జియో అదిరిపోయే ప్లాన్ లాంచ్.. రూ. 200లోపే వాడుకున్నంత 5G డేటా..!
Jio Prepaid Plan: స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా.. డేటా అయిపోయిందా లేక ఎక్కువ డేటా కోసం చూస్తున్నారా అయితే మీకో గుడ్ న్యూస్. దేశంలోనే నంబర్ వన్ టెలికాం సంస్థ అయిన జియో, వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్‌లతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా జియో యూజర్లకు బడ్జెట్ ధరల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. ఇకపై డేటా గురించి టెన్షన్ పడకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. కేవలం రూ.200 లోపే ఈ ప్లాన్స్ అందుబాటులో ఉండటం విశేషం.
రూ.198 ప్లాన్‌తో 14 రోజులు ఫుల్ ధమాకా
జియో రూ.198 ప్లాన్‌లో మీకు లభించే బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారు. ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉచితం, రోజుకి 2GB డేటా (మొత్తం 14 రోజులకు 28GB), రోజుకి 100 SMSలు.. ఇవే కాకుండా జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్స్‌కి కూడా ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది.

అసలైన హైలైట్ ఏంటంటే.. 5G నెట్‌వర్క్ ఉన్న ఏరియాల్లో మీరుంటే అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ కేవలం 14 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రెండు వారాల సమయంలో హాయిగా ఓటీటీ కంటెంట్ కంటిన్యూగా చూస్తూ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్‌గా నిలుస్తుంది.
* రూ.349 ప్లాన్
ఒకవేళ మీకు ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కావాలంటే, జియో రూ.349 ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ.198 ప్లాన్‌లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఇందులోనూ ఉంటాయి. కాకపోతే ఇది డబుల్ వ్యాలిడిటీతో వస్తుంది అంతే. అంటే నెలంతా డేటా, కాలింగ్ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు.
* రూ.19, రూ.29 ప్లాన్స్‌లో మార్పులు
జియో తన చిన్న ప్లాన్స్‌లో కూడా కొన్ని మార్పులు చేసింది. రూ.19 ప్లాన్ ఇప్పుడు కేవలం ఒక్క రోజు మాత్రమే వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 1GB డేటా ఉంటుంది. ఈ డేటాను ఒక్క రోజులోనే వాడుకోవాలి. చిన్నచిన్న అవసరాలు ఉన్నప్పుడు ఈ యాడ్ ఆన్ ప్యాక్‌తో రీఛార్జి చేసుకోవచ్చు.
రూ.29 ప్లాన్ 2 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకి 1GB డేటా చొప్పున 2GB డేటా లభిస్తుంది. చిన్న డేటా ప్లాన్స్ వాడేవారికి ఈ మార్పులు గమనించడం ముఖ్యం. ఈ ధర కంటే ఎక్కువ డేటా ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని రీఛార్జి ప్లాట్‌ఫామ్స్ వేదికగా చెక్ చేయవచ్చు.
* జియో ఎయిర్‌ఫైబర్
జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్, టీవీ ఛానెల్స్, ఓటీటీ యాప్స్.. అన్నీ ఒకే ప్యాకేజీలో పొందొచ్చు. జియో ఎయిర్‌ఫైబర్ యూజర్లకు 30 Mbps నుంచి 1 Gbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులో ఉంటుంది. 800 కంటే ఎక్కువ టీవీ ఛానెల్స్ యాక్సెస్ చేయవచ్చు.
డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి 13 కంటే ఎక్కువ ఓటీటీ యాప్స్‌లోని సినిమాలు, షోలు కూడా ఫ్రీగా లభిస్తుంది. 30 Mbps ఎయిర్‌ఫైబర్ ప్లాన్ ఎంచుకోవచ్చు. 30 Mbps స్పీడ్‌తో జియో ఎయిర్‌ఫైబర్‌లో రెండు ప్లాన్స్ ఉన్నాయి. రూ.599 ప్లాన్‌లో 1,000GB డేటా 30 Mbps స్పీడ్‌తో లభిస్తుంది.
ఉచిత వాయిస్ సర్వీస్‌తో పాటు జియోసినిమా, ZEE5, సన్ NXT, ఆల్ట్‌బాలాజీ వంటి ఓటీటీ యాప్స్‌కి కూడా యాక్సెస్ ఉంటుంది. ఈ ప్లాన్ 3 నెలలు, 6 నెలలు లేదా 12 నెలల వ్యాలిడిటీతో తీసుకోవచ్చు. రెండోది రూ.888 ప్లాన్. ఈ ప్లాన్‌లో రూ.599 ప్లాన్‌లోని బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి.
అదనంగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ 2 ఏళ్ల వరకు ఉంటుంది. 100 Mbps స్పీడ్‌తో కూడా రెండు ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్ ఉన్నాయి. రూ.899 ప్లాన్ రూ.599 ప్లాన్ లాంటిదే, కాకపోతే ఇక్కడ 100 Mbps స్పీడ్ లభిస్తుంది. మిగతా బెనిఫిట్స్ అన్నీ సేమ్ ఉంటాయి.
రూ.1,199 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్ లైట్, ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్స్ కూడా లభిస్తాయి. 100 Mbps స్పీడ్‌తో పాటు ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. స్పీడ్ విషయంలో రాజీ పడకుండా ఉండాలనుకుంటే, జియో 1 Gbps ప్లాన్‌ను కూడా అందిస్తోంది.
రూ.3,999 ప్లాన్‌లో 1,000GB డేటా 1 Gbps స్పీడ్‌తో లభిస్తుంది. 300 Mbps ప్లాన్‌లో ఉన్న ఓటీటీ బెనిఫిట్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు ప్రీమియం ఓటీటీ కంటెంట్ కావాలనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications








