మళ్లీ 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో దూసుకొచ్చిన జియో, రూ. 700 వరకు..

Written By:

దేశీయ టెలికాం రంగంలో జియో రోజు రోజుకు సరికొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూ దిగ్గజాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సర్‌ప్రైజ్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ గడువు ముగిసిపోవడంతో ఇప్పుడు తాజాగా మరో కొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. జియో యూజర్లు చేసుకునే రీఛార్జ్ లపై 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిచనుంది. అంటే 398 రూపాయలు, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై మొత్తం 700 రూపాయల వరకు అంటే 100 శాతానికి పైగా క్యాష్‌బ్యాక్‌ను పొందనున్నట్టు జియో పేర్కొంది.

దేశీయ దిగ్గజం తొలి సవాల్, తొలి ఆండ్రాయిడ్ గో మొబైల్ మనదే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

100 శాతానికి పైగా క్యాష్‌బ్యాక్‌..

రిలయన్స్‌ జియో వెబ్‌సైట్‌ ప్రకారం '100 శాతానికి పైగా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌' జియో ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలిస్తోంది. 2018 జనవరి 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంచనున్నట్టు జియో వెబ్‌సైట్‌ పేర్కొంది.

రెండు విధాలుగా యూజర్లు..

కాగా రెండు విధాలుగా యూజర్లు 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందనున్నారు. వాటిల్లో ఒకటి జియో టారిఫ్‌ ప్లాన్‌ రీఛార్జ్‌, రెండు డిజిటల్‌ వాలెట్ల రీఛార్జ్‌. వీటి ద్వారా ఈ క్యాష్‌బ్యాక్‌ యూజర్లకు లభిస్తుంది.

ప్రతి రీఛార్జ్‌పై..

398 రూపాయలు, లేదా ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై తన ప్రైమ్‌ మెంబర్లకు జియో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను గ్యారెంటీ ఇస్తోంది. ప్రతి రీఛార్జ్‌పై 400 రూపాయల విలువైన క్యాష్‌బ్యాక్‌ను, 50 రూపాయల ఎనిమిది ఓచర్ల రూపంలో అందిస్తుంది.

మైజియో యాప్‌లో మై ఓచర్లలో..

ఇవి కస్టమర్ల అకౌంట్‌లోకి రీఛార్జ్‌ చేసుకున్న వెంటనే క్రెడిట్‌ అవుతాయి. మైజియో యాప్‌లో మై ఓచర్లలో ఇవి కనిపిస్తాయి. ఈ ఓచర్లను తర్వాత చేసుకునే 300 రూపాయలు, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రిడీమ్‌ చేసుకోవచ్చు.

డిజిటల్‌ వాలెంట్లతో జియో భాగస్వామ్యం

దీంతో పాటు దిగ్గజ డిజిటల్‌ వాలెంట్లతో జియో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఫ్రీఛార్జ్‌, మొబిక్విక్‌, పేటీఎం, అమెజాన్‌ పే, ఫోన్‌పే, భీమ్‌, యాక్సిస్‌పే ద్వారా పేమెంట్‌ చేసిన జియో ప్రైమ్‌ మెంబర్లకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ కింద రూ.300 వరకు అందిస్తుంది.

మొత్తంగా 700 రూపాయల వరకు

అంటే మొత్తంగా 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ జియోప్రైమ్‌ మెంబర్లకు ఆఫర్‌ చేస్తుంది. మరిన్ని వివరాలకు జియో వెబ్‌సైట్ ను సంప్రదించగలరు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio's 'Get More Than 100% Cashback Offer' Gives Up To Rs. 700 Cashback. Details Here More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot