Home
News

జియో రోజుకు 4.5 జిబి డేటా ప్లాన్ గురించి తెలుసా ?అత్యంత తక్కువ ధరకే !

సరికొత్త ఆఫర్లతో ఇతర టెలికం సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తున్న రిలయన్స్ జియో తాజాగా మరో కొత్త ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చింది.

By Hazarath Aiah

సరికొత్త ఆఫర్లతో ఇతర టెలికం సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తున్న రిలయన్స్ జియో తాజాగా మరో కొత్త ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రకటించిన రూ.299 ప్లాన్‌లో అదనంగా 1.5 జీబీల డేటాను అందిస్తున్నది. కాగా గతంలో రోజుకు 3జీబీల డేటా అందిస్తుండేది. ఫిఫా వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని డేటా పరిధిని మరింత పెంచినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, రోమింగ్), ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చును. డబుల్ ధమాకా పేరుతో సంస్థ ఇటీవల ప్రకటించిన రూ.149, రూ.399 ప్యాక్‌లపై రోజుకు 3జీబీల డేటాను అందిస్తున్నది. వీటిలో రూ.299ని అప్‌గ్రేడ్ చేసింది. ఈ సంధర్భంగా జియో కోడ్స్ గురించి ముఖ్యమైన సమాచారం తెలుసుకోండి.

ప్రీపెయిడ్‌ యూజర్లకు

ప్రీపెయిడ్‌ యూజర్లకు

కంపెనీ తన ప్రీపెయిడ్‌ యూజర్లకు కొత్తగా డబుల్‌ ధమాకా ఆఫర్‌ ప్రకటించింది. ఎయిర్‌టెల్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చేలా జియో త‌న వినియోగ‌దారుల‌కు రోజూ 1.5 జీబీ అద‌న‌పు డేటాను అందిస్తోంది. జియోలో రోజువారీ డేటా లిమిట్ ప్లాన్ల‌ను వాడేవారికి ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.ఈ రోజు సాయంత్రం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఈ అదనపు డేటా అందుకోవచ్చు. పూర్తి వివరాల్లోకెళితే..

రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్ల‌కు ..

రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్ల‌కు ..

జియో ప్ర‌క‌టించిన ఆఫర్ ప్ర‌కారం.. రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రోజుకు 1.5 జీబీ డేటా ల‌భించగా ఇక‌పై రోజుకు 3 జీబీ డేటా ల‌భిస్తుంది.

రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్ల‌లో..

రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్ల‌లో..

రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్ల‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 2 జీబీ డేటా వ‌స్తుండ‌గా ఇక‌పై రోజుకు 3.5 జీబీ డేటా ల‌భిస్తుంది.

రూ.299 ప్యాక్‌..

రూ.299 ప్యాక్‌..

రోజుకు 3 జీబీ డేటా పొందే రూ.299 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 4.5 జీబీ డేటా పొందనున్నారు.

రూ.509 ప్యాక్‌

రూ.509 ప్యాక్‌

రోజుకు 4 జీబీ డేటా పొందే రూ.509 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 5.5 జీబీ డేటా పొందనున్నారు.

రూ.799 ప్యాక్‌

రూ.799 ప్యాక్‌

రోజుకు 5 జీబీ డేటా పొందే రూ.799 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 6.5 జీబీ డేటా పొందనున్నారు.

300 రూపాయల రీఛార్జ్‌లపై

300 రూపాయల రీఛార్జ్‌లపై

దీంతో పాటు 300 రూపాయలు, ఆపై మొత్తాల అన్ని రీఛార్జ్‌లపై జియో 100 రూపాయల డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌లపై 20 శాతం తగ్గింపు ఇస్తోంది.

మైజియో యాప్‌

మైజియో యాప్‌

ఈ డిస్కౌంట్‌ల కోసం మైజియో యాప్‌, పేటీఎం వాడుతూ ఫోన్‌పే వాలెట్‌ ద్వారానే రీఛార్జ్‌ చేయించుకోవాలి. పైన పేర్కొన్న ప్యాక్‌ల వాలిడిటీలను మాత్రం కంపెనీ మార్చలేదు.

అపరిమిత వాయిస్‌ కాల్స్‌

అపరిమిత వాయిస్‌ కాల్స్‌

డేటాతో పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్స్‌ యాక్సస్‌ను పొందవచ్చు.

రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌

రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌

మరోవైపు తాజాగా తీసుకొచ్చిన రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌, 91 రోజుల వాలిడిటీలో అందుబాటులో ఉండనుంది. దీనిపై రోజుకు 3.5 జీబీ డేటాను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. మొత్తంగా ఈ ప్యాక్‌పై 318 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు.

గతేడాది డిసెంబర్‌లో

గతేడాది డిసెంబర్‌లో

జియో గతేడాది డిసెంబర్‌లో రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది కానీ ఆ అనంతరం ఈ ప్యాక్‌ ధరను రూ.449కు తగ్గించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio's Rs. 299 Prepaid Plan Offers 4.5 GB Per Day Data, Unlimited Calling More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X