ను అందించడానికి ప్రారంభించారు.

అయితే, ఇది ఇప్పటివరకు పెద్దగా పురోగతి సాధించలేదు. పీడీఓల కోసం ఇంటర్నెట్ ధరలను తగ్గించడం వల్ల ఈ ప్రోగ్రామ్ మరింత పాపులర్ అవుతుంది, అలాగే, మారుమూల ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి రావడానికి అవకాశముంది.

మెరుగైన కాలింగ్ ఎక్స్‌పీరియన్స్, మరింత సరసమైన ఇంటర్నెట్ వంటి రెండు అప్‌డేట్లు భారతదేశంలో టెక్నాలజీ జీవితాలను ఎలా మెరుగుపరుస్తుందో తెలియజేస్తున్నాయి. ఒకటి మెరుగైన కాలింగ్ అనుభవం, మరొకటి మరింత సరసమైన ఇంటర్నెట్.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio launched VoNR for superior 5G call quality. Separately, TRAI aims to lower rural internet costs by regulating Public Data Offices (PDOs), potentially boosting the PM-WANI initiative.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X