జియో బంపర్ ఆఫర్.. ఈ పాపులర్ ప్లాన్స్ చూస్తే ఇక వేరే నెట్‌వర్క్ జోలికే పోరు!
Jio Recharge: జియో రీసెంట్‌గా రీఛార్జ్ ధరలు పెంచేసింది. దాంతో చాలామంది యూజర్లు ఇప్పుడు బెస్ట్ వాల్యూ ప్లాన్స్ కోసం వెతుకుతున్నారు. మీరూ చవకైన, ఉత్తమమైన అన్‌లిమిటెడ్ 5G డేటా, ఫ్రీ కాల్స్, ఎక్కువ వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్నారా, అయితే మీకోసం అదిరిపోయే మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కాస్త కాస్ట్లీ అనిపించినా, చాలా ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి ఆఫర్ చేసే ప్రయోజనాలకు అంత ధర చెల్లించడం సమంజసమే అనిపిస్తుంది.
* జియో రూ.349 ప్లాన్
నెలనెలా రీఛార్జ్ చేసుకునేవాళ్లకి ఈ రూ.349 ప్లాన్ ఉత్తమంగా నిలుస్తుంది. 28 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో, రోజుకి 2GB 4G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా వాడుకోవచ్చు. అంతేకాదు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా ఫ్రీ. అంటే ఏ నెట్‌వర్క్ సిమ్‌కి అయినా ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడుకోవచ్చు.

రోజూ డేటా ఎక్కువ వాడేవాళ్లకి, సర్వీస్ అదిరిపోవాలనుకునేవాళ్లకి ఈ ప్లాన్ సెట్ అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటూనే, బెనిఫిట్స్ మాత్రం చాలా ప్రయోజనకరంగ ఉంటాయి. జియో యాప్, వెబ్‌సైట్ లేదా ఇతర పేమెంట్ యాప్స్ ద్వారా ఈ ప్లాన్ కు రీఛార్జ్ చేసుకోవచ్చు.
* జియో రూ.749 ప్లాన్
ప్రతి నెలా రీఛార్జ్ వద్దనుకుంటే, రూ.749 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. దీని వ్యాలిడిటీ 72 రోజులు అంటే దాదాపు రెండు నెలలకు పైనే. ఇందులో అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు రోజుకి 2GB 4G డేటా వస్తుంది. ఇంకా బోనస్‌గా 20GB ఎక్స్‌ట్రా 4G డేటా కూడా ఇస్తారు. 72 రోజుల్లో ఈ డేటా వాడుకోవచ్చు.
అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా ఉన్నాయి. అధిక వ్యాలిడిటీతో పాటు ఎక్స్‌ట్రా డేటా కావాలనుకునేవాళ్లకి ఈ ప్లాన్ చాలా ఉత్తమంగా నిలుస్తుంది. 5G కవరేజ్ అంతంతమాత్రంగా ఉన్న ఏరియాల్లో ఇది బాగా యూజ్ అవుతుంది. ఒక నెల కంటే ఎక్కువ వ్యాలిడిటీ ప్లాన్ కావాలనుకునే వారు దీనికి రీఛార్జి చేసుకోవచ్చు
* జియో రూ.3599 ప్లాన్
ఏడాది మొత్తం ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే బెటర్ అనుకునేవాళ్లకి రూ.3599 ప్లాన్ ఉత్తమంగా నిలుస్తుంది. 365 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో, రోజుకి 2.5GB 4G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా ఇస్తారు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా ఉన్నాయి. నెలకి దాదాపు రూ.299.92 మాత్రమే ఖర్చు అవుతుంది.
బాగా డేటా వాడే యూజర్స్‌కి, మళ్లీ మళ్లీ రీఛార్జ్ తలనొప్పి వద్దనుకునేవాళ్లకి ఇది చాలా మంచి ఆప్షన్. ఇతర రీఛార్జిలు కూడా చెక్ చేసుకోవచ్చు అయితే ఇవి మనం పెట్టిన డబ్బుకు తగిన ప్రయోజనాలు లేదా అంతకు మించిన ప్రయోజనాలు అందిస్తున్నాయి కాబట్టి ఇవి బాగా పాపులర్ అవుతున్నాయి.
* జియో భవిష్యత్ ప్లాన్స్
ఇదిలా ఉండగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ చేశారు. జియో ఇండియాలోనే వరల్డ్ బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తోందట. అంబానీ చెప్పిన దాని ప్రకారం, AI ఇండియాను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్‌లో లీడర్‌గా మార్చడంలో కీ రోల్ ప్లే చేయబోతోంది.


Click it and Unblock the Notifications








